Horoscope Today 8th May 2022: ఈ రాశివారి జీవితంలో సరికొత్త వెలుగులొస్తాయి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 మే 8 ఆదివారం రాశిఫలాలు

మేషం
దంపతులు సంతోషంగా ఉంటారు. ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొంటుంది. ఈరోజు పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి.అదృష్టం కలిసొస్తుంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి. కెరీర్‌లో సానుకూల మార్పులు ఉంటాయి. అప్పుగా తీసుకున్న డబ్బు తిరిగి రావడం కష్టమే. ముందుగా చేయాలని ప్లాన్ చేసుకున్న పనులు సకాలంలో పూర్తిచేయగలుగుతారు. 

వృషభం
మీరు కార్యాలయంలో శుభవార్త అందుకుంటారు. వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది. వ్యక్తిగత సంబంధాలు బలపడతాయి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కొన్ని ప్లాన్స్ వేసుకోవచ్చు. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది.పెద్దల నుంచి ఆస్తి కలిసొస్తుంది. 

మిథునం
ఈ రోజు సన్నిహితులతో వాగ్వాదం జరగొచ్చు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది.  భవిష్యత్తు గురించి ఆందోళన చెందుతారు. కుటుంబ సభ్యుల నుంచి ఆశించిన సహకారం లభిస్తుంది. రాజకీయ వ్యక్తులతో మీ సంబంధాలు బలంగా ఉంటాయి. మీరు వ్యాపారంలో పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టొచ్చు. కుటుంబ ఖర్చులు పెరుగుతాయి.

Also Read:  2022-2023లో ఈ రాశివారికి అస్సలు బాలేదు, మనోబలం తప్ప గ్రహబలం లేదు

కర్కాటకం
ఈ రాశివారి కోర్కెలు నెరవేరతాయి. నిర్మాణ పనులకు సంబంధించిన ఈ రోజు చాలా మంచిది. కొత్త విషయాలు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తారు. వైవాహిక జీవితంలో ప్రేమ పెరుగుతుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. అనవసర వాదనల్లో సమయాన్ని వృథా చేయకండి. పిల్లల అవసరాలు తీరుస్తారు.

సింహం
జీవిత భాగస్వామితో విభేదాలు రావొచ్చు. ఉద్యోగుల పనితీరు మెరుగుపడుతుంది. బహిరంగ ప్రదేశాల్లో వ్యక్తిగత చర్చలు జరపొద్దు. పరస్పర సంబంధాలు బలపడతాయి. కొత్త భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు. 

కన్య
ఈ రోజు మీరు ఆరోగ్యం విషయంలో ఇబ్బందుల్లో పడతారు. ముఖ్యమైన ప్రాజెక్ట్ పనిలో పాల్గొంటారు. వ్యాపారంలో డబ్బు సంపాదించే అవకాశాలు ఉన్నాయి. ఆగిపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. సామాజిక జీవితంలో మీ కార్యాచరణ పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. కెరీర్ విషయంలో మీరు పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు.

తులా
ఈ రోజు మీరు కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. సాంకేతిక పనులపై ఆసక్తి చూపుతారు. అదృష్టం కలిసొస్తుంది. ప్రేమ వ్యవహారాల గురించి మీరు భావోద్వేగానికి లోనవుతారు.రిస్క్ తీసుకోవద్దు. భాగస్వామ్య వ్వాపారం కలిసొస్తుంది. ఇంట్లో ఏదైనా శుభకార్యం జరగవచ్చు. 

వృశ్చికం
స్నేహితుడి నుంచి సహాయం అందుతుంది. అవివాహితులకు వివాహ ప్రతిపాదనలు వస్తాయి. జీవిత భాగస్వామితో పాత సంతోషకరమైన సంఘటనల గురించి చర్చిస్తారు. మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తుల గౌరవం పెరుగుతుంది. కార్యాలయంలో మీ ప్రజాదరణ పెరుగుతుంది. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు.

 Also Read: 2022-2023లో ఈ రాశివారు ఆ ఒక్కటీ తప్ప అన్ని విషయాల్లోనూ మహారాజులే

ధనుస్సు
జీవిత భాగస్వామితో ఓ విషయంలో వాదన ఉంటుంది. మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవడం వల్ల వివాదం పెరుగుతుంది. నిరుపేదలకు సహాయం చేస్తారు. దాన ధర్మాల పట్ల ఆసక్తి ఉంటుంది. తెలియని వ్యక్తులపై ఎక్కువగా ఆధారపడవద్దు. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి.

మకరం
వ్యాపారంలో లాభం ఉంటుంది. వేరేవారి ఆలోచనలపై ఆధారపడి నిర్ణయం తీసుకోవద్దు.తలపెట్టిన పనులు సులభంగా పూర్తిచేస్తారు. ఆస్తికి సంబంధించిన విషయాల్లో విజయం సాధిస్తారు.జీవిత భాగస్వామితో గొడవ పెట్టుకోవద్దు. భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవచ్చు. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు.

కుంభం
ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి.  బాధ్యతలు నిర్వర్తించాలనే ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కార్యాలయంలో పెద్ద మార్పులు చేయవద్దు. పనివిషయంలో అంకితభావం ఉంటుంది. పాదాల నొప్పితో ఇబ్బంది పడతారు. సోషల్ మీడియాలో బిజీగా ఉంటారు. 

Also Read: శ్రీ శుభకృత్ నామ సంవత్సరంలో ఈ నాలుగు రాశుల వారికి ఆర్థికంగా కలిసొస్తుంది, మీరున్నారా అందులో

మీనం
కుటుంబ బాధ్యతలు నెరవేరుస్తారు. వ్యాపారంలో పెద్ద ఆర్డర్లు పొందుతారు. కార్యాలయంలో బాధ్యతలు సకాలంలో పూర్తిచేస్తారు. సాంకేతిక నైపుణ్యాలను మెరుగుపర్చుకుంటారు. ఆదాయం పెరుగుతుంది. మీ సన్నిహితులతో సత్సంబంధాలు కొనసాగించండి. ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు.

Published at : 08 May 2022 06:36 AM (IST) Tags: Horoscope Today Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Taurus Gemini Virgo Aries Horoscope Today 8th may 2022

సంబంధిత కథనాలు

Shani Jayanti 2022: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది

Shani Jayanti 2022: మే 30 సోమవారం శనిజయంతి, ఆ రోజు ఇలా చేస్తే ప్రతీదీ శుభమే జరుగుతుంది

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

TTD Darshan Tickets: శ్రీవారి భక్తులకు టీటీడీ శుభవార్త, ఆగస్టు దర్శన టికెట్లు విడుదల - మధ్యాహ్నం మరిన్ని సేవల కోటా టికెట్లు ఆన్‌లైన్‌లో

Hanuman Jaya Mantram: హనుమాన్ జయమంత్రం, పిల్లలతో నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!

Hanuman Jaya Mantram: హనుమాన్ జయమంత్రం,  పిల్లలతో  నిత్యం ఇది చదివించడం చాలా అవసరం - ఎందుకంటే!

Sundarakanda Parayanam: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా

Sundarakanda Parayanam: వివాహం, సంతానం, శని బాధలు ఇలా సుందరకాండలో ఏ ఘట్టం చదివితే ఎలాంటి సమస్యలు తీరుతాయో తెలుసా

Horoscope Today 24th May 2022: మంగళవారం ఈ రాశులవారికి జయాన్నిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 24th May 2022: మంగళవారం ఈ రాశులవారికి జయాన్నిస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
SHOPPING
Top Mobiles
LAPTOP AND ACCESORIES
Best Deals

టాప్ స్టోరీస్

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Konaseema Police Intelligence Failure : మరోసారి ఏపీ పోలీస్ ఇంటలిజెన్స్ ఫెయిల్ అయిందా ! కోనసీమ ఆందోళనలను లైట్ తీసుకున్నారా ?

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ? ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Babu Pawan Reaction : పాలనా వైఫల్యాన్ని మా మీద నెడతారా ?  ప్రభుత్వంపై పవన్, చంద్రబాబు ఆగ్రహం!

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Quad Meet Tension : క్వాడ్ దేశాధినేతలను రెచ్చగొడుతున్న  చైనా, రష్యా - మీటింగ్ సమీపంలో యుద్ధ విన్యాసాలు !

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!

Cooking Oil Prices: వంట నూనెలపై గుడ్‌ న్యూస్‌ చెప్పనున్న కేంద్రం! సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌ ధరపై..!