Horoscope Today 14th April 2022: ఈ రాశివారు కుటుంబాన్ని, వృత్తిని బ్యాలెన్స్ చేసుకునేందుకు ఇబ్బందిపడతారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఏప్రిల్ 14 గురువారం రాశిఫలాలు
మేషం
ఈ రాశి వారికి మార్గదర్శకత్వం లభిస్తుంది. ఉన్నత విద్యలో వచ్చే సమస్యలను విద్యార్థులు అధిగమిస్తారు. సమయాన్నంచా ఆలోచనలకే వెచ్చిస్తారు. చిల్లర వ్యాపారులకు ఈ రోజు చాలా మంచిది. ఉద్యోగులు సహోద్యోగులతో సత్సంబంధాలు కొనసాగించాలి. నిరుద్యోగులు ఇంటర్యూల్లో సక్సెస్ అవుతారు.
వృషభం
భూమి లేదా ఇంటి కోసం పెట్టుబడి పెట్టడం ద్వారా లాభం పొందుతారు. మీ మనసులో చాలా సానుకూల ఆలోచనలు వస్తాయి. మీ మంచి అలవాట్లతో కుటుంబ సభ్యులు సంతోషిస్తారు. రోజు ప్రారంభంలో కాస్త అలసటగా ఉంటుంది. సాయంత్రం ఎక్కడికైనా వాకింగ్ కి వెళ్లొచ్చు. కార్యాలయంలో మీ విశ్వసనీయత పెరుగుతుంది.
మిధునం
మీ ప్రణాళికలను బహిర్గతం చేయవద్దు. మీడియాతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు ప్రత్యేకమైన రోజు కానుంది. కుటుంబ సభ్యులు ఏదో ఒక విషయంలో మీపై కోపంగా ఉండవచ్చు. ఎవరితోనైనా వివాదాలు ఎదురవుతాయి జాగ్రత్త. పిల్లల వైపు విజయం సాధిస్తారు. మీ పనులు చాలా వరకు నిదానంగా సాగుతాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
Also Read: శుక్రుడు సంచారం, ఈ ఏడు రాశులవారికి ఆనందం-ధనం సహా అన్నింటా శుభసమయమే
కర్కాటకం
వ్యాపారంలో కొత్త ఒప్పందాలు జరగుతాయి. ఇతరులు చెప్పేదానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టవద్దు. మీకు ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బంధువులను కలుస్తారు. మీరు కొన్ని విషయాల్లో విమర్శలు ఎదుర్కొనే అవకాశం ఉంది. అధిక పని అలసటకు దారి తీస్తుంది. దంపతుల మధ్య కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి.
సింహం
ఈరోజు సాధారణంగా ఉంటుంది. మీరు చేసిన ఓ తప్పు కారణంగా కుటుంబ సభ్యులు కలతచెందుతారు. ఎవరితోనైనా వివాదాలు రావొచ్చు. దినచర్యను సరిగ్గా ప్లాన్ చేసుకోండి, ఫాలో అవండి. ఏదో ఒక సంఘటన గురించి మీ మనసులో భయం ఉంటుంది. ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు.
కన్యా
ధనలాభం కలిగే అవకాశం ఉంది. కుటుంబాన్ని, ఉద్యోగాన్ని బ్యాలన్స్ చేసుకోండి. భౌతిక వనరులపై డబ్బు ఖర్చు చేస్తారు. అధిక పని అలసటకు దారి తీస్తుంది. దంపతుల మధ్య కొన్ని ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి.
తులా
డబ్బు లావాదేవీల విషయంలో పొరపాట్లు జరగవచ్చు. తమ బాధ్యతలను పూర్తిస్థాయిలో నిర్వర్తించగలరు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. మీ లక్ష్యాల పట్ల ఉదాసీనంగా ఉండకండి. అనారోగ్య సమస్యతో బాధపడతారు. మీ ఆదాయం పెరిగేకొద్దీ, మీ ఖర్చులు కూడా పెరగుతాయి. మీరు ఈరోజు బయటకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు.
Also Read: ఏప్రిల్ 13 నుంచి రాశి మారనున్న బృహస్పతి, ఈ ఐదు రాశులవారికి అదృష్టం మామూలుగా లేదు
వృశ్చికం
వ్యాపారానికి సంబంధించి అవసరమైన నిర్ణయాలు తీసుకుంటారు. బంధువులను కలవడానికి వెళతారు. ముఖ్యమైన పనులను సరైన సమయంలో పూర్తి చేస్తారు. మీ లక్ష్యాలపై దృష్టి కేంద్రీకరించండి. స్థిరాస్తిని విక్రయించే ప్రయత్నాలు ఫలిస్తాయి. చికిత్సకు ఖర్చు అవుతుంది. విద్యార్థులు విజయం సాధిస్తారు.
ధనుస్సు
ఈరోజు అద్భుతంగా ఉంటుంది. కొత్త వ్యాపారాల పట్ల ఉత్సాహంగా ఉంటారు. మీరు శుభకార్యాలకోసం షాపింగ్ చేస్తారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది.పిల్లలు అద్భుతమైన కెరీర్ అవకాశాలను పొందవచ్చు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
మకరం
మీ డబ్బును రక్షించుకోండి. అప్పులు ఇవ్వకండి. రోగులు ఆహారం పట్ల శ్రద్ధ వహించాలి. మీ సామర్థ్యాన్ని గుర్తించి దాన్ని సరిగ్గా ఉపయోగించుకోండి. కొత్త ప్రణాళికల అమలు కాస్త కష్టమవుతుంది. కష్టంతో కూడుకున్న డబ్బు చాలారోజుల తర్వాత చేతికందుతుంది. కొన్ని బాధల నుంచి ఉపశమనం పొందుతారు.
కుంభం
మీరు కొన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. తల్లిదండ్రుల సలహాలు, ఆశీస్సులు తప్పకుండా తీసుకోండి. మీ మాటలతో ఎవరినీ ఒత్తిడి చేయకండి. ఆరోగ్యం పట్ల అశ్రద్ధ వహించడం సరికాదు. మీ జీవనశైలిని సరిగ్గా ప్లాన్ చేసుకోండి. దినచర్యను మార్చుకోండి.
Also Read: ఈ వారం ఈ రాశివారికి చాలా అనుకూలంగా ఉంది, మీరున్నారా ఇందులో తెలుసుకోండి
మీనం
ఈరోజు మంచి రోజు అవుతుంది. వైవాహిక సంబంధాల్లో సానుకూల భావన ఉంటుంది. విదేశాల్లో పనిచేసే వారికి ఇంక్రిమెంట్ లభిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది. ప్రభుత్వ పనులు సులువుగా జరుగుతాయి. ఉద్యోగంలో ఉన్నత స్థానం పొందవచ్చు. సామాజిక గౌరవం పెరుగుతుంది.