Kanuma Festival : కనుమ ప్రత్యేకత ఏంటి.. ఈ రోజు ప్రయాణం చేస్తే ఏమవుతుంది...
సంక్రాంతి పండుగలో మూడోరోజు కనుమ. మొదటి రెండు రోజులు మనకి..మూడోరోజు కనుమ పండుగ పశువులు, పక్షులకు కృతజ్ఞతలు చెప్పేందుకు చేసుకుంటారు. కొందరు సంక్రాంతితో పాటూ కనుమ రోజు కూడా పితృదేవతలనీ స్మరించుకుంటారు
ఆరుగాలం శ్రమించే రైతన్నలకు వ్యవసాయంలో అండగా నిలిచేవి పశువులే. అందుకే మూడు రోజుల సంక్రాంతి వేడుకల్లో ఒక రోజును పశువులకు కృతజ్ఞతలు తెలపడానికి కేటాయిస్తారు. అదే కనుమ పండుగ. వ్యవసాయంలో సాయం చేసిన పశువులను కుటుంబ సభ్యుల్లా భావిస్తారు రైతులు. కొత్త ధాన్యం ఇంటికి వచ్చే సందర్భంగా జరుపుకునే వేడుక సందర్భంగా ఈ రోజంతా వాటితో ఏపనీ చేయించరు. వాటిని అందంగా అలంకరించి పూజలు చేస్తారు. కొందరైతే కొమ్ములకు ఇత్తడి తొడుగులు, మూపురాల మీద పట్టుబట్టలు, కాళ్లకి గజ్జలు, మెడలో పూలదండలు.. ఇలా చక్కగా అలంకరిస్తారు. పశువులతో పాటూ పక్షులను కూడా ఆదరించే సంప్రదాయం ఉంది. అందుకే ధాన్యపు కంకులను ఇంటి చూర్లకు వేడాలడదీస్తారు. వాటికోసం ఇంటి చుట్టూ చేరిన చిన్న చిన్నపిట్టలు, పక్షుల కిలకిలరావాలతో ఆ ప్రాంగణం అంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. పంట చేతికందేందుకు సహాయపడిన వారిందరికీ ఈ రోజున కొత్త బట్టలు కూడా పెడతారు.
Also Read: ఉత్తరాయణ పుణ్యకాలం అంటారు … మరి దక్షిణాయణం ఏంటి…!
- కనుమ రోజున జోరుగా కోడిపందాలు, ఎడ్ల పందాలు కూడా నిర్వహిస్తారు. కోర్టు నిషేధం విధించినా, పోలీసులు నిఘా పెట్టినా పందె రాయుళ్లు మాత్రం తగ్గేదే లేఅంటారు.
- మాంసాహారం తినేవారికి ఈ రోజు ప్రత్యేకమైనది. ప్రతి ఇంట్లో ముక్క ఉండాల్సిందే. కనుమ రోజున మాంసాహారం తినడం కూడా ఆనవాయితీ.
- కనుమ రోజున మినుము తినాలనేది సామెత: మాంసం తినని వారికి దాంతో సమానమైన పోషకాలని ఇచ్చేవి మినుములు. అందుకే గారెలు, మాంసంతో... ఈ రోజు పెద్దలకి ప్రసాదం పెడతారు. అందుకే ‘కనుమ రోజు మినుములు తినాలి' అనే సామెత మొదలైంది. మినుములు ఈ చలికాలంలో ఒంట్లో తగినంత వేడిని పెంచేందుకు కూడా ఉపయోగపడతాయి.
- కనుమ రోజున ప్రయాణాలు చేయడం అరిష్టంగా భావిస్తారు.
సంక్రాంతి అంటే మూడు రోజుల పండుగ...ఇల్లంతా బంధువులతో కళకళాలాడే సమయంలో మూడో రోజు ఎవరిళ్లకు వాళ్లు ప్రయాణం కావడం వల్ల చాలా ఆనందాన్ని మిస్ అవుతారనే ఉద్దేశంతో కూడా కనుమ రోజు ప్రయాణం చేయరాదని చెబుతారని అంటారు. అందుకే ‘కనుమ రోజు కాకి కూడా కదలదు’ అనే సామెత పుట్టి ఉండొచ్చంటారు. మరికొందరైతే పెద్దలు చెప్పారంటే దాని వెనుక ఏదో ఆంతర్యం ఉంటుందన.... కనుమ రోజు ఎక్కడికైనా ప్రయాణ చేస్తే వెళ్లిన పని పూర్తికాదని, ఆటంకాలు తప్పవని కూడా అంటారు. అయినా ఎవరి సెంటిమెంట్స్ వాళ్లవి...
Also Read: బసవన్నగా శివయ్య , హరిదాసుగా శ్రీహరి .. ఆ సంబరమే వేరప్పా…
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
Also Read: అన్నమయ్య పాటల్లోనూ సంక్రాంతి గొబ్బిళ్లకు ప్రత్యేక స్థానం...
Also Read: ఏడాదంతా పండుగలే.. మరి సంక్రాంతినే పెద్దపండుగ అంటారెందుకు...