IPL, 2022 | Qualifier 2 | Narendra Modi Stadium, Ahmedabad - 27 May, 07:30 pm IST
(Match Yet To Begin)
RR
RR
VS
RCB
RCB
IPL, 2022 | Final | Narendra Modi Stadium, Ahmedabad - 29 May, 08:00 pm IST
(Match Yet To Begin)
GT
GT
VS
TBC
TBC

Ashtalakshmi Stotram: అష్టలక్ష్మీ స్తోత్రం చదివితే అష్టకష్టాలు తీరిపోతాయని ఎందుకు చెబుతారు

అష్టైశ్వర్యాలు, అష్టకష్టాలు..ఇలా అష్ట చుట్టూ చాలా ముడిపడి ఉంటాయి. అష్టైశ్వర్యాలుంటే సంతోషమే కానీ అష్టకష్టాలు వెంటాడినప్పుడు మాత్రం డీలా పడిపోతారు. అలాంటి సమయంలో ఆ కష్టాలు తొలగించే శక్తి ఏంటో తెలుసా

FOLLOW US: 

అష్ట అంటే ఎనిమిది. అష్టకష్టాలు అంటే ఎనిమిది రకాల కష్టాలను తీర్చే శక్తి అష్టలక్ష్మిలకే ఉందని చెబుతారు. ఆ అష్టలక్ష్మిలు ఎవరు, ఏ లక్ష్మి ఎలాంటి కష్టం తీరుస్తుందో తెలుసుకుందాం...
 
ఆదిలక్ష్మి
వైకుంఠంలో శ్రీమన్నారాయణుడితో కొలువుతీరి ఉంటుంది ఆదిలక్ష్మి. లక్ష్మి దేవి చేతిలో కనిపించే కమలం పవిత్రతకు చిహ్నం. ఈమెనే ఇందిరాదేవి అని కూడా పూజిస్తారు. ఆది లక్ష్మిని ఆరాధిస్తే సంతోషంగా ఉంటారు.

ధాన్య లక్ష్మి 
ధాన్యం అంటే పండించిన పంట. అంటే ఈ రూపంలో మనం ఈ శక్తిని పూజించటం వలన మనం జీవించేందుకు కావాల్సిన ఆహారానికి ఎలాంటి లోటు ఉండదు. పంటలు సరిగ్గా పండాలన్నా, అతివృష్టి-అనావృష్టి రాకుండా ఉండాలన్నా ఈ తల్లి అనుగ్రహం ఉండాల్సిందే.

ధైర్య లక్ష్మి 
సమస్యల్ని ధైర్యంగా ఎదుర్కొనే వారితో సమస్య లేదు కానీ చిన్న కష్టం రాగానే కుంగిపోయేవారితోనే పెద్ద సమస్య. ఇలాంటి వారు ప్రార్థించాల్సింది ధైర్య లక్ష్మిని. ధైర్య లక్ష్మికి సంబంధించి ఓ కథ ప్రాచుర్యంలో ఉండేది. ఒక మహారాజు గ్రహస్ధితి బాగుండక అష్ట లక్ష్మిలు అందరూ ఒక్కొక్కరు ఈయనను విడిచి వెళ్ళి పోతుంటారు. చివరిగా వెళ్లిపోతున్న ధైర్యలక్ష్మిని తనని విడిచి వెళ్లొద్దని వేడుకున్నాడట రాజు. అందరూ వెళ్లిపోయినా ఒక్క నీ అనుగ్రహం నాకు ఉంటే చాలు మళ్లీ వారందరినీ పొందగలనని విశ్వాసంగా ఉందంటాడు. నిజమే కదా..ధైర్యం ఉంటే ఎంత పెద్ద సమస్య అయినా చిన్నదే కదా. 

గజలక్ష్మి 
క్షీరసాగర మథనం సమయంలో సముద్రుడి కుమార్తెగా ఉద్భవించింది గజలక్ష్మి. రెండు ఏనుగులు అమ్మ ప్రక్కన నిలబడి జలధారని వర్షింప చేస్తూంటాయి. ఇక్కడ ఏనుగులను గణపతి స్వరూపంగా భావిస్తారు. లక్ష్మీ గణపతి స్వరూపమైన ఈ మాతను పూజించటం వల్ల ఇల్లు, వాహనాలు సమకూరుతాయి. .

సంతాన లక్ష్మీ 
సంతాన లేమి సమస్య తీరుస్తుంది సంతాన లక్ష్మి. కొందరికి పిల్లలు కలిగినప్పటికీ వివిధ అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటారు. సంతాన లక్ష్మిని పూజిస్తే వారి ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందని చెబుతారు. 

విజయ లక్ష్మీ 
తలపెట్టిన ప్రతి పనిలోనూ, జీవితంలోనూ విజయం సాధించాలంటే విజయలక్ష్మి అనుగ్రహం ఉండాలి. ముఖ్యంగా ఆర్థిక ఇబ్బందులు తొలగించి సక్సెస్ అను అందిస్తుంది విజయలక్ష్మి. 

ధనలక్ష్మి
ధన లక్ష్మి అంటే సంపద, బంగారం మాత్రమే కాదు ప్రకృతి నుంచి లభించే ప్రతి వస్తువు కూడా. అంటే పచ్చని చెట్లు, ఫలవంతమైన చెట్లు, సమృద్ధిగా కురిసే వర్షాలు ఇవన్నీ సంపదే. ఇవే కదా ధనంగా మారేది. 

విద్యాలక్ష్మి
ఆధ్యాత్మికం, భౌతికం ఎందులో ఏ విద్య అయినా అందులో అమ్మవారి అనుగ్రహం ఉండాలంటే విద్యాలక్ష్మి దయ ఉండాల్సిందే. 

Also Read: 2022-2023 ఈ రాశులవారికి అద్భుతంగా ఉంటే, ఆ రెండు రాశులవారికి అరాచకంగా ఉంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

అష్ట లక్ష్ములని పూజించడం వలన షోడశ ఫలాలు మనకు లభిస్తాయని చెబుతారు. షోడశ అంటే 16...
1 కీర్తి, 2 జ్ఞానం, 3 ధైర్యం.. బలం, 4 విజయం , 5 సత్సంతానం, 6 యుద్ధ నైపుణ్యం, 7 బంగారం ఇతర సంపదలు,
8 సంతోషం, 9 భౌతిక సుఖాలు, 10 తెలివితేటలు, 11 అందం, 12 విద్యాభివృద్ధి, 13 ఉన్నత విలువలు.. ధ్యానం,
14 నీతి నియమాలు, 15 మంచి ఆరోగ్యం, 16 దీర్ఘ ఆయుః

అష్టలక్ష్మీ స్తోత్రం
ఆదిలక్ష్మి 
సుమనస వందిత సుందరి మాధవి, చంద్ర సహొదరి హేమమయే
మునిగణ వందిత మోక్షప్రదాయని, మంజుల భాషిణి వేదనుతే |
పంకజవాసిని దేవ సుపూజిత, సద్గుణ వర్షిణి శాంతియుతే
జయ జయహే మధుసూదన కామిని, ఆదిలక్ష్మి పరిపాలయ మామ్ || 1 ||

ధాన్యలక్ష్మి
అయికలి కల్మష నాశిని కామిని, వైదిక రూపిణి వేదమయే
క్షీర సముద్భవ మంగళ రూపిణి, మంత్రనివాసిని మంత్రనుతే |
మంగళదాయిని అంబుజవాసిని, దేవగణాశ్రిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధాన్యలక్ష్మి పరిపాలయ మామ్ || 2 ||

ధైర్యలక్ష్మి
జయవరవర్షిణి వైష్ణవి భార్గవి, మంత్ర స్వరూపిణి మంత్రమయే
సురగణ పూజిత శీఘ్ర ఫలప్రద, ఙ్ఞాన వికాసిని శాస్త్రనుతే |
భవభయహారిణి పాపవిమోచని, సాధు జనాశ్రిత పాదయుతే
జయ జయహే మధు సూధన కామిని, ధైర్యలక్ష్మీ పరిపాలయ మామ్ || 3 ||

గజలక్ష్మి
జయ జయ దుర్గతి నాశిని కామిని, సర్వఫలప్రద శాస్త్రమయే
రధగజ తురగపదాతి సమావృత, పరిజన మండిత లోకనుతే |
హరిహర బ్రహ్మ సుపూజిత సేవిత, తాప నివారిణి పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, గజలక్ష్మీ రూపేణ పాలయ మామ్ || 4 ||

సంతానలక్ష్మి
అయిఖగ వాహిని మోహిని చక్రిణి, రాగవివర్ధిని ఙ్ఞానమయే
గుణగణవారధి లోకహితైషిణి, సప్తస్వర భూషిత గాననుతే |
సకల సురాసుర దేవ మునీశ్వర, మానవ వందిత పాదయుతే
జయ జయహే మధుసూదన కామిని, సంతానలక్ష్మీ పరిపాలయ మామ్ || 5 ||

విజయలక్ష్మి
జయ కమలాసిని సద్గతి దాయిని, ఙ్ఞానవికాసిని గానమయే
అనుదిన మర్చిత కుంకుమ ధూసర, భూషిత వాసిత వాద్యనుతే |
కనకధరాస్తుతి వైభవ వందిత, శంకరదేశిక మాన్యపదే
జయ జయహే మధుసూదన కామిని, విజయలక్ష్మీ పరిపాలయ మామ్ || 6 ||

విద్యాలక్ష్మి
ప్రణత సురేశ్వరి భారతి భార్గవి, శోకవినాశిని రత్నమయే
మణిమయ భూషిత కర్ణవిభూషణ, శాంతి సమావృత హాస్యముఖే |
నవనిధి దాయిని కలిమలహారిణి, కామిత ఫలప్రద హస్తయుతే
జయ జయహే మధుసూదన కామిని, విద్యాలక్ష్మీ సదా పాలయ మామ్ || 7 ||

ధనలక్ష్మి
ధిమిధిమి ధింధిమి ధింధిమి-దింధిమి, దుంధుభి నాద సుపూర్ణమయే
ఘుమఘుమ ఘుంఘుమ ఘుంఘుమ ఘుంఘుమ, శంఖ నినాద సువాద్యనుతే |
వేద పూరాణేతిహాస సుపూజిత, వైదిక మార్గ ప్రదర్శయుతే
జయ జయహే మధుసూదన కామిని, ధనలక్ష్మి రూపేణా పాలయ మామ్ || 8 ||

ఫలశృతి
శ్లో|| అష్టలక్ష్మీ నమస్తుభ్యం వరదే కామరూపిణి |
విష్ణువక్షః స్థలా రూఢే భక్త మోక్ష ప్రదాయిని ||

శ్లో|| శంఖ చక్రగదాహస్తే విశ్వరూపిణితే జయః |
జగన్మాత్రే చ మోహిన్యై మంగళం శుభ మంగళమ్

Also Read: 2022-2023 ఈ రాశులవారికి అదృష్టం కేరాఫ్ అడ్రస్ అని చెప్పొచ్చు , ఇందులో మీ రాశి ఉందా ఇక్కడ తెలుసుకోండి

Published at : 11 May 2022 03:21 PM (IST) Tags: ashtalakshmi stotram ashtalakshmi stotram telugu ashtalakshmi stotram with lyrics ashta lakshmi stotram ashtalakshmi stotra ashtalakshmi stothram ashtalakshmi stotram in telugu

సంబంధిత కథనాలు

TTD Special Darshanam Tickets: వయోవృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ గుడ్‌న్యూస్ - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

TTD Special Darshanam Tickets: వయోవృద్ధులు, దివ్యాంగులకు టీటీడీ గుడ్‌న్యూస్ - ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు విడుదల

Rohini Karte 2022: రోహిణి కార్తె ప్రారంభమైంది, ఇంతకీ కార్తెలు అంటే ఏంటి

Rohini Karte 2022: రోహిణి కార్తె ప్రారంభమైంది, ఇంతకీ కార్తెలు అంటే ఏంటి

Hanuman: ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు, అసలు సిసలు వ్యక్తిత్వ వికాస గని హనుమంతుడు

Hanuman: ఎక్కడ తగ్గాలో ఎక్కడ నెగ్గాలో తెలుసు, అసలు సిసలు వ్యక్తిత్వ వికాస గని హనుమంతుడు

Astrology: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు

Astrology: మీరు డిసెంబరులో జన్మించారా, అయితే మీరు పుట్టుకతోనే టీచర్లు, నిత్య విద్యార్థులు

Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత

Today Panchang 25 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, హనుమజ్జయంతి ప్రత్యేకత
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

YS Jagan Davos Tour: మచిలీపట్నంలో కర్బన రహిత ఇండస్ట్రియల్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ జోన్‌, ఏపీతో ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌ ఒప్పందం

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

PM Modi Hyderabad Tour: ప్రధాని మోదీ హైదరాబాద్‌ పర్యటన అధికారిక షెడ్యూల్ ఇదే - SPG ఆధీనంలో బేగంపేట ఎయిర్‌పోర్ట్

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

World Loans : కరోనా దెబ్బకు అప్పుల పాలయిన ప్రపంచం ! మాంద్యం ముంచుకొస్తుందా ?

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి

Atmakur By Election: ఏపీలో మోగిన ఉప ఎన్నికల నగారా, ఆత్మకూరు బై ఎలక్షన్ ఎప్పుడంటే ! రేసులో ముందున్న విక్రమ్ రెడ్డి