By: ABP Desam | Updated at : 09 Nov 2021 06:16 AM (IST)
Edited By: RamaLakshmibai
2021 నవంబరు 09 మంగళవారం రాశిఫలాలు
మేషరాశి
మీరు భూమి లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు. ఆదాయం పెరుగుతుంది. ఉత్సాహంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. పాత పెట్టుబడులతో లాభాలు వచ్చే అవకాశాలున్నాయి. వ్యాపారంలో పురోగతి ఉంటుంది. నిరుద్యోగులకు కలిసొచ్చే సమయం. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు.
వృషభం
ఉద్యోగం మారాలనుకునేవారికి ఇది మంచి అవకాశం. వ్యాపారస్తులకు లాభాలొస్తాయి. ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త ఒప్పందాలు ఉంటాయి. కుటుంబ బాధ్యత పెరుగుతుంది. మతపరమైన పనులపై ఆసక్తి ప్రదర్శిస్తారు. పిల్లల ప్రవర్తన వల్ల సమాజంలో గౌరవం పెరుగుతుంది. ఆరోగ్యం క్షీణించవచ్చు. దూరప్రయాణాలు వాయిదా వేసుకుండో.
మిథునం
సామాజిక కార్యాలు విజయవంతమవుతాయి. ఏదైనా పెద్ద ఈవెంట్‌లో భాగం అవుతారు. ఆనందంగా ఉంటారు. కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. కుటుంబ జీవితం ఆహ్లాదకరంగా ఉండదు. భగవంతుని ఆరాధించడంతో ధైర్యాన్ని పొందుతారు. మీ పనితీరు అధికారులను ఆకట్టుకుంటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. టెన్షన్ తగ్గుతుంది. ఒకరి దృష్టికోణంలో నిర్ణయాలు తీసుకోవద్దు.
కర్కాటకం
ఈరోజంతా బాగానే ఉంటుంది. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. వ్యాపారంలో నష్టం ఉంటుంది. ఖర్చులు పెరుగుతాయి. లావాదేవీలు జరిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. రిస్క్ తీసుకోకండి. పిల్లల జీవనోపాధికి సంబంధించిన సమస్యకు పరిష్కారం ఉంటుంది. నిర్లక్ష్యంగా వాహనం నడపవద్దు. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించవచ్చు.
సింహం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. వ్యాపారాన్ని కొనసాగించండి. చెడు వార్తలు వినే అవకాశం ఉంది. ఆదాయంలో తగ్గుదల ఉంటుంది. యువతకు ఉద్యోగాలు వస్తాయి. పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చు. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. వ్యాపారంలో లాభం ఉంటుంది.
కన్య
ఆదాయం పెరుగుతుంది. బద్ధకాన్ని వీడండి. అప్పు ఇచ్చేటపుడు తగు జాగ్రత్తలు తీసుకోండి. ఆకస్మిక లాభం ఉంటుంది. మానసిక ఆనందాన్ని పొందుతారు. కష్టపడితే ఫలితం ఉంటుంది. విద్యార్థులు పరీక్షలో విజయం సాధిస్తారు. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. బంధువులను కలుస్తారు.
తుల
బంధువులను కలుసుకోవడం ఆనందంగా ఉంటుంది. చేపట్టిన పనులు నెరవేరుతాయి. పెట్టుబడులు అనుకూలంగా ఉంటాయి. పోటీ పరీక్షలలో విజయం సాధిస్తారు. సంపాదించిన దానికన్నా ఎక్కువ ఖర్చు చేయవద్దు. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. విభేదాలు పరిష్కారమవుతాయి.
వృశ్చికం
ఖర్చులు అధికంగా ఉంటాయి. మీకు మంచి సమాచారం అందుతుంది. ఆనందంగా ఉంటారు. తెలివితేటలతో పనులు పూర్తి చేస్తారు. వ్యాపారం బాగా సాగుతుంది. సమయాన్ని వృధా చేయవద్దు. ప్రభుత్వ వ్యవహారాలు ముందుకు సాగుతాయి.
ధనుస్సు
ఈరోజు ఆహ్లాదకరంగా ఉంటుంది. వ్యాపారంలో పెరుగుదల ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. సహోద్యోగుల సహాయం ఉంటుంది. మనసు ఆనందంగా ఉంటుంది. కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. గుర్తుతెలియని వ్యక్తుల వల్ల కొంత ఇబ్బంది కలగవచ్చు. ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు.
మకరం
మీకు మంచి సమాచారం అందుతుంది. జీవిత భాగస్వామి నుంచి మీకు మద్దతు లభిస్తుంది. తెలియని అడ్డంకిని అధిగమిస్తారు. ఏ పనీ పూర్తి కాకపోవడం వల్ల అశాంతి ఉంటుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. స్నేహితుల మద్దతు పొందుతారు. ఆహారాన్ని అదుపులో ఉంచుకోండి. బాధ్యతలను సకాలంలో పూర్తి చేయగలుగుతారు.ధైర్యంగా ఉండండి.
కుంభం
ప్రమాదకర చర్యలను నివారించండి. శ్రమకు తగిన ఫలితం అందుకోలేకపోవచ్చు. విద్యార్థులు మరింత శ్రమించాల్సి ఉంటుంది. ఒత్తిడి దూరమవుతుంది. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. ఉద్యోగస్తులకు శుభసమయం.
మీనం
ఈరోజు అద్భుతంగా ఉంటుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. రిస్క్ తీసుకోవడం మానుకోండి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మతపరమైన కార్యక్రమాల పట్ల మొగ్గు చూపుతారు. న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోతాయి. ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి ఉంటుంది.
Also Read: ఉపవాసం దేవుడి కోసం మాత్రమే కాదు… ప్రకృతి వైద్యులు చెప్పిన విషయాలు మీరు తెలుసుకోండి
Also Read: కార్తీక పౌర్ణమి, క్షీరాబ్ధి ద్వాదశి... కార్తీకమాసంలో ముఖ్యమైన రోజులివే...
Also Read: వనభోజనాలు కార్తీకమాసంలోనే చేస్తారెందుకు .. ఉసిరి చెట్టుకిందే తినాలని ఎందుకు చెబుతారు..!
Also Read: కార్తీక స్నానాలు ఎందుకు చేయాలి… అంత చలిలో అవసరమా…!
Also Read: పన్నెండు నెలల్లో కార్తీక మాసం ఎందుకు ప్రత్యేకం .. ఈ నెలలో ఈ పనులు మాత్రం చేయకండి..!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Tirumala Vasanthotsavam : ఏప్రిల్ 3 నుంచి తిరుమలలో శ్రీవారి వసంతోత్సవాలు, పలు సేవల రద్దు!
Astrology: మీది ఈ రాశుల్లో ఒకటా- ఇక మీ కష్టాలు తీరినట్టే
Hanuman Jayanti 2023 Hanumath Vijayotsavam: ఏప్రిల్ 6 హనుమాన్ జయంతి కాదు - హనుమాన్ విజయోత్సవం!
Political Horoscope: 2023-2024 ఈ రాశులకు చెందిన రాజకీయనాయకులకు గడ్డుకాలమే!
ఏప్రిల్ 1 రాశిఫలాలు, అన్ని విషయాల్లో ఈ రాశివారి డామినేషన్ పెరుగుతుంది
RGV On Jagan Governament : సీఎం జగన్ అసెంబ్లీని ఎప్పుడు రద్దు చేస్తారో చెప్పేసిన ఆర్జీవీ - కానీ చిన్న ట్విస్ట్ ఉందండోయ్ ..
Samantha : అమ్మది అలెప్పీ అయినా మలయాళం నేర్పలేదు - కొచ్చిలో తల్లిపై సమంత కంప్లైంట్
LSG Vs DC: వార్నర్ సేనను మట్టికరిపించిన లక్నో - 50 పరుగులతో ఘనవిజయం!
Lokesh On Kethireddy : చెప్పేవి నీతులు దోచేవి గుట్టలు- గుడ్ మార్నింగ్ మహానటుడు అంటూ కేతిరెడ్డిపై లోకేశ్ సెటైర్లు