News
News
వీడియోలు ఆటలు
X

దారిలో మీకు డబ్బులు లేదా నాణేలు దొరికాయా? అది దేనికి సంకేతమో తెలుసా?

దొరికిన డబ్బు ఏం చెయ్యలి? దానం చెయ్యాలా? వాడుకోవాలా? దాచుకోవాలా? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం

FOLLOW US: 
Share:

నందరికి ఎక్కడో రోడ్ మీద డబ్బులు కనిపించడం అవి తీసుకోవాలా వద్దా? తీసుకుంటే వాడుకోవచ్చా? లేదా?  అనే మీమాంస అనేది జీవితంలో ఒక్కసారైనా ఎదురై ఉంటుంది. కొంత మంది తీసుకుని వాటిని ఎవరో ఒకరికి దానం చేసేస్తారు. కానీ ఈ అనుమానాలు మాత్ర అలాగే ఉండిపోతాయి. మరి అలా దొరికిన డబ్బు ఏం చెయ్యాలి? దానం చెయ్యాలా? వాడుకోవాలా? దాచుకోవాలా?

ఎవరో పోగొట్టుకున్న డబ్బు మన కంట పడడం అవి తీసుకోవాలని అనిపించినా అనుమానం వెంటాడటం సమంజసమే. కొందరు దానం చేసేస్తారు. కొందరు వెంటనే ఖర్చు చేసేస్తారు. ఈ డబ్బు ఒక్కోసారి నాణేలు కావచ్చు, ఒక్కోసారి నోట్లు కూడా కావచ్చు. అయితే ఇలా డబ్బు దొరకడం అనేది భవిష్యత్తులో జరగబోయే అంశాలకు సంకేతం అని శాస్త్రం చెబుతోంది. ఇది శుభమా? అశుభమా?

 • కింద పడిన నాణేలు దొరికాయంటే దేవుడు మీ వెన్నంటి ఉన్నాడని అర్థమట. ఆయన మీ విషయంలో చాలా ప్రసన్నంగా ఉన్నారని త్వరలోనే జీవితంలో ఏదో మంచి మార్పు జరగబోతోందనడానికి ఇది సంకేతమట.
 • ఎవరో పోగొట్టుకున్న డబ్బు మీకు దొరికిందీ అంటే మీరు త్వరలోనే ఏదో గొప్ప శుభవార్త వినబోతున్నారని కూడా అర్థం.
 • నాణేలు సాధారణంగా ఏదో ఒక లోహంతో చేసి ఉంటాయి. కనుక అలాంటి నాణెం మీకు దొరికింది అంటే దైవానుగ్రహం మీకు లభించినట్టేనట.
 • కింద పడిపోయిన నాణెం కచ్చితంగా ఎవరో ఒకరి చేతి నుంచి జారిపడిపోయిందే అవుతుంది. అది కచ్చితంగా ఎంతో కొంత ఎనర్జీ కలిగే ఉంటుంది. ఆ నాణాన్ని మీతో ఉంచుకుంటే మీకు మంచి జరిగే అవకాశమే ఎక్కువ.
 • త్వరలోనే మీరు పనిచేసే చోట మీకేదో మంచి జరగబోతోందనడానికి కూడా ఇది సంకేతం కావచ్చు. అంటే ప్రమోషన్ రావడం, వ్యాపారం విస్తరించడం వంటి విజయాలు త్వరలో మీకు ప్రాప్తిస్తాయని అర్థం.
 • ఇలా అనుకోకుండా డబ్బు దొరకడం లక్ష్మీ కటాక్షంగా భావించాలి. దొరికిన డబ్బు గురించిన ఎలాంటి అనుమానాలు అవసరం లేదని శాస్త్రం చెబుతోంది. అప్పటి వరకు మీరు ఎదుర్కోంటున్నకష్టాలకు అడ్డు కట్ట పడబోతోందనడానికి సంకేతం.
 • ఉదయాన్నే ఇలా డబ్బు దొరికితే అది సౌభాగ్యానికి గుర్తు. త్వరలోనే మీరు ఉన్నత స్థితికి చేరబోతున్నారని కూడా అర్థం. కాబట్టి ఈ డబ్బును జాగ్రత్త చేసుకోవడం మంచిది.
 • ఆశించకుండా రోడ్డుమీద దొరికిన నాణెం త్వరలో కలిగే ఆకస్మిక ధన ప్రాప్తికి సూచన. ఆస్తులు సంపాదించుకుంటారనడానికి ఒక నిదర్శనంగా భావించాలి.
 • ఇలా ఆయాచితంగా దొరికిన డబ్బు ఈశ్వర కృపకు కారణం. జీవితంలో ఇక ముందు అన్ని మంచి రోజులే అనేందుకు సంకేతం.
 • అనుకోకుండా దొరికిన డబ్బులు అప్పటి వరకు వివాదాల్లో ఉన్న పిత్రార్జిత ఆస్తి త్వరలోనే మీకు సొంతం అవతుందని చెప్పేందుకు శకునంగా కూడా భావించాలి.
 • కాబట్టి దారిలో దొరికిన డబ్బుల గురించి ఎలాంటి అనుమానం పెట్టకునే పనిలేదు. అంతా మన మంచికే అనుకోవాలని పండితులు చెబుతున్నారు.

Also Read: ఇంటి ప్రవేశ ద్వారం దగ్గర ఈ వస్తువులు ఉంటే దురదృష్టం

గమనిక: వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. ఇందులో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ బాధ్యత వహించదని గమనించగలరు. 

Published at : 31 Mar 2023 06:00 AM (IST) Tags: Good luck finding money on road bad luck

సంబంధిత కథనాలు

Bhagavad Gita Sloka: గీతాసార‌మంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది

Bhagavad Gita Sloka: గీతాసార‌మంతా ఈ 5 శ్లోకాలలోనే ఉంది

Peepal Tree : రావిచెట్టును పూజిస్తే శ‌ని అనుగ్ర‌హం ఖాయం

Peepal Tree : రావిచెట్టును పూజిస్తే శ‌ని అనుగ్ర‌హం ఖాయం

Decoding dreams: కలలో బంగారం కనిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?

Decoding dreams: కలలో బంగారం కనిపిస్తే ఏం జ‌రుగుతుందో తెలుసా?

Evil eye signs: మీపై, మీ కుటుంబంపై న‌ర‌దిష్టికి సంకేతాలు ఇవే

Evil eye signs: మీపై, మీ కుటుంబంపై న‌ర‌దిష్టికి సంకేతాలు ఇవే

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

జూన్ 5 రాశిఫలాలు, ఈ రాశివారి చుట్టూ ముఖస్తుతి చేసే వ్యక్తులున్నారు జాగ్రత్త

టాప్ స్టోరీస్

Telangana: 9 ఏండ్ల‌ల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ‌, లెక్కలు బయటపెట్టిన మంత్రి ఎర్రబెల్లి

Telangana: 9 ఏండ్ల‌ల్లో మిగులు విద్యుత్ రాష్ట్రంగా తెలంగాణ‌, లెక్కలు బయటపెట్టిన మంత్రి ఎర్రబెల్లి

Vijayashanthi: విజయశాంతి బీజేపీని వీడతారంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన రాములమ్మ

Vijayashanthi: విజయశాంతి బీజేపీని వీడతారంటూ వార్తలు - క్లారిటీ ఇచ్చిన రాములమ్మ

కియరా అద్వానీ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్: ఇన్‌స్టాలో ఫాలోవర్లే లేని వీడికి పిల్లని ఎవరిస్తారు?

కియరా అద్వానీ 'సత్యప్రేమ్ కి కథ' ట్రైలర్: ఇన్‌స్టాలో ఫాలోవర్లే లేని వీడికి పిల్లని ఎవరిస్తారు?

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్‌- ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్‌నాథ్‌

Odisha Train Accident: ఒడిశా ప్రమాదంలో ఏపీ వారంతా సేఫ్‌- ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటుంది 8 మంది: మంత్రి అమర్‌నాథ్‌