By: ABP Desam | Updated at : 11 Apr 2022 06:34 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 ఏప్రిల్ 11 నుంచి17 వరకూ రాశిఫలాలు
2022 ఏప్రిల్ 11 సోమవారం నుంచి17 ఆదివారం వరకూ రాశిఫలాలు
మేషం
శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. ఉద్యోగం విషయంలో అజాగ్రత్తగా ఉండకండి. ప్రేమ వివాహం చేసుకునేందుకు చాలా ఉత్సాహం చూపిస్తారు. వైవాహిక జీవితం బావుంటుంది. ఆఫీసులో కొత్త స్నేహితులను సంపాదించుకుంటారు. నిరుద్యోగులు వారం చివరిలో ఉద్యోగం పొందే అవకాశం ఉంది. పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి. ఆరోగ్య పరంగా ఈ వారం సాధారణంగా ఉంటుంది. అలర్జీ సమస్య పెరుగుతుంది.వ్యాపారంలో కొన్ని సవాళ్లను ఎదుర్కొంటారు. సలహా ఇవ్వకండి. మీ పరిచయాలు క్షీణించేలా ప్రవర్తించవద్దు. రిస్క్ తీసుకోవడం మానుకోండి.
వృషభం
కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు జరుగుతాయి. ఈ వారం నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. మీరు మీ కెరీర్‌లో అకస్మాత్తుగా చాలా మంచి అవకాశాలను పొందే అవకాశం ఉంది. కుటుంబ వాతావరణం బాగుంటుంది. ఆర్థిక స్థితి బాగుంటుంది. ప్రేమికులకు ఈ వారం చాలా అనుకూలంగా ఉంటుంది. స్నేహ సంబంధాల్లో చాలా మాధుర్యం ఉంటుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు తొలగిపోతాయి. వారం ప్రారంభం శుభప్రదంగా ఉంటుంది. మనసులో అనవసరమైన ఆలోచనలు వస్తూనే ఉంటాయి. కానీ మిమ్మల్ని మీరు నియంత్రించుకోవాలి. ప్రతికూల ధోరణులు ఉన్న వ్యక్తులకు దూరంగా ఉండండి. ఒత్తిడి తగ్గుతుంది.
మిథునం
మీరు కుటుంబం నుంచి మంచి ఆప్యాయత పొందుతారు. ధన స్థితి బాగుంటుంది. మీ కెరీర్‌లో చాలా మంచి అవకాశాలను పొందే అవకాశం ఉంది. మీ ఆలోచనలతో ప్రశంసలు అందుకుంటారు. అవసరమైన సహాయం అందుతుంది. ఈ వారం మీరు కుటుంబానికి, పిల్లలకు అదనపు సమయం ఇవ్వాల్సి ఉంటుంది. వారాంతం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.మీరు క్లిష్టమైన సమస్యలను పరిష్కరించగలరు. ఆరోగ్యానికి సంబంధించి కొంత టెన్షన్ ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు రావచ్చు.స్పైసీ ఫుడ్ తీసుకోవడం మానుకోండి. తొందరపడి ఏ వ్యాపార ఆఫర్‌కు అంగీకరించవద్దు. కొత్త ఉద్యోగం ప్రారంభించడానికి ఇది చాలా మంచి వారం. ప్రమాదాలు, గాయాలు అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. మీరు పిల్లల గురించి కొంచెం ఆందోళన చెందుతారు.
కర్కాటకం
ఈ వారం మీకు చాలాబావుంటుంది. ఈ వారం వ్యాపారం బాగా సాగుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించేందుకు అనుకూల సమయం. ఆస్తికి సంబంధించిన సమస్యలు పరిష్కారమవుతాయి. మిత్రులు మీకు విధేయులుగా ఉంటారు. డబ్బును సరిగ్గా ప్లాన్ చేసుకుంటే విజయాన్ని సాధించవచ్చు. అపరిచితులతో వివాదాలు ఉండొచ్చు. పెద్దల సలహాలు పాటించండి. కఠినమైన వ్యాయామం చేయొద్దు. ఉన్నతాధికారుల ప్రవర్తన కాస్త వింతగా ఉంటుంది. బ్యాంకింగ్ రంగంతో సంబంధం ఉన్న వ్యక్తులపై అదనపు పని ఒత్తిడి ఉండవచ్చు. కుటుంబ సభ్యులలో ఎవరికైనా అనారోగ్య సమస్య ఉంటే దాన్ని తేలిగ్గా తీసుకోవద్దు. విద్యార్థులకు చదువుపట్ల ఆసక్తి పెరుగుతుంది.
సింహం
మీరు కొత్త పనిని ప్రారంభించవచ్చు. వ్యాపారులకు లాభసాటిగా ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. వారం చివరిలో ఉత్సాహం పెరుగుతుంది. మీ జీవిత భాగస్వామితో సంతోష సమయం గడుపుతారు. పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు. వారం ప్రారంభంలో నష్టపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం విషయంలో మనసులో కొంత భయం ఉంటుంది. పౌష్టికాహారం తీసుకోండి. తల్లి ఆరోగ్యం బలహీనంగా ఉండొచ్చు. లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇతరుల మనోభావాలను గాయపరచవద్దు. ఎవరితోనైనా విభేదాలు ఉద్రిక్తతకు కారణమవుతాయి.
కన్య
పని పట్ల ఉత్సాహం పెరుగుతుంది. కెరీర్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు. వ్యాపారంలో లాభంతో పాటు గౌరవం కూడా లభిస్తుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. నిర్ణీత సమయానికి ముందే పనులు పూర్తి చేస్తారు. మిత్రులను కలుస్తారు. వారం చివరిలో మంచి సమాచారం అందుతుంది. ఒకరి ప్రవర్తన కారణంగా మీరుసిగ్గుపడాల్సి రావొచ్చు. కొన్ని సందర్భాల్లో మనస్తాపం చెందుతారు. అనైతిక కార్యకలాపాలకు దూరంగా ఉండండి. గత తప్పులకు పశ్చాత్తాపపడతారు. న్యాయపరమైన విషయాలను ప్రస్తుతానికి వాయిదా వేయడం సముచితం. సోమవారం కొత్త పనులు ప్రారంభించవద్దు. అధిక శ్రమ అలసటకు కారణమవుతుంది.
తుల
ఈ వారం మీకు మంచి సమాచారం అందుతుంది.మీ దినచర్య చాలా సమతుల్యంగా ఉంటుంది. ప్రైవేటు ఉద్యోగాలు చేసే వారికి మంచి సమయం. నిరుద్యోగులు ఇంటర్యూల్లో విజయం సాధిస్తారు. నిలిచిపోయిన మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో కస్టమర్లతో సంబంధాలు బలంగా ఉంటాయి. ప్రేమ వివాహానికి కుటుంబ సమ్మతి లభిస్తుంది. ముఖ్యమైన పనులను త్వరగా పూర్తి చేయండి. పెద్ద ఒప్పందం జరిగే అవకాశం ఉంది. వారం ప్రారంభంలో టూర్ వెళ్లే అవకాశం ఉంది. మీ బాధ్యతల నుంచి తప్పుకోకండి. చికిత్స కోసం డబ్బు ఖర్చవుతుంది. విలువైన వస్తువుల భద్రతను నిర్లక్ష్యం చేయవద్దు.
వృశ్చికం
ఈ వారం ఆర్థిక సమస్య కొంత తీరుతుంది. ప్రభుత్వ ఉద్యోగంలో మీ ప్రతిష్ట పెరుగుతుంది. కార్యాలయంలో మీ పనితీరుతో ప్రశంసలు అందుకుంటారు. కుటుంబ సమస్యలు దూరమవుతాయి. మీరు మీ ప్రణాళికలను బాగా అమలు చేస్తారు. కుటుంబ పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. వైవాహిక జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఈ వారం మీకు దాదాపు పూర్తిగా అనుకూలంగా ఉంటుంది. మీరు అధిక ప్రయాణాలకు దూరంగా ఉండాలి. పెట్టుబడి గురించి పూర్తి సమాచారాన్ని పొందండి. వివాదాలకు దూరంగా ఉండండి.
ధనుస్సు
వ్యాపారవేత్తలు పెద్ద ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కొత్త ప్రేమ సంబంధాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న యువతకు ఈ వారం శుభప్రదంగా ఉంటుంది. ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందవచ్చు. వృత్తిలో ఆశించిన పురోగతి ఉంటుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. ప్రైవేట్ ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. పాత రోగాలు తిరగబెట్టొచ్చు. పదునైన సాధనాలతో జాగ్రత్తగా ఉండండి. వారం ప్రారంభం ఆరోగ్యానికి మంచిది కాదు. సోమరితనం వీడండి. యోగా-ధ్యానం చేయండి. ఆర్థిక నష్టాన్ని ఎదుర్కోవచ్చు. ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి తొందరపడకండి.
మకరం
మీ లోపాలను అధిగమించడానికి ప్రయత్నించండి. ఆస్తి సంబంధిత విషయాలను పరిష్కారమవుతాయి. ఈ వారం వ్యాపార సంబంధాలకు చాలా ప్రాధాన్యత ఇస్తారు. సీనియర్లు మీకు మద్దతుగా ఉంటారు. మీ కృషికి ప్రశంసలు అందుకుంటారు. మీ జీవిత భాగస్వామితో కలిసి పూజలో పాల్గొంటారు. వారం ప్రారంభం చాలా బాగుంటుంది. పిల్లల వల్ల సంతోషంగా ఉంటారు. కెరీర్ సాధారణంగా సాగుతుంది. ఆర్థిక ఇబ్బంది ఎదుర్కొంటారు. వ్యాపారంలో నష్టం రావొచ్చు. వారం మధ్యలో మీరు గందరగోళానికి గురవుతారు. వివాదాలకు దూరంగా ఉండండి. నిరాశ చెందకండి. విద్యార్థులకు అంతగా కలిసొచ్చే సమయం కాదు.
కుంభం
మీరు కార్యాలయంలో గౌరవం పొందుతారు.వైవాహిక జీవితంలో ఆనందం ఉంటుంది. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి చాలా ప్రేరణ పొందుతారు. కుటుంబ కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్థిరాస్తి వివాదాలను చర్చల ద్వారా పరిష్కరించుకోవచ్చు. మీ సహోద్యోగులతో మంచిగా ఉండండి. మీ జీవనశైలిని క్రమబద్ధంగా ఉంచండి. వ్యాపారంలో ఆశించిన లాభం ఖచ్చితంగా అందుతుంది. వారం మొదటి అర్ధభాగం శుభప్రదంగా ఉంటుంది. అనారోగ్య సమస్యలుంటాయి . క్రమం తప్పకుండా వ్యాయామం చేయండి. స్నేహితులను కలుస్తారు.
మీనం
కొత్త ఆదాయ వనరులు ఏర్పడతాయి. పెద్ద వ్యాపార లాభాలు పొందొచ్చు. పిల్లలు పరీక్షలో మంచి ఫలితాలు సాధించగలరు. సోమవారం నుంచి బుధవారం వరకు చాలా శుభప్రదంగా ఉంటుంది. వారం చివర్లో అనారోగ్య ఇబ్బందులు రావొచ్చు. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. వారం ప్రారంభంలో, మీరు పిల్లల గురించి కొంచెం ఆందోళన చెందుతారు. లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో నివసిస్తున్న జంటల మధ్య గొడవలు జరగుతాయి. మీ కుటుంబ బాధ్యతలు నెరవేర్చడాన్ని సిగ్గుగా భావించకండి. ఈ వారం వాగ్దానాలు చేయడం మానుకోండి. కార్యాలయంలోని వ్యతిరేకులు మీపై ఫిర్యాదు చేస్తారు కానీ ఆ ప్రభావం మీపై ఉండదు.
Today Panchang 21st May 2022: తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, శనిబాధలు తొలగించే స్త్రోత్రం
Horoscope Today 21st May 2022: ఈ రాశి ఉద్యోగులు టెన్షన్లో ఉంటారు, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope Today 21st May 2022: ఈ రాశులవారికి ఇకపై భలే కలిసొస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Shukra Gochar 2022 : శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు
Shukra Gochar 2022 zodiac: మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం
Hyderabad Honour Killing Case: మార్వాడీ అబ్బాయి, యాదవ్ అమ్మాయి లవ్ మ్యారేజీ, అంతలోనే పరువు హత్యపై పోలీసులు ఏమన్నారంటే !
Weather Updates : తెలుగు రాష్ట్రాల్లో చల్లబడిన వాతావరణం, రాగల మూడు రోజుల్లో మోస్తరు వర్షాలు
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Gold Silver Price Today 21th May 2022 : బంగారం, వెండి ధరలు పైపైకి, ప్రధాన నగరాల్లో ఇవాళ్టి రేట్స్ ఇలా