Horoscope Today 17th April 2022: ఈ రాశివారు మోసపోకుండా జాగ్రత్తపడండి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 ఏప్రిల్ 17 ఆదివారం రాశిఫలాలు

మేషం
మీ ఆదాయాన్ని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. వ్యాపార సమస్యలు పరిష్కారమవుతాయి. ఓర్పు మరియు పట్టుదలతో ముందుకు సాగాలి. దంపతుల మధ్య అంకిత భావాలు, ప్రేమాభిమానాలు పెరుగుతాయి. కుటుంబంతో సమయం గడపగలుగుతారు. వివాహం నిశ్చయమవుతుంది.

వృషభం
మీరు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి ఉపశమనం పొందుతారు. మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. మీ బాధ్యతలు ఎక్కువవుతాయి.  కమీషన్‌కు సంబంధించిన వ్యాపారంలో లాభం ఉంటుంది. కార్యాలయంలో ఉద్యోగులకు అనుకూల పరిస్థితులుంటాయి. 

మిధునం
ఈరోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. భౌతిక సౌకర్యాలకు ఖర్చు చేస్తారు. మీ వర్కింగ్ స్టైల్ మారుస్తుంది. పాత మిత్రులను కలుసుకుంటారు. ఇంటి పనులకు ప్రాధాన్యత ఇస్తారు. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులవుతారు. 

Also Read: ఏప్రిల్ 29 న కుంభరాశిలోకి శని, ఈ ప్రభావం మీ రాశిపై ఎలాఉందో ఇక్కడ తెలుసుకోండి

కర్కాటకం
రాజకీయ రంగానికి సంబంధించిన వ్యక్తులకు పెద్ద బాధ్యత ఉంటుంది. ఎవరినీ గుడ్డిగా నమ్మొద్దు. ఎవరైనా మిమ్మల్ని మోసం చేసే ప్రయత్నం చేస్తారు. ఖర్చులు తగ్గించుకోండి. ఆరోగ్యం కాస్త బలహీనంగా ఉంటుంది. తొందరగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. పెద్దల మాట పరిగణలోకి తీసుకోండి. 

సింహం
ఈ రోజు ఇంటికి బంధువుల రాక ఉంటుంది. కొత్త ఆదాయ వనరులు అభివృద్ధి చెందుతాయి. ఇచ్చిన అప్పు తిరిగి పొందుతారు.  కుటుంబ సభ్యులు మీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉంటారు. వ్యాపార లావాదేవీలు జరిగే అవకాశం ఉంది. మీరు ప్రయాణం చేయాల్సి రావొచ్చు. యువత కెరీర్ పరంగా విజయం సాధిస్తారు.

కన్యా
ఈరోజు అద్భుతంగా ఉంటుంది. అనుకున్న పనులు అనుకున్నట్టు పూర్తిచేస్తారు.  ముఖ్యమైన పనులు చేసేముందు పెద్దల సలహాలు తీసుకోండి. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఆరోగ్య సమస్యలు పెరుగుతాయి. కార్యాలయంలో మీ శత్రువులు యాక్టివ్ గా ఉంటారు.

తులా
ఈ రోజు ఏకాంతంగా గడపాలనుకుంటారు. మీ మనస్సు చాలా ప్రశాంతంగా ఉంటుంది. ఇంట్లో ఆనందం నెలకొంటుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా కాస్త ఆలోచించండి. ఆస్తుల క్రయ విక్రయాల వల్ల లాభం ఉంటుంది. పాత గొడవలు పరిష్కారం అవుతాయి. 

వృశ్చికం
పెట్టుబడి పెట్టే ముందు దాని గురించి పూర్తి సమాచారాన్ని పొందండి. చేసేపనిని అందరి ముందూ ప్రదర్శించుకోవాల్సిన అవసరం లేదు. అనవసర ఖర్చులను తగ్గించుకోండి.  పిల్లల అవసరాలు తీర్చగలరు. దంపతులు సంతోషంగా ఉంటారు. పని నాణ్యతపై శ్రద్ధ వహించండి. మీ సామర్థ్యాన్ని దుర్వినియోగం చేయవద్దు. ఉద్యోగాలు మారడం లాంటి ఆలోచన చేయకండి. 

ధనుస్సు 
ఈ రోజు మీకు అదృష్టం కలిసొస్తుంది. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  మనసు ఆనందంగా ఉంటుంది. వ్యాపారస్తులు లాభపడగలరు. కొత్త వ్యాపారంలో పెద్ద ధనలాభం ఉంటుంది. మీరు స్నేహితుల నుంచి మద్దతు పొందుతారు. వివాహం నిశ్చయం అయ్యేందుకు ఉన్న ఆంటకాలు తొలగిపోతాయి. ఆహారం విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి.

Also Read: ఏప్రిల్ 13 నుంచి రాశి మారనున్న బృహస్పతి, ఈ ఐదు రాశులవారికి అదృష్టం మామూలుగా లేదు

మకరం
మీ పనులన్నీ సులభంగా పూర్తవుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. గృహ వాతావరణం బాగుంటుంది.  ఈరోజు మీరు చాలా సంతోషంగా ఉంటారు. భవిష్యత్తు కోసం కొత్త ప్లాన్ వేస్తారు. కార్యాలయంలో మీ ప్రజాదరణ పెరుగుతుంది. మీరు టూర్ ప్లాన్ చేసుకోవచ్చు.
 
కుంభం
ఈరోజు కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి. మీరు ఎలాంటి బాధల నుంచి అయినా  ఉపశమనం పొందుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.  వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. పోటీపరీక్షలు రాసే విద్యార్థులు ఊహించిన ఫలితాలు పొందుతారు. 

మీనం
ఈ రోజు గందరగోళంగా ఉంటుంది. కుటుంబ సభ్యులు ఆందోళనకు గురవుతారు. మీ కోపంతో దగ్గరవారిని బాధపెడతారు. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వద్దు. సమాజంలో మీ ప్రభావం తగ్గుతుంది. వాహనాన్ని వేగంగా నడపకండి. బంధువులను కలుస్తారు, శుభకార్యాల్లో పాల్గొంటారు. 

Also Read: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే

Published at : 17 Apr 2022 07:24 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Horoscope Today 17th April 2022

సంబంధిత కథనాలు

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Heavy Rush at Tirumala: తిరుమలకు వెళ్తున్న భక్తులకు టీటీడీ కీలక సూచనలు, కిలోమీటర్లు మేర క్యూలైన్లలో గోవిందా గోవిందా !

Horoscope Today 29th May 2022: ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 29th May 2022:  ఈ రోజు ఈ రాశివారు మాజీ ప్రియురాలు/ ప్రియుడిని కలుస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Today Panchang 29 May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శ్రీ సూర్య స్త్రోత్రం

Today Panchang 29 May 2022:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, దుఃఖం, శ్రీ సూర్య స్త్రోత్రం

Tirumala News : తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Tirumala News : తిరుమలకు పోటెత్తిన  భక్తులు, శ్రీవారి దర్శనానికి 48 గంటలు పట్టే అవకాశం!

Horoscope Today 28th May 2022: ఈ రాశులవారు తమ పనిని పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope Today 28th May 2022:  ఈ రాశులవారు తమ పనిని  పక్కవారికి అప్పగించేందుకు ప్లాన్ చేస్తారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

టాప్ స్టోరీస్

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Vijayashanthi: విజయశాంతి - వీకే శశికళ రహస్య భేటీ! మూడేళ్ల క్రితం సాధ్యంకానిది ఇప్పుడవుతుందా?

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Amalapuram Violence: కొనసాగుతున్న అరెస్టుల పర్వం - మరో 7 రోజులపాటు 144 సెక్షన్ పొడిగింపు, మరో కీలక నిర్ణయం

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

Boy Smoking: KGF 2 రాకీ భాయ్‌లా ట్రై చేసిన స్టూడెంట్, వెంటనే ఆసుపత్రిలో జాయిన్ చేసిన పేరెంట్స్

Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు

Khammam: కానిస్టేబుల్ దంపతుల పాడుపని! ఏకంగా కోటిన్నర దోచేసిన భార్యాభర్తలు