కుక్కల ప్రవర్తన మీ భవిష్యత్తును తెలుపుతుందట - శకున శాస్త్రం ఏం చెబుతోందో తెలుసా?
యజమాని పట్ల విశ్వాసంతో పాటు ఇంటికి, యజమానికి సంబంధించిన అన్ని అంశాలకు కాపలాగా కూడా ఉంటాయి. అంతేకాదు కొన్ని ప్రత్యేక సంకేతాల ద్వారా భవిష్యత్తులో జరగబోయే మంచీ చెడులను కూడా తెలియజేస్తాయట.
కొన్ని రకాల జంతువులు, పక్షులు మనుషులకు చాలా దగ్గరి నేస్తాలుగా ఉంటాయి. వీటిలో కొన్నింటిని పెంపుడు జంతువులుగా ఇంట్లోనే పెంచుకోవచ్చు కూడా. ఇలా ఇంట్లో పెంచుకుని ప్రేమించే జంతువుల్లో కుక్కలు ముందుంటాయి. కుక్కలు అత్యంత విశ్వాసపాత్రమైన జంతువులు.
హిందుత్వంలో చాలా రకాల నమ్మకాలు ఉన్నాయి. కొన్ని శకునాలు శుభమని మరికొన్ని అశుభం అని నమ్ముతారు. ఇలాంటి శకునాలను గురించి చర్చించే శాస్త్రాన్ని గురించి చర్చించే శకున రత్న సముద్ర శాస్త్రానికి సంబంధించినది. కుక్కలు మనుషులకు చాలా దగ్గరగా మసలే జంతువులు. శకునశాస్త్రాన్ని అనుసరించి భవిష్యత్తులో జరిగే మంచి చెడులను గురించి కుక్కలు తమ ప్రవర్తన ద్వారా తెలియజేస్తాయని చెబుతోంది.
నమ్మని వారు ఇలాంటి వాటిని కొట్టి పారేస్తారు కానీ మరీ అంత కొట్టిపారెయ్యాల్సిన విషయం కాదని పండితులు అంటున్నారు. అలాంటి కొన్ని శకునాల గురించి మనం తెలుసుకుందాం.
శకున శాస్త్రాన్ని అనుసరించి కుక్క తన తలను అదే పనిగా నేలకేసి రాస్తుంటే అక్కడ ఏదో సంపద దాగి ఉందని అనుకోవాలి.
- ప్రయాణంలో ఉన్నపుడు కుక్క నోట్లో ఆహారంతో పరుగుతీస్తూ కనిపిస్తే త్వరలోనే అతడికి చాలా డబ్బు లభిస్తుందని ఈ శకునం అర్థం.
- ఆనారోగ్యంతో ఉన్న వ్యక్తి ముందు కుక్క తరచుగా తోకను లేదా గుండె భాగంలో కరుచుకుంటూ ఉంటే ఆ వ్యక్తి త్వరలో మరణిస్తాడని అర్థం
- ఒక వ్యక్తి నడచి వెళ్తున్నపుడు కుక్క అతడి ఎడమ వైపున వెంట నడిస్తే అతడికి అందమైన అమ్మాయి లేదా చాలా సంపద దొరకుతుందని అర్థం. అదే కుడి వైపు నడిస్తే ఇందుకు విరుద్ధ ఫలితాలు ఉంటాయి. అతడికి ఆర్థిక నష్టం జరగవచ్చు అతడి సొమ్ము దొంగిలించబడొచ్చు.
- కొన్ని కుక్కులు కలిసి ఒక చోట చేరి మొరుగుతుంటే త్వరలో ఆప్రాంతంలో ఏదో పెద్ద విపత్తు జరగబోతోందని అర్థం. లేదా అక్కడ నివసించే మనుషుల మద్య పెద్ద గొడవ కాబోతోందనేందుకు సూచన కావచ్చు.
- కుక్క మీ ఎడమ మోకాలిని వాసన చూస్తున్నట్టు కనిపిస్తే మీకు త్వరలోనే చాలా పెద్దమొత్తంలో సంపద రాబోతోందని అర్థం. అదే కుడి కాలు వాసన చూస్తుంటే మాత్రం భార్యా భర్తల మధ్య గొడవ జరగబోతోందని అర్థం. ఎడమ మోకాలిపైన వాసన చూస్తుంటే మాత్రం కొత్త స్త్రీ సాంగత్యం లభించవచ్చు లేదా ఒక మిత్రుడు శత్రువుగా మారొచ్చు.
- చెట్టుకింద నిలబడి కుక్క అదేపనిగా మొరుగుతుంటే ఈ సారి వర్షాకాలంలో వర్షాలు ఎక్కువగా పడతాయని అర్థం
- రైతు పొలం నుంచి తిరిగి వస్తూ కుడి భుజం మీద నాగలి మోసుకు వస్తుంటే ఎడమవైపుగా అతడిని కుక్క అనుసరిస్తుంటే చాలా మంచి శకునంగా భావించాలి. ఈ సారి అతడికి మంచి పంటపండుతుందని చాలా లాభాలు వస్తాయని అర్థం.
- కుక్క దాని కుడి కాలును గీకుతుంటే లేదా నాకుతుంటే మీకు త్వరలోనే ఏదొ మంచి జరగబోతోందని అర్థం.
- మీరు ప్రయాణానికి సిద్ద పడతుంటే కుక్క మీ చెప్పులు ఎత్తుకు పోయినా లేదా వేరెవరిదో చెప్పు దొంగిలించి తెచ్చినా మీరు జాగ్రత్తగా ఉండాలని అర్థం. ఎందుకంటే మీ సొమ్ము దొంగతనానికి గురి కావచ్చు.
ఇలా శకున శాస్త్రంలో కుక్కలకు సంబంధించిన చాలా శకునాలను వివరించింది. మీ కుక్క ఎలా ప్రవర్తిస్తుందో గమనిస్తే మీకు కూడా ఈ శకునాల గురించి తెలుస్తుంది.
Also read : చేతిలో డబ్బు నిలవడం లేదా? మట్టి కలశంతో ఇలా చేసి చూడండి
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదని గమనించలరు.