అన్వేషించండి

Horoscope Today 4th June 2022: ఈ రాశివారు శుభవార్త వింటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 4th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి

మేషం
ఈ రోజు మీరు తలపెట్టిన పనులు పూర్తిస్థాయిలో పూర్తిచేయలేరు. లావాదేవీల నిర్వహణకు ఈ రోజు అనుకూలంగా ఉండదు. కొత్త ఉద్యోగాన్ని ప్రారంభించేందుకు ప్లాన్ చేసుకోండి. ఉద్యోగులు మరింత కష్టపడాల్సి ఉంటుంది. ప్రేమ సంబంధాలపై నమ్మకం అలాగే ఉండేలా చూసుకోండి. ఏ విషయంలోనూ రిస్క్ తీసుకోవద్దు. 

వృషభం
స్నేహితులతో సరదాగా స్పెండ్ చేస్తారు. అనుకోకుండా ఎవరితోనైనా గొడవ జరుగుతుంది. ఆ గొడవ పెద్ద ఇష్యూ అవుతుంది. న్యాయపరమైన వ్యవహారాలు ముందుకు సాగుతాయి.ప్రైవేట్ కార్యాలయాల్లో పనిచేసేవారికి పదోన్నతి లభిస్తుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. 

మిథునం
మీరు ఆరోగ్యం విషయంలో ఒత్తిడికి లోనవుతారు. తలనొప్పి, జ్వరంతో ఇబ్బంది పడతారు. కార్యాలయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఎవరిపైనా కోపం ప్రదర్శించవద్దు. నిలిచిపోయిన పనులు ప్రారంభించేందుకు ప్రయత్నిస్తారు. మీ సామర్థ్యాలను పరీక్షించుకోవడానికి ప్రయత్నించండి. బంధువులను కలుస్తారు. 

Also Read:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిప్రభావం తగ్గించే శ్లోకాలు

కర్కాటకం
ఏదో తెలియని భయం మిమ్మల్ని వెంటాడుతుంది. ఆలయ దర్శనానికి వెళ్తారు. ఆస్తి విషయంలో ఒత్తిడులు తొలగిపోతాయి. కడుపు నొప్పితో ఇబ్బంది పడతారు. మీరు మీ పని లక్ష్యం నుంచి తప్పుకుంటారు. గతంలో జరిగిన తప్పుల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. అనుకున్న సమయానికి పనులు పూర్తవుతాయి. వాహనం కొనుగోలు చేస్తారు. 

సింహం
గతంలో తీసుకున్న రుణాన్ని తిరిగి చెల్లించలేక ఒత్తిడికి లోనవుతారు. ఎవరి విషయాల్లో జోక్యం చేసుకోకండి. వివాదాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామితో మనస్పర్థలు వచ్చే అవకాశం ఉంది. బంధువులతో సమావేశమవుతారు. ఏకాంతంగా ఉండేందుకు ఇష్టపడతారు. మీ పిల్లల కదలికలపై నిఘా ఉంచండి. ఆహారాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.

కన్య
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. ఉద్యోగంలో మార్పు గురించి చాలా ఆసక్తిగా ఉంటారు. కుటుంబ బాధ్యత పెరుగుతుంది. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. వ్యాపారంలో ఎక్కువ లాభం పొందుతారు

తులా
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. విదేశాల్లో ఉన్న బంధువులతో చర్చలు జరుపుతారు. డబ్బు, ఆస్తుల పరిస్థితి సాధారణంగా ఉంటుంది.లావాదేవీల విషయంలో తొందరపడకండి. మీ జీవిత భాగస్వామి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. సహోద్యోగుల సహకారంతో పని ఒత్తిడి తగ్గుతుంది.

Also Read:  మీ పేరు 'k'తో ప్రారంభమైందా... అబ్బో మీలో చాలా స్పెషల్ క్వాలిటీస్ ఉన్నాయ్

వృశ్చికం
కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. కళతో సంబంధం ఉన్న వ్యక్తులకు రోజు చాలా మంచిది. ఈరోజు బంధువులతో సమావేశం అవుతారు.మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఇంటి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది. ఆన్‌లైన్ వ్యాపారంలో సమస్య ఉంటుంది. పనికిరాని పనుల్లో సమయాన్ని వృథా చేస్తారు.

ధనుస్సు
ఈరోజు ఇంటి విషయాల్లో కొన్ని చికాకులు ఉంటాయి. అనారోగ్య సమస్యలుంటాయి.మీకు సంబంధించిన రహస్యాలను ఎవ్వరితోన పంచుకోవద్దు.  కార్యాలయంలో మీ సామర్థ్యం కంటే ఎక్కువ కష్టపడాల్సి ఉంటుంది. మీ స్వభావాన్ని బట్టి ప్రవర్తించండి.

మకరం
మీరు బంధువుల నుంచి సహాయం పొందుతారు. అధికారులు మీ పని పట్ల చాలా సంతోషిస్తారు. తెలివితేటలతో విజయం సాధిస్తారు.  కొత్త ప్రాజెక్టులు ప్రారంభిస్తారు. ఈరోజు దినచర్య దెబ్బతింటుంది.పెళ్లికానివారికి సంబంధాలు కుదరక కొంత ఆందోళనలో ఉంటారు. 

కుంభం
కష్టాలుంటాయి కానీ ఓపిక పట్టండి. కార్యాలయంలో సమయం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. కోపం, పని ఒత్తిడి తగ్గించుకోండి. ఈ రోజు సాధారణంగా ఉంటుంది. 

Also Read:  మీ పేరు M,T అక్షరాలతో మొదలైందా.. వామ్మో మీరు మామూలోళ్లు కాదు...

మీనం
సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రమాదకర పనిని జాగ్రత్తగా చేయండి. సంక్షేమ కార్యక్రమాలకు తమవంతు సహకారం అందిస్తారు. జీవిత భాగస్వామితో కలిసి షికారు వెళ్తారు. రక్తపోటు పెరగవచ్చు. మీ వ్యక్తిగత సమస్యల్లో ఎవ్వర్నీ జోక్యం చేసుకోనివ్వొద్దు. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Tamilsai Arrest: తమిళనాడులో హిందీకి సపోర్టుగా తమిళిశై ఉద్యమం - అరెస్ట్ చేసిన ప్రభుత్వం
తమిళనాడులో హిందీకి సపోర్టుగా తమిళిశై ఉద్యమం - అరెస్ట్ చేసిన ప్రభుత్వం
Cadaver Dogs: SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు
SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు
Elon Musk Punjab Son: ఎలాన్ మస్క్ నలుగురు బిడ్డలకు పంజాబీ జీన్స్ - ఈ న్యూరా లింక్ ఎక్కడ కలిసిందో తెలుసా ?
ఎలాన్ మస్క్ నలుగురు బిడ్డలకు పంజాబీ జీన్స్ - ఈ న్యూరా లింక్ ఎక్కడ కలిసిందో తెలుసా ?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

SA vs NZ Semi Final 2 | Champions Trophy ఫైనల్లో భారత్ ను ఢీకొట్టేది కివీస్ | ABP DesamChampions Trophy | 97 ఏళ్ల రికార్డును బద్దలు కొట్టిన ఇండియా | ABP DesamSrisailam Elevated Corridor Project Details | నల్లమల్ల అడవిలో ఎలివేటెడ్ కారిడార్‌ | ABP DesamAP Speaker Ayyannapathrudu on YS Jagan Letter | స్పీకర్ ను కించపరిచేలా జగన్ లేఖలున్నాయన్న అయ్యన్న | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Pradesh Latest News: నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
నాడు పుస్తకాల్లో విమర్శలు - నేడు పుస్తకం సాక్షిగా ఒక్కటైన చంద్రబాబు, దగ్గుబాటి
Tamilsai Arrest: తమిళనాడులో హిందీకి సపోర్టుగా తమిళిశై ఉద్యమం - అరెస్ట్ చేసిన ప్రభుత్వం
తమిళనాడులో హిందీకి సపోర్టుగా తమిళిశై ఉద్యమం - అరెస్ట్ చేసిన ప్రభుత్వం
Cadaver Dogs: SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు
SLBC టన్నెల్ ఆపరేషన్‌లోకి కేరళ కుక్కలు
Elon Musk Punjab Son: ఎలాన్ మస్క్ నలుగురు బిడ్డలకు పంజాబీ జీన్స్ - ఈ న్యూరా లింక్ ఎక్కడ కలిసిందో తెలుసా ?
ఎలాన్ మస్క్ నలుగురు బిడ్డలకు పంజాబీ జీన్స్ - ఈ న్యూరా లింక్ ఎక్కడ కలిసిందో తెలుసా ?
YS Sharmila Latest News : విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
విజయవాడలో ఇల్లు కొన్న YS షర్మిల, ధర ఎంతంటే?
Telangana MLC Elections 2025:తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
తెలంగాణలో రెండు ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీకే- సంతోషంతో మోదీ ట్వీట్‌
Andhra Pradesh High Court: ఏపీ హైకోర్టులో పోసాని, ఆర్జీవీకి ఊరట- కేసులపై కీలక ఆదేశాలు
ఏపీ హైకోర్టులో పోసాని, ఆర్జీవీకి ఊరట- కేసులపై కీలక ఆదేశాలు
Janhvi Kapoor:  జాన్వీ కపూర్ బర్త్ డే గిఫ్ట్ - రామ్ చరణ్ 'RC16' నుంచి పోస్టర్ రిలీజ్, లుక్ అదిరిందిగా..
జాన్వీ కపూర్ బర్త్ డే గిఫ్ట్ - రామ్ చరణ్ 'RC16' నుంచి పోస్టర్ రిలీజ్, లుక్ అదిరిందిగా..
Embed widget