By: ABP Desam | Updated at : 12 May 2022 07:12 PM (IST)
Edited By: RamaLakshmibai
2022 మే 12 గురువారం రాశిఫలాలు
మేషం
వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు.మీ ఖర్చులను నియంత్రిస్తారు. ఆఫీసులో మీకు వ్యతిరేకంగా రాజకీయాలు జరుగుతాయి. యువతకు కెరీర్ విషయంలో ఒత్తిడి ఉంటుంది. పాత స్నేహితులతో సమయం గడుపుతారు. ఈరోజు మీరు ఆలోచనాత్మకంగా మాట్లాడాలి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.
వృషభం
విద్యార్థులు తమ వృత్తి గురించి ఆందోళన చెందుతారు. మీ అభిప్రాయాలను హేతుబద్ధంగా వ్యక్తం చేయడంలో మీకు అసౌకర్యం కలుగుతుంది. తప్పుడు చర్యల్లో సహకరిస్తే భయంకరమైన పరిణామాలకు దారి తీస్తుంది. భావోద్వేగానికి గురికాకుండా ఉండాలి. గతంలో జరిగిన పొరపాట్లపై పశ్చాత్తాపం చెందుతారు.
మిథునం
మీరు ఆర్థిక ప్రయోజనం పొందుతారు. వ్యాపారంలో కొత్త ఒప్పందానికి సంబంధించి మనస్సులో కొంత సందేహం ఉంటుంది. ఈ రోజు మీ వ్యాపారంలో మంచి ఫలితాలు పొందుతారు. రాజకీయాలతో సంబంధం ఉన్న వ్యక్తులు క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీ పనితీరుతో మీరు సంతృప్తి చెందలేరు. నిరుద్యోగులకు మంచి అవకాశాలు లభిస్తాయి.
Also Read: పెళ్లైన మహిళలు గాజులు వేసుకోవడం లేదా, అయితే ఈ విషయాలు తెలుసుకోండి
కర్కాటకం
ఈ రోజు మీకు మంచి రోజు. ఎవరితోనైనా ఉన్న పాత వివాదాలు తొలగిపోతాయి. బాధ్యతను అత్యంత చిత్తశుద్ధితో నిర్వర్తిస్తారు. మంచి వ్యక్తుల పరిచయం మీకు ఉపయోగపడుతుంది. పొట్టకు సంబంధించిన ఇబ్బంది ఎదుర్కొంటారు. మీరు కార్యాలయంలో జాగ్రత్తగా ఉండాలి. రిస్క్ తీసుకోకండి.
సింహం
ఎవరితోనైనా వివాదం జరిగే అవకాశం ఉంది. మీరు ప్రతికూల వార్తలు వినాల్సి వస్తుంది. తండ్రి ఆరోగ్యంపై ఆందోళన ఉంటుంది. ఆర్థిక విషయాల్లో కొంత గందరగోళం ఉంటుంది. విహారయాత్రకు వెళ్తారు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. ఎవ్వరికీ అనవసర సలహాలు ఇవ్వొద్దు. స్నేహితుల మద్దతు పొందుతారు.
కన్యా
చాలా రోజులుగా ఆగిపోయిన పని ఈ రోజు పూర్తిచేస్తారు. రోజంతా సానుకూలంగా ఉంటుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. వ్యాపారం పెంచుకునేందుకు మంచి సమయం. వృత్తి సంబంధమైన విజయాలు సాధిస్తారు. మీరు చాలా కాలంగా ఎదుర్కొంటున్న సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. ఇంటి వాతావరణం చాలా బాగుంటుంది. కోపంతో మాట్లాడొద్దు.
తులా
మీరు ఏదైనా విషయంలో కోపంగా ఉంటారు. కార్యాలయంలో అదనపు జవాబుదారీతనం మీపై ఉంటుంది. మీరు ప్రత్యామ్నాయ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడానికి ప్లాన్ చేసుకోండి. కుటుంబ సభ్యులపై నమ్మకం లోపిస్తుంది. లావాదేవీలు జాగ్రత్తగా చేయాలి.
వృశ్చికం
మీ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. వ్యాపారులకు ఈరోజు లాభదాయకమైన రోజు. తెలివైన వ్యక్తులను కలుస్తారు. ప్రేమికులు పెళ్లి దిశగా అడుగేసేందుకు మంచి రోజు. మీ పనులన్నీ సకాలంలో పూర్తవుతాయి.ఉద్యోగులకు ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఖర్చులను నియంత్రించగలుగుతారు.
Also Read: శ్రీ చక్రం ఎంత పవర్ ఫులో చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఏముంది
ధనుస్సు
తప్పుడు చర్యలకు మొగ్గు చూపకండి. తలపెట్టిన పనుల్లో మీ జీవిత భాగస్వామి సలహా తీసుకోండి. వ్యాపారులు లాభపడతారు. బంధువులను కలవడం మేలుచేస్తుంది. ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం.
మకరం
ఇంటి పని ఒత్తిడి మీపై ఉంటుంది. మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఛాలెంజింగ్ జాబ్ వచ్చే అవకాశం ఉంది. స్నేహితులతో సమయం స్పెండ్ చేస్తారు. కోపం తగ్గించుకోండి..లేదంటే చాలా నష్టపోతారు. కార్యాలయ పనుల్లో ఆటంకాలు ఏర్పడతాయి.
కుంభం
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. మీరు ఆరోగ్య విషయంలో ఇబ్బంది పడతారు. విహారయాత్రకు వెళ్తారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. లావాదేవీల సమయంలో అజాగ్రత్తగా ఉండకండి. ప్రమాదకర పనులు చేయవద్దు.
మీనం
వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు పొందొచ్చు. ఆర్థిక సమస్యలు దూరమవుతాయి. వైవాహిక జీవితంలో గందరగోళం తొలగిపోతుంది.పిల్లల విజయాల వల్ల ఉత్సాహంగా ఉంటారు. అవివాహితుల వివాహాల పట్ల ఆందోళన ఉంటుంది. పూర్వీకుల వ్యవహారాలు వేగవంతమవుతాయి.
Also Read: అష్టలక్ష్మీ స్తోత్రం చదివితే అష్టకష్టాలు తీరిపోతాయని ఎందుకు చెబుతారు
Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత
Horoscope Today 25th May 2022: ఈ రాశివారికి కుటుంబంతో విభేదాలు వచ్చే అవకాశం ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Shani Jayanti 2022: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది
TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్లైన్లో
Hanuman Jaya Mantram: హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!
Konaseema District: నిఘా నీడలో కోనసీమ జిల్లా- అమలాపురంలో కొనసాగుతున్న కర్ఫ్యూ
Weather Updates: నేడు ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు, ఉష్ణోగ్రత 4 డిగ్రీలదాకా ఎక్కువ నమోదయ్యే ఛాన్స్!
Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?
Venkatesh New Movie: 'ఎఫ్ 3' తర్వాత ఏంటి? దర్శకులను ఫైనలైజ్ చేసే పనిలో పడ్డ వెంకటేష్