News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X

Shravan Shanivar Photos: శ్రావణ మాసంలో శనివారం కూడా చాలా ప్రత్యేకం , ఎందుకంటే!

శ్రావణ మంగళవారం, శ్రావణ శుక్రవారం మాత్రమే కాదు శ్రావణమాసంలో శనివారం కూడా చాలా ప్రత్యేకం...ఎందుకంటే..

FOLLOW US: 
Share:

శ్రావణమాసం అంటే శ్రవణా నక్షత్రంలో పౌర్ణమి వస్తుంది కాబట్టి ఈ మాసాన్ని శ్రావణమాసం అంటారు. శ్రవణం నక్షత్రం శ్రీ మహావిష్ణువుది. శ్రీ మహావిష్ణువు అవతారాల్లో బాగంగా కలియుగంలో శ్రీ వేంకటేశ్వరస్వామిగా దర్శనమిస్తున్నాడు. శ్రీనివాసుడి నక్షత్రం శ్రవణం. ఆయనకు ప్రీతికరమైన రోజు శనివారం. అందుకే శ్రావణమాసంలో వచ్చే శనివారాలు ప్రత్యేకమైనవి అయితే శ్రవణం నక్షత్రం కలిసొస్తే మరింత ప్రత్యేకం అని చెబుతారు పండితులు. అప్పట్లో శ్రావణశనివారం వ్రతాలు చేసేవారు. అందుకే ఈ నెలలో వచ్చే అన్ని శనివారాలు కుదరకపోయినా ఒక్క శనివారం అయినా శ్రీ వేంకటేశ్వరుడిని భక్తిశ్రద్ధలతో పూజిస్తే సకల శుభాలు జరుగుతాయని, కలిదోషం తొలగిపోతుందని అంటారు. 

Also Read: శ్రావణమాసం ప్రారంభమైంది, వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1

శనివారం అంటే శనిదోషాల నివృత్తి కోసం శ్రీ వేంకటేశ్వరుని ఆరాధన చేస్తారు. ఈ శ్రావణ శనివారం రోజున ప్రత్యేకంగా వేంకటేశ్వరునికి దీపారాధన చేసి పూజిస్తారు. పూజాగదిలో గోడకు కొద్దిగా పసుపు రాసి, దాని మీద కుంకుమతో శ్రీ వేంకటేశ్వర స్వామి నామం దిద్దాలి. ఆవుపాలు, బెల్లం, బియ్యపుపిండితో చలిమిడి కలిపి దానితో ప్రమిద చేసి ఆవునెయ్యి వేసి దీపం వెలిగించాలి. జ్యోతి స్వరూపుడైన వేంకటేశ్వరస్వామిని గంధం, పుష్పం, ధూపం, నైవేద్యం సమర్పించి అష్టోత్తర శతనామావళితో అర్చించాలి. 

Also Read: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2

శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి
1. ఓం శ్రీవేంకటేశ్వరాయ నమ: 
2. ఓం అవ్యక్తాయ నమ: |
3. ఓం శ్రీశ్రీనివాసాయ నమ: |
4. ఓం కటిహస్తాయ నమ: |
5. ఓం లక్ష్మీపతయే నమ: |
6. ఓం వరప్రదాయ నమ: |
7. ఓం అనమయాయ నమ: |
8. ఓం అనేకాత్మనే నమ: |
9. ఓం అమృతాంశాయ నమ: |
1-. ఓం దీనబంధవే నమ: |
11. ఓం జగద్వంద్యాయ నమ: |
12. ఓం ఆర్తలోకాభయప్రదాయ నమ: |
13. ఓం గోవిందాయ నమ: |
14. ఓం ఆకాశరాజ వరదాయ నమ: |
15. ఓం శాశ్వతాయ నమ: |
16. ఓం యోగిహృత్పద్మ మందిరాయ నమ: |
17. ఓం ప్రభవే నమ: |
18. ఓం దామోదరాయ నమ: |
19. ఓం శేషాద్రినిలయాయ నమ: |
20. ఓం జగత్పాలాయ నమ: |
21. ఓం దేవాయ నమ: |
22. ఓం పాపఘ్నాయ నమ: |
23. ఓం కేశవాయ నమ: |
24. ఓం భక్తవత్సలాయ నమ: |
25. ఓం మధుసూదనాయ నమ: |
26. ఓం త్రివిక్రమాయ నమ: |
27. ఓం అమృతాయ నమ: |
28. ఓం శింశుమారాయ నమ: |
29. ఓం మాధవాయ నమ: |
30. ఓం జటామకుటశోభితాయ నమ: |
31. ఓం కృష్ణాయ నమ: |
32. ఓం శంఖమధ్యోల్లసన్మంజుక కిణ్యాఢ్య కరందరాయ నమ: |
33. ఓం శ్రీహరయే నమ: |
34. ఓం నీలమేఘశ్యామ తనవే నమ: |
35. ఓం జ్ఞానపంజరాయ నమ: |
36. ఓం బిల్వపత్రార్చన ప్రియాయ నమ: |
37. ఓం శ్రీవత్సవక్షసే నమ: |
38. ఓం జగద్వ్యాపినే నమ: |
39. ఓం సర్వేశాయ నమ: |
40. ఓం జగత్కర్త్రే నమ: |
41. ఓం గోపాలాయ నమ: |
42. ఓం జగత్సాక్షిణే నమ: |
43. ఓం పురుషోత్తమాయ నమ: |
44. ఓం జగత్పతయే నమ: |
45. ఓం గోపీశ్వరాయ నమ: |
46. ఓం చింతితార్ధ ప్రదాయకాయ నమ: |
47. ఓం పరంజ్యోతిషే నమ: |
48. ఓం జిష్ణవే నమ: |
49. ఓం వైకుంఠపతయే నమ: |
50. ఓం దాశార్హాయ నమ: |
51. ఓం అవ్యయాయ నమ: |
52. ఓం దశరూపవతే నమ: |
53. ఓం సుధాతనవే నమ: |
54. ఓం దేవకీనందనాయ నమ: |
55. ఓం యాదవేంద్రాయ నమ: |
56. ఓం శౌరయే నమ: |
57. ఓం నిత్యయౌవనరూపవతే నమ: |
58. ఓం హయగ్రీవాయ నమ: |
59. ఓం చతుర్వేదాత్మకాయ నమ: |
60. ఓం జనార్దనాయ నమ: |
61. ఓం విష్ణవే నమ: |
62. ఓం కన్యాశ్రవణతారేడ్యాయ నమ: |
63. ఓం అచ్యుతాయ నమ: |
64. ఓం పీతాంబరధరాయ నమ: |
65. ఓం పద్మినీ ప్రియాయ నమ: |
66. ఓం అనఘాయ నమ: |
67. ఓం ధరాపతయే నమ: |
68. ఓం వనమాలినే నమ: |
69. ఓం సురపతయే నమ: |
70. ఓం పద్మనాభాయ నమ: |
71. ఓం నిర్మలాయ నమ: |
72. ఓం మృగయాసక్త మానసాయ నమ: |   
73. ఓం దేవపూజితాయ నమ: |
74. ఓం అశ్వారూఢాయ నమ: |
75. ఓం చతుర్భుజాయ నమ: |
76. ఓం ఖడ్గధారిణే నమ: |
77. ఓం చక్రధరాయ నమ: |
78. ఓం ధనార్జనసముత్సుకాయ నమ: |
79. ఓం త్రిధామ్నే నమ: |
80. ఓం ఘనసారలసన్మధ్య కస్తూరీ తిలకోజ్వలాయ నమ: |
81. ఓం త్రిగుణాశ్రయాయ నమ: |
82. ఓం సచ్చిదానంద రూపాయ నమ: |
83. ఓం నిర్వికల్పాయ నమ: |
84. ఓం జగన్మంగళ దాయకాయ నమ: |
85. ఓం నిష్కళంకాయ నమ: |
86. ఓం యజ్ఞరూపాయ నమ: |
87. ఓం నిరాతంకాయ నమ: |
88. ఓం యజ్ఞభోక్త్రే నమ: |
89. ఓం నిరంజనాయ నమ: |
90. ఓం చిన్మయాయ నమ: |
91. ఓం నిరాభాసాయ నమ: |
92. ఓం పరమేశ్వరాయ నమ: |
93. ఓం నిత్యతృప్తాయ నమ: |
94. ఓం పరమార్ధప్రదాయ నమ: |
95. ఓం నిరూపద్రవాయ నమ: |
96. ఓం శాంతాయ నమ: |
97. ఓం నిర్గుణాయ నమ: |
98. ఓం శ్రీమతే నమ: |
99. ఓం గదాధరాయ నమ: |
100. ఓం దోర్దండవిక్రమాయ నమ: |
101. ఓం శార్ ఘ్న పాణయే నమ: |
102. ఓం పరాత్పరాయ నమ: |
103. ఓం నందకినే నమ: |
104. ఓం పరబ్రహ్మణే నమ: |
105. ఓం శంఖధారకాయ నమ: |
106. ఓం శ్రీవిభవే నమ: |
107. ఓం అనేకమూర్తయే నమ: |
108. ఓం జగదీశ్వరాయ నమ: |
|| ఇతి శ్రీ వేంకటేశ్వర అష్టోత్తర శత నామావళి సంపూర్ణం ||

Also Read: పరమేశ్వరుడు పార్వతికి చెప్పిన వరలక్ష్మీ వ్రత కథ

Published at : 30 Jul 2022 06:48 AM (IST) Tags: Sawan 2022 Sravana Masam 2022 Varalakshmi Vratham 2022 Varalakshmi Vratham pooja vidhi Varalakshmi Vratham story Varalakshmi Vratham kadha Shravan Shanivar

ఇవి కూడా చూడండి

Tirumala Navaratri Brahmotsavam 2023: తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు, ఎప్పటి నుంచి అంటే?

Tirumala Navaratri Brahmotsavam 2023: తిరుమలలో మరోసారి బ్రహ్మోత్సవాలు, ఎప్పటి నుంచి అంటే?

Importance Of Bathukamma 2023: బతుకమ్మ పండుగలో పూలకు అంత ప్రాధాన్యత ఎందుకు!

Importance Of Bathukamma 2023: బతుకమ్మ పండుగలో పూలకు అంత ప్రాధాన్యత ఎందుకు!

Police Dance: గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో అదిరే స్టెప్పులేసిన పోలీసులు, వీడియో వైరల్‌

Police Dance: గణేష్‌ నిమజ్జన ఊరేగింపులో అదిరే స్టెప్పులేసిన పోలీసులు, వీడియో వైరల్‌

Horoscope September 29, 2023: ఈ రాశివారికి ఆదాయం తగ్గుతుంది - ఖర్చులు పెరుగుతాయి

Horoscope September 29, 2023: ఈ రాశివారికి ఆదాయం తగ్గుతుంది - ఖర్చులు పెరుగుతాయి

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే - ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

Dates of Bathukamma in 2023: బతుకమ్మ పండుగ డేట్స్ ఇవే -  ఏ రోజు ఏ బతుకమ్మని పూజించాలో తెలుసా!

టాప్ స్టోరీస్

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

అప్పట్లో పళ్లాలు కొడితే బొక్కలో వేశావ్! ఇప్పుడు బొక్కలో పడి పళ్లాలు కొట్టమంటున్నావ్!

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

Bigg Boss Telugu 7: కోపం కాదు ఆకలి, ప్రిన్స్ యావర్ ఎమోషనల్ - నువ్వు ట్రోపీ కొట్టాలంటూ హగ్ ఇచ్చిన శోభాశెట్టి

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

IND Vs ENG: ప్రపంచకప్ ప్రస్థానం ప్రారంభించనున్న రోహిత్ సేన - ఇంగ్లండ్‌తో వార్మప్ మ్యాచ్‌కు రెడీ!

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?

Upcoming Mobiles: స్మార్ట్ ఫోన్ల సీజన్ వచ్చేసింది - అక్టోబర్‌లో ఏయే ఫోన్లు రానున్నాయంటే?