Horoscope Today 11th April 2022: ఈ రాశివారి ప్రాముఖ్యత పెరుగుతుంది, ఈ రాశుల వారు ఆర్థికంగా ఓ మెట్టెక్కుతారు, మీ రాశిఫలితం తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఏప్రిల్ 11 సోమవారం రాశిఫలాలు
మేషం
మానసికంగా మరింత మెరుగవుతారు. మీరు సామాజిక కార్యకలాపాలతో అనుసంధానమై ఉంటారు. డబ్బు సంపాదించడానికి కొత్త వనరులు పొందుతారు. తోడబుట్టిన వారితో సంబంధాలు బాగానే ఉంటాయి కానీ కొన్ని క్లిష్టపరిస్థితులు బాధిస్తాయి. పరిస్థితుల ప్రభావం మీ పనిపై కూడా పడుతుంది. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థుల కు సాధారణంగా ఉంటుంది.
వృషభం
కార్యాలయంలో మీ అధికారం పెరుగుతుంది. వైవాహిక జీవితంలో పరస్పర సామరస్యం చాలా బాగుంటుంది. ఇంట్లో ఎవరికైనా వివాహం జరగాల్సి ఉంటే.. వారికి సంబంధించిన ఆందోళన తొలగిపోతుంది. నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. వ్యాపార పరిస్థితులు బాగుంటాయి.
మిథునం
ప్రత్యర్థులు చురుకుగా ఉంటారు. మీ సామర్థ్యం, పని తీరుతో ప్రశంసలు అందుకుంటారు. ఏ పనిని తేలికగా తీసుకోవద్దు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. జీవిత భాగస్వామితో వివాదం జరగొచ్చు. కుటుంబ వాతావరణంలో కొంత అశాంతి ఉంటుంది. పాత మిత్రులను కలుస్తారు. ఆఫీసులో బాధ్యత పెరుగుతుంది.
Also Read: రాముడు మానవుడా - దేవుడా, ఆ రెండక్షరాలు ఎందుకంత పవర్ ఫుల్
కర్కాటకం
ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉంటుంది. కొన్ని ముఖ్యమైన పనులకు ఖర్చు ఎక్కువ కావొచ్చు. ప్రేమికులు ఉత్సాహంగా ఉంటారు. చాలా ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడగలరు. వ్యాపారులు నిలిచిపోయిన సొమ్మును పొందుతారు. యువత తమ కెరీర్‌పై చాలా ఆశాజనకంగా ఉంటారు. ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
సింహం
కార్యాలయంలో మార్పులు జరగొచ్చు. తెలియని ఆటంకం వల్ల మీ పని దెబ్బతింటుంది. మీలో ఉన్న సున్నితత్వం వల్ల తొందరగా సహకారం అందుతుంది. అవగాహన ఉన్నవారి సలహాలు తప్పకుండా తీసుకోండి.మీ చుట్టూ జరుగుతున్న మార్పుల పట్ల ఆందోళన చెందుతారు. ఇతరులపై ఆధారపడొద్దు.
కన్యా
మీరు పెద్ద పనిలో విజయం సాధించగలరు. స్నేహితులు మీకు సహకరిస్తారు. రోజువారీ దినచర్య చాలా బాగుంటుంది. విద్యార్థులు తమ కెరీర్ పట్ల స్పృహతో ఉంటారు. ఇంటి నిర్వహణపై మీరు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. రోజంతా బిజీగా ఉంటారు. కళారంగంలో పని చేసే వారికి కొత్త అవకాశాలు లభిస్తాయి.
Also Read: శ్రీరామ పట్టాభిషేకం ఫొటో ఇంట్లో ఉండొచ్చా-ఉండకూడదా
తులా
ఉద్యోగంలో విశేష గౌరవం పొందుతారు. భాగస్వామ్యంతో చేసిన పని నుంచి మంచి ప్రయోజనం పొందుతారు. రుణం చెల్లించేందుకు ఇదే సరైన సమయం. అధికారులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తారు. ఇంటికి అతిథులు రావచ్చు. స్నేహితులతో వాగ్వాదం ఉండొచ్చు.
వృశ్చికం
రోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. పెద్ద సమస్య నుంచి బయటపడతారు. సృజనాత్మక పనులను సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగంలో బదిలీ అయ్యే అవకాశం ఉంది. మీరు పిల్లలతో మీ సమయాన్ని గడుపుతారు. రాజకీయ వ్యక్తులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. విద్యార్థులు కష్టపడి మంచి ఫలితాలు పొందుతారు. భాగస్వామితో ప్రేమికులకు సాన్నిహిత్యం పెరుగుతుంది.
ధనుస్సు
కుటుంబ బాధ్యతలు సక్రమంగా నిర్వర్తిస్తారు. ప్రతికూలతకు దూరంగా ఉండండి. ఇతరుల విషయాల్లో అస్సలు జోక్యం చేసుకోకండి. మీరు పిల్లల విషయంలో కొంచెం ఆందోళన చెందుతారు. పొట్టకి సంబంధించిన ఇబ్బందులతో బాధపడతారు. ఉద్యోగులు, వ్యాపారులకు సాధారణ ఫలితాలుంటాయి.
Also Read: ఖురాన్ ఆవిర్భవించిన నెల ఇదే, మనసు-శరీరంలో మలినాల ప్రక్షాళణకే రంజాన్ ఉపవాస దీక్షలు
మకరం
ఈ రోజు మీకు చాలా మంచి రోజు. పనికిరాని పనులకు సమయాన్ని వృథా చేయకండి. షేర్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టడం ద్వారా డబ్బు సంపాదించవచ్చు. మీ శత్రువులపై విజయం సాధిస్తారు. ఇంట్లో కొన్ని శుభ కార్యక్రమాలు జరిగేఅవకాశం ఉంది. ఉన్నత విద్యలో అద్భుతమైన ఫలితాలు పొందుతారు. అదృష్టం మద్దతు ఇస్తుంది. వ్యాపారంలో పెద్ద ఒప్పందాలు జరగుతాయి.
కుంభం
ఈ రోజు మీరు నష్టపోవచ్చు. ఎప్పటి నుంచో సమాధానం దొరకని ప్రశ్నకు సమాధానం దొరుకుతుంది. కాలానికి అనుగుణంగా మీ స్వభావంలో మార్పులు తెచ్చుకోండి. అవివాహితులకు సంబంధం కుదురుతుంది. మీ దినచర్య చాలా సమతుల్యంగా ఉంటుంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి.
మీనం
ప్రభుత్వ పనులను పూర్తి చేయగలుగుతారు. ఎవరితోనైనా వాగ్వాదం పెట్టుకునే అవకాశం ఉంది. ప్రయాణం వాయిదా వేయండి. మీ శత్రువుల పట్ల జాగ్రత్త వహించండి. మీరు ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యాన్ని వీడండి. ఇతరులు చెప్పేదానిపై ఎక్కువ శ్రద్ధ పెట్టవద్దు. ఉద్యోగంలో సహోద్యోగులతో సమస్యలు రావొచ్చు. ప్రమోషన్ కి సంబంధించిన సమాచారం పొందే అవకాశం ఉంది.