అన్వేషించండి

Navaratri Day 4: నవరాత్రి ఉత్సవాల్లో నాలుగో రోజు శ్రీ కాత్యాయని దేవిగా కనకదుర్గ - పూజా విధానం, నైవేద్యం వివరాలు ఇవే!

Shardiya Navratri 2025: శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సెప్టెంబర్‌ 25న నాలుగో రోజు శ్రీ కాత్యాయినీ దేవి అలంకారంలో దర్శనమిస్తోంది ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గ...ఈ అలంకారం విశిష్టత ఇదే..

Sri Katyayani Devi: విజయవాడ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. రోజుకో అలంకారంలో దుర్గాదేవి భక్తులను అనుగ్రహిస్తోంది.  శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మొదటి మూడు రోజులు బాలా త్రిపురసుందరి, గాయత్రిదేవి, అన్నపూర్ణ అలంకారంలో దర్శనమిచ్చిన  దుర్గమ్మ..నాలుగో రోజు శ్రీ కాత్యాయనీ దేవిగా భక్తులను అనుగ్రహిస్తోంది. 

శ్రీ కాత్యాయనీ అమ్మవారికి ఈ రోజు...

అమ్మవారికి ఈ రోజు పసుపు రంగు చీర సమర్పిస్తారు

అరటిపండ్లు నైవేద్యంగా సమర్పిస్తారు

పాయసాన్నం నివేదిస్తారు
 
సింహవాహనంపై కొలువై అభయం ఇచ్చే కాత్యాయనీ మాత అలంకారంలో అమ్మవారిని దర్శించుకునేవారికి చతుర్విధ పురుషార్ధాల ఫలం లభిస్తుందని చెబుతారు.

శ్లోకం

‘చంద్ర హాజ్జ్వల కరా శార్దూల వరవాహనా
కాత్యాయనీ శుభం దద్యాత్‌ దేవీ దానవ ఘాతినీ’

కాత్యాయనుడు అనే మహర్షి తపస్సు ఆచరించి.. స్వయంగా అమ్మవారే తన ఇంట పుత్రికగా జన్మించాలని వరం కోరుకున్నాడు. అలా ఆ మహర్షి ఇంట జన్మించింది అమ్మవారు. కాత్యాయన మహర్షి కుమార్తె కాబట్టి...కాత్యాయని అనే పేరు. అభయవర ముద్రలతో పాటు  ఖడ్గాన్నీ, పద్మాన్నీ ధరించి కనిపిస్తుంది కాత్యాయని. అజ్ఞానాన్ని దహించే చిహ్నం పద్మం , ఆపదలు ఎదుర్కొనేందుకు సూచన ఖడ్గం...అలా  అజ్ఞానాన్ని, ఆపదలను దూరం చేసే స్వరూపం కాత్యాయని.
 
ధర్మార్థ కామ మోక్షాలకు అధికారిణి అయిన శ్రీ కాత్యాయని మహిషాసుర సంహారంలో దుర్గాదేవికి సహాయం చేసిందని స్కాంద పురాణంలో ఉంది. 

ఆజ్ఞా చక్రానికి అధిష్ఠాన దేవత అయిన శ్రీ కాత్యాయని దుర్గ..ఆజ్ఞా చక్రాన్ని జాగృతపరచి ఏకాగ్రతను ప్రసాదిస్తుంది. అందుకే కాత్యాయనీ అమ్మవారిని పూజిస్తే విద్యార్థులకు తెలివితేటలు పెరుగుతాయని చెబుతారు. అవివాహుతులు పూజిస్తే వివాహానికి ఎదురైన ఆటంకాలు తొలగిపోతాయి. ఉత్తమ జీవిత భాగస్వామి లభిస్తారు.
 
కాత్యాయనీ ఆరాధన విశిష్టత
 
శ్రీ కాత్యాయని దేవి అమ్మవారి అలంకరణను పూజించి..పసుపురంగు చీర సమర్పించి..అరటిపండ్లు, పాయసాన్నం నివేదిస్తే జాతకంలో ఉండే  కుజ దోషం, బృగు దోషం తొలగిపోయి సకాలములో వివాహం జరుగుతుంది. ఈ రోజు కాత్యాయనీ వ్రతం ఆచరించిన తర్వాత విద్వత్తు ఉన్న పండితుడికి  ఉలవలు, విభూధి, ఎరుపు లేదా బూడిద వర్ణం దుస్తులు దానంగా ఇచ్చి ఆశీర్వాదం తీసుకుంటే జాతకంలో ఉండే దోషాలు తొలగిపోతాయి. అప్పుల బాధల నుంచి గట్టెక్కే మార్గం కనిపిస్తుంది. వాహన గండాలు దాటుతాయి..వాహనయోగం కలుగుతుంది. దాంపత్య జీవితంలో వివాదాలు తొలగిపోతాయి. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ పెరుగుతుంది.

గమనిక:   ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించింది మాత్రమే. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించనవి.  ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి. 

అమ్మవారి శరీరంలో 18 భాగాలు పడిన ప్రదేశాలివే, ఒక్కటి దర్శించుకున్నా పుణ్యమే

శ్రీశైలం శక్తిపీఠంలో శరన్నవరాత్రి ఉత్సవాలు! 2025లో భ్రమరాంబిక అమ్మవారి అలంకారాలు ఇవే!

నవరాత్రులు ఆధ్యాత్మికంగానే కాదు.. మానసిక శారీరక ఆరోగ్య సాధన కూడా - అందుకే పూజలో ఈ 3 తప్పులు చేయకండి!.. పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

2025 శరన్నవరాత్రుల్లో ఏ రోజు ఏ అలంకారం? ఏ రోజు ఏ నైవేద్యం సమర్పించాలి? పూర్తి వివరాల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read
ఇంకా చదవండి
Sponsored Links by Taboola
Advertisement

టాప్ హెడ్ లైన్స్

స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Turmeric Water : రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
Advertisement

వీడియోలు

G RAM G Bill | లోక్‌సభలో ఆమోదం పొందిన జీరామ్‌జీ బిల్లుని ప్రతిపక్షాలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి? | ABP Desam
గిల్ విషయంలో బీసీసీఐ షాకిండ్ డెసిషన్..గాయం సాకుతో వేటు?
జాక్‌పాట్ కొట్టేసిన ఆర్సీబీ.. ఐపీఎల్‌ మినీ వేలంలో ఆర్సీబీ ఆ పాయింట్‌పైనే ఫోకస్ చేసిందా?
విధ్వంసం c/o SRH.. ఈసారి టైటిల్ ఆరెంజ్ ఆర్మీదే?
అక్కడే ఎందుకు?.. 4వ టీ20 మ్యాచ్ రద్దుపై ఫ్యాన్స్ సిరియస్
Advertisement

ఫోటో గ్యాలరీ

Advertisement
ABP Premium

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
స్వర్ణాంధ్ర 2047: పది సూత్రాలతో నవ్యాంధ్ర పరివర్తన! సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్
TFTDDA President : TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
TFTDDA ప్రెసిడెంట్‌గా జానీ మాస్టర్ భార్య - సినీ రాజకీయ ప్రముఖుల సమక్షంలో ప్రమాణ స్వీకారం
Most Expensive Vegetables : ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
ఇండియాలో ఖరీదైన కూరగాయలు ఇవే.. వందల్లో కాదు వేలు, లక్షల్లో
Turmeric Water : రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
రోజూ పసుపు నీరు తాగితే ఆరోగ్యానికి మంచిదే కానీ.. ఈ Side Effects తెలిస్తే షాక్ అవుతారు
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
ఎగిరే రథాల నుంచి కదిలే విగ్రహాలు, తుప్పు పట్టని స్తంభాల వరకు ఆశ్చర్యపరిచే విజ్ఞానం - పురాతన భారతదేశ అద్భుత సాంకేతికత!
Avatar Fire And Ash: 'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
'అవతార్ ఫైర్ అండ్ యాష్' బడ్జెట్ నుంచి నటీనటుల వరకు... జేమ్స్ కామెరూన్ సినిమా సంగతులు
Revanth Reddy Chit Chat: మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
మెస్సీ ఈవెంట్ ప్రైవేట్ ఈవెంట్ - ఫార్ములా ఈ కేసులో చర్యలు అప్పుడే - సీఎం రేవంత్ చిట్ చాట్
Year Ender 2025: మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
మతపరమైన గొడవల నుంచి ఆందోళనల వరకు... 2025లో వివాదాలు ఎదుర్కొన్న స్టార్స్‌ సినిమాలు
Embed widget