Horoscope Today 21st March 2022: ఈ రాశులవారికి ఈ రోజంతా శుభసమయమే, మీరాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

మార్చి 21 రాశిఫలితాలు
మేషం
ఈ రాశివారికి ఈ రోజంతా శుభసమయమే. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. స్నేహితులతో ఎక్కువగా కాలక్షేపం చేస్తారు. అనుకున్న పనులన్నీ పూర్తిచేస్తారు. వ్యాపారులకు సాధారణంగా ఉంటుంది. ఉద్యోగులు ఒత్తిడి ఎదుర్కొంటారు. అనారోగ్య సూచనలున్నాయి జాగ్రత్త.
వృషభం
కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. సేవాకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆస్తి వివాదాల పరిష్కారమవుతాయి. వ్యాపారులకు కలిసొస్తుంది. ఉద్యోగాల్లో పురోగతి సాధిస్తారు. రాజకీయంగా పలుకుబడి పెరుగుతుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది.
మిథునం
తలపెట్టిన పనులు వాయిదా వేయొచ్చు. ఖర్చులు బాగా పెరుగుతాయి నియంత్రించేందుకు ప్రయత్నించండి. ఆకస్మిక ప్రయాణాలుండొచ్చు. ఇంటాబయటా చికాకులు పెరుగుతాయి. ఆధ్యాత్మిక వైపు ఆసక్తి పెరుగుతుంది. వ్యాపారాల్లో ఒడిదుడుకులు ఉంటాయి. ఉద్యోగులకు గందరగోళంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ అసరం.
కర్కాటకం
ఆకస్మికంగా డబ్బు చేతికి అందుతుంది. అనుకున్న పనులు అనుకున్నట్టుగా నెరవేరుతాయి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండాలి. విద్యార్థులు కాస్త కష్టపడితే ఎక్కువ ఫలితం వస్తుంది. వ్యాపారులకు చికాకులుంటాయి
సింహం
వ్యాపారులకు, ఉద్యోగులకు ఒత్తడి పెరుగుతుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆరోగ్యం పర్వాలేదు. నూతన పరిచయాలు ఏర్పడతాయి. ఆస్తివివాదాలు పరిష్కారమవుతాయి. శుభకార్యాల్లో పాల్గొంటారు.
కన్య
నూతన పరిచయాలు పెరుగుతాయి. రాజకీయ నాయకులకు అనుకూలంగా ఉంటుంది. ఓ శుభవార్త వింటారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు అనుకూల సమయం. ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి.
తుల
కుటుంబంలో శుభకార్యాలు జరుగుతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారులు పురోగతి సాధిస్తారు. ఉద్యోగులకు అనుకూలంగా ఉంటుంది. వాహనయోగం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. ఆదాయం పెరుగుతుంది. ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి
వృశ్చికం
ఆర్థిక ఇబ్బందులు ఉండొచ్చు. దూరప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. కుటుంబంలో చికాకులు ఉంటాయి. ఆలోచనలు స్థిరంగా ఉండవు. పనులు వాయిదా వేస్తారు. వ్యాపారాలలో కొత్త సమస్యలు ఎదురవుతాయి. రియల్ ఎస్టేట్ వారికి చాలా బాగుంటుంది.మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఎవ్వరికీ హామీలు ఇవ్వకండి.
ధనస్సు
ఉద్యోగంలో ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. శుభవార్త వింటారు. నిరుద్యోగులకు కలిసొచ్చే సమయం. వస్త్రలాభం,కార్యసిద్ధి ఉంటుంది.
మకరం
కొత్త కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆర్థికాభివృద్ధి. బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఉద్యోగులకు నూతనోత్సాహం ఉంటుంది. ఆధ్యాత్మికతవైపు ఆసక్తి చూపుతారు.
కుంభం
ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం. నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది. ఆదాయం బాగానే ఉంటుంది. వ్యాపారులకు లాభాలొచ్చే అవకాశం ఉంది. విద్యార్థులు మరింత కష్టపడాలి.
మీనం
అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వ్యాపారాలలో అంచనాలు తప్పుతాయి.





















