Horoscope Today 16th May 2022: ఈ రాశికి చెందిన హార్ట్ పేషెంట్లు తప్పనిసరిగా కాఫీ మానేయాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 మే 16 సోమవారం రాశిఫలాలు
మేషం
ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. డబ్బును ఎలా ఆదా చేసుకోవాలి, దాన్ని ఎలా ఉపయోగించుకోవాలో తెలుసుకుంటారు. కుటుంబంపై ఎక్కువ దృష్టి సారిస్తారు. మీ జీవిత భాగస్వామి విలువను గుర్తిస్తారు. కార్యాలయంలో మీ శత్రువులు వారుచేసిన చెడు పనులకు తగిన ఫలితం పొందుతారు. మీ కోసం మీరు సమయాన్ని వెచ్చించండి. ఈ రోజు మీ లక్కీ కలర్ వైట్
వృషభం
మీరు అనారోగ్యం నుంచి కోలుకుంటారు. గతంలో ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఈరోజు మీకు రాబడిని ఇస్తుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీరు పనిచేసే ప్రదేశంలో ఓ అధ్భుతమైన వ్యక్తిని కలుస్తారు. ప్రయాణం లాభదాయకంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట రంగు రాయల్ బ్లూ...
మిథునం
ద్వేష భావాలకు దూరంగా ఉండండి. బంధుమిత్రులతో కలిసి వ్యాపారాలు నిర్వహించే వారు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉన్నందున ఈరోజు జాగ్రత్తగా ఉండాలి. జీవిత భాగస్వామితో సరైన చర్చ సంబంధాన్ని మెరుగుపరుస్తుంది. కొత్త ప్రాజెక్టులు మరియు ప్రణాళికలను అమలు చేయడానికి అనుకూలమైన రోజు. మీరు తెలియకుండా మాట్లాడే మాట మీ కుటుంబ సభ్యుల మనోభావాలు దెబ్బతీస్తుంది. మీ జీవిత భాగస్వామి ఈరోజు మీతో ప్రత్యేకంగా వ్యవహరిస్తారు. మీకు ఈ రోజు కలిసొచ్చే రంగు బంగారు వర్ణం.
కర్కాటకం
ఈ రోజు, మీరు అత్యంత ప్రభావవంతమైన వ్యక్తుల నుంచి మద్దతు పొందుతారు. ఈ రోజు మీరు నష్టపోయే అవకాశం ఉన్నందున ఇతరుల సూచనల మేరకు పెట్టుబడి పెట్టకండి. ముఖ్యంగా మిమ్మల్ని ప్రేమించే, మీపై శ్రద్ధ వహించే వ్యక్తులతో సహేతుకంగా ఉండటానికి ప్రయత్నించండి. వ్యక్తుల గత తప్పులను క్షమించడం ద్వారా మీరు మీ జీవితాన్ని విలువైనదిగా మార్చుకోబోతున్నారు. మీ కుటుంబ సభ్యులు లేదా స్నేహితుల కోసం కొంత సమయం కేటాయించడంలో విఫలమైనందుకు బాధపడతారు. మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని సంతోషపెట్టేందుకు ప్రయత్నిస్తారు. ఈ రోజు మీ అదృష్ట రంగు తెలుపు.
సింహం
వివాదాలకు దూరంగా ఉండండి. మీరు ఓపెన్ మైండెడ్‌ను ప్రోత్సహించడం ద్వారా మరియు ఎవరిపైనైనా పక్షపాతాలు లేవని నిరూపించుకోవచ్చు. ఈ రోజు, మీరు డబ్బును కూడబెట్టుకోవడం, ఆదా చేయడం లాంటి నైపుణ్యాన్ని మెరుగుపర్చుకుంటారు. జీవిత భాగస్వామితో సంబంధాన్ని మరింత మెరుగుపరుచుకోండి. కొత్త ప్రణాళికలు, వెంచర్లను అమలు చేయడానికి ఈ రోజు మంచి రోజు. మీ అదృష్ట రంగు ఆకుపచ్చ.
Also Read: 2022-2023లో ఈ రాశివారికి ఏలినాటి శని ఉన్నప్పటికీ గురుబలంతో అన్నింటా పైచేయి మీదే
కన్య
సంతోషాన్ని ఇతరులతో పంచుకోవడం ద్వారా మరింత ప్రశాంతంగా ఉంటారు. మీ సృజనాత్మక ప్రతిభను సరైన ఉపయోగంలో ఉంచినట్లయితే చాలా లాభపడతారు. ఇంటి పనివల్ల చాలా అలసి పోతారు. ప్రేమికులకు శుభసమయం. సహోద్యోగులతో వ్యవహించేటప్పుడు కొన్ని మెళకువలు నేర్చుకోవడం చాలా అవసరం. పనిపై పూర్తిస్థాయిలో దృష్టి సారించండి. ఏ పనీ వాయిదా వేయవద్దు. మీ అదృష్ట రంగు నీలం
తుల
ఈ రోజు మీరు వ్యక్తిగత మరియు వృత్తిపరమైన అంశాల్లో ఒత్తిడికి గురవుతారు. వ్యాపారస్తులకు వ్యాపారంలో నష్టాలు వస్తాయి. వ్యాపారం, ఉద్యోగంలో అవుట్‌పుట్ ఇవ్వకుండా ఎక్కువ మాట్లాడే వ్యక్తులను దూరం ఉంచండి. ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. మీ అదృష్ట రంగు స్కై బ్లూ
వృశ్చికం
మీరు ప్రతికూల పరిస్థితులకు అనుగుణంగా మీ అనుకూలతను మెరుగుపరచుకోవడంపై దృష్టి పెడతారు. సమస్యలు జీవితంలో ఒక భాగమని మీరు గ్రహిస్తారు కానీ ఆ ప్రభావం మీపై పడకుండా జీవితాన్ని మెరుగుపచ్చుకునే దిశగా ఆలోచిస్తారు. ఆర్థికంగా దృఢంగా ఉంటారు. ఈరోజు మీరు ఎక్కువ సంపాదించే అవకాశం ఉంటుంది. మీరు మీ ఆత్మస్థైర్యాన్ని పెంచే సందేశాన్ని మీ జీవిత భాగస్వామి నుంచి అందుకుంటారు. మీరు విభిన్న శైలికి చెందిన వ్యక్తి కాబట్టి ఒంటరిగా సమయాన్ని గడపాలని కోరుకుంటారు. మీ అదృష్ట రంగు నీలం.
ధనుస్సు
మీరు మీ నిజమైన సామర్థ్యాన్ని గ్రహిస్తారు. ఈ రాశి విద్యార్థులు కెరీర్ కి సంబంధించిన నిర్ణయాలు తీసుకునేటప్పుడు లభ-నష్టాలను సరిగ్గా బేరీజు వేసుకుంటారు. ఎదుటి వారు వీరి నుంచి ఏం కోరుకుంటున్నారో కచ్చితంగా అంచనా వేయగలుగుతారు. కుటుంబంలో సమస్యలను పరిష్కరించడంలో కీలకపాత్ర పోషిస్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీ అదృష్ట రంగు ఆకుపచ్చ.
మకరం
మీరు దీర్ఘకాలిక అనారోగ్యం నుంచి కోలుకుంటారు. త్వరలో క్రీడా కార్యక్రమాల్లో పాల్గొనవచ్చు. క్లిష్ట పరిస్థితులను నివారించడానికి ఆర్థిక పొదుపు తప్పనిసరిగా ప్రోత్సహించాలి. కుటుంబ సభ్యుల సహకారం మీకు పుష్కలంగా ఉంటుంది. ఆత్మవిశ్వాసాన్ని బలపరచుకోండి. మీ జీవిత భాగస్వామి అనారోగ్య పాలయ్యే సూచనలున్నాయి. ఆందోళన చెందకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి మీ
అదృష్ట రంగు తెలుపు.
కుంభం
ఇంటా-బయటా అభిప్రాయ భేదాలు మీకు చికాకు కలిగిస్తాయి. ఆర్థిక పరిమితులను నివారించాలంటే అధిక ఖర్చులు నివారించాల్సిందే. మీరు మీ కుటుంబ సభ్యుల అవసరాలకు ప్రాధాన్యత ఇస్తారు. జీవిత భాగస్వామితో ఓ విషయానికి సంబంధించి లోతైన చర్చ జరుగుతుంది. మీకు కలిసొచ్చే రంగు ఊదా...
మీనం
ఈ రాశికి చెందిన హార్ట్ పేషెంట్లు తప్పనిసరిగా కాఫీ మానేయాలి, అనవసరమైన ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. మీ సమస్యలు పెరుగుతాయి. సన్నిహితులతో గడపడం మీలో ఉత్సాహాన్ని పెంచుతుంది. మీ వైవాహిక జీవితం అద్భుతంగా ఉంటుంది. ఈ రోజు మీ అదృష్ట రంగు ముదురు ఎరుపు.
Also Read: 2022-2023లో ఈ రాశివారు ఆ ఒక్కటీ తప్ప అన్ని విషయాల్లోనూ మహారాజులే
Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో