By: ABP Desam | Updated at : 05 Nov 2021 07:17 AM (IST)
Edited By: RamaLakshmibai
2021 నవంబరు 05 శుక్రవారం రాశిఫలాలు
శ్రీ ప్లవ నామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు, కార్తీక మాసం, శుక్లపక్షం, శుక్రవారం
పాడ్యమి రాత్రి 01.16 వరకు, తదుపరి విదియ
వర్జ్యం మ12.04 నుంచి 01.34 వరకు
దుర్ముహూర్తం ఉ.08.20 నుంచి 09.05 వరకు, 12.07 నుంచి 12.52 వరకు
అమృతఘడియలు రా.09.04 నుంచి 10.34 వరకు
మేషం
పనులు ఉత్సాహంగా పూర్తిచేస్తారు. మీ ప్రవర్తవల్ల మీ చుట్టూ ఉన్నవారు సంతోషంగా ఉంటారు. ఇల్లు, భూమికి సంబంధించిన ఒప్పందాలు చేసుకునేందుకు ఇది శుభసమయం. వ్యాపారులకు కలిసొస్తుంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. విద్యార్థులకు చదువుపై ఆసక్తి పెరుగుతుంది.
వృషభం
మీకు ఈరోజంతా మంచి ఫలితాలే. సోదరులతో ఉన్న మనస్పర్థలు తొలగుతాయి. వాహనం లేదా ఆభరణాలు కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతారు. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. ఉద్యోగంలో ఎదురైన ఇబ్బందులు తొలగిపోతాయి. వ్యాపారులకు లాభసూచన ఉంది. విద్యార్థులకు అనుకూల సమయం.
మిథునం
మిథున రాశివారికి మిశ్రమ ఫలితాలున్నాయి. స్నేహితులతో మాటపట్టింపులు ఉండొచ్చు. వ్యాపారులకు పెద్దగా కలసిరాదు. ఉద్యోగులకు శ్రమఎక్కువ, ఫలితం తక్కువ అన్నట్టుంటుంది. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. ఇష్టదైవాన్ని ప్రార్థించండి.
కర్కాటకం
కొన్నాళ్లుగా వెంటాడుతున్న ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. దూర ప్రయాణాలు చేస్తారు. అనారోగ్య సూచనలున్నాయి ఆరోగ్యం పై నిర్లక్ష్యం వద్దు. కుటుంబంలో ఒత్తిడి ఉంటంది. వ్యాపారాలకు ఉద్యోగులకు నిరాశ తప్పదు. పోటీ పరీక్షల్లో విద్యార్థులు అనుకూల ఫలితాలు సాధించలేరు.
సింహం
ప్రణాళికలు కార్యరూపం దాల్చుతాయి. సంపాదన తక్కువ వ్యయం ఎక్కువ అన్నట్టుంటుంది. స్థిరాస్తి వివాదాలుంటాయి. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. వ్యాపారస్తులకు లాభాలొస్తాయి. ఉద్యోగులకు బాగానే ఉంటుంది.
కన్య
చేపట్టిన పనులు ఆలస్యమవుతాయి. కుటుంబసభ్యులతో విభేదాలు ఉండొచ్చు. ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. కష్టానికి తగిన ఫలితం అందుకోలేరు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. వ్యాపారాలు, ఉద్యోగాల్లో అంచనాలు నిజమవుతాయి.
తుల
మీరు ఈ రోజంతా శుభసమయమే. చేపట్టిన పనులు పూర్తవుతాయి. దైవదర్శనాలు చేసుకుంటారు. వ్యాపారులకు కలిసొచ్చే సమయం. ఉద్యోగులకు కార్యాలయంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు.
వృశ్చికం
ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. అనుకోని ఖర్చులు పెరుగుతాయి. అనారోగ్య సూచనలున్నాయి. వ్యాపారస్తులు మరింత కష్టపడాలి. ఉద్యోగస్తులకు కష్టానికి తగిన ఫలితం ఉండదు. వివాదాలకు దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి.
ధనుస్సు
ధనస్సు రాశివారికి అంతా శుభమే. స్థిరాస్తి కొనుగోలు ఆలోచనల్లో ముందడుగు పడుతుంది. నిరుద్యోగులు ఉద్యోగానికి సంబంధించిన సమాచారం అందుకుంటారు. వ్యాపారులకు అనుకూల సమయం. ఉద్యోగస్తులకు కార్యాలయంలో పరిస్థితులు సహకరిస్తాయి.
మకరం
నిరుద్యోగులకు మంచి సమయం ఇది. కుటుంబ పెద్దల, స్నేహితుల సలహాలు పాటించి ముందడుగు వేయండి. ఎప్పటి నుంచోరావాల్సిన మొత్తం చేతికందుతుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు శుభసమయం.
కుంభం
అనుకున్న పనులు ఆలస్యమవుతాయి. కష్టం ఎక్కువ ఫలితం తక్కువ అన్నట్టుంటుంది. బంధువులతో విభేదాల సూచనలున్నాయి. దూర ప్రయాణాలు చేస్తారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు పెద్దగా కలిసొచ్చే సమయం కాదిది.
మీనం
మీన రాశివారికి కూడా ఈ రోజు పరిస్థితులు పెద్దగా అనుకూలించవు. పనుల్లో ఆటంకాలు ఎదురవుతాయి. ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాల్లో కొత్త పెట్టుబడుల గురించి ఇప్పట్లో ఆలోచించవద్దు. ఉద్యోగ మార్పు సూచనలున్నాయి. విద్యార్థులు చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి.
Also Read: ఒక్క పాటకు వెయ్యి మందితో... అల్లు అర్జున్ తగ్గేదే లే!
Also Read: ఆటలో ఆనీ మాస్టర్, ప్రియాంక సింగ్ విశ్వరూపం, షణ్ముక్ ని ఫేక్ అన్న సిరి
Also Read: హన్సికను గొలుసులుతో బంధించి... తల్లకిందులుగా వేలాడదీసి!
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Vastu Tips In Telugu: అద్దె ఇంటికి వాస్తు వర్తిస్తుందా -వర్తించదా!
Ganesh Nimajjanam 2023 : గణేష్ నిమజ్జనం ఎందుకు చేయాలి, చేయకపోతే ఏమవుతుంది !
ఈ రాశులవారు చెడు సహవాసాలను వదులుకుంటే మంచిది, సెప్టెంబరు 27 రాశిఫలాలు
Chanakya Niti In Telugu : మీ జీవితంలో అస్సలు నిర్లక్ష్యం చేయకూడని 8 మంది వీళ్లే!
Vishnu Sahasranamam: విష్ణుసహస్రం పారాయణం చేయాల్సిన సందర్భాలివే!
Minister RK Roja: 'తప్పు చేసిన తండ్రి కోసం రాష్ట్రపతిని కలిశారు, రాష్ట్రం కోసం ఎప్పుడైనా కలిశారా?'
IND vs AUS 3rd ODI: చితక్కొట్టిన కంగారూలు! టీమ్ఇండియా టార్గెట్ 353
Oscars 2024 - 2018 Movie : బ్రేకింగ్ - ఆస్కార్స్కు మలయాళ సినిమా '2018'
Supreme Court: చంద్రబాబు స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో మరో బెంచ్కు
/body>