By: ABP Desam | Updated at : 16 Mar 2022 06:01 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 మార్చి 16 బుధవారం రాశిఫలాలు
మార్చి 16 బుధవారం రాశిఫలాలు
మేషం
తలపెట్టన పనుల విషయంలో కొన్ని సందేహాలుంటాయి. కుటుంబ పనుల్లో చిక్కుకుపోతారు. శుభ కార్యాల కోసం ధనం వచ్చిస్తారు. మీ నిర్ణయాన్ని తరచుగా మార్చుకోకండి. సంతానం విజయం సాధిస్తుంది.
వృషభం
ఏదో ఒక విషయంలో వాగ్వాదం ఉండొచ్చు. మీ ఆలోచనలను ఉన్నతంగా ఉంచండి. ప్రణాళికాబద్ధంగా పని చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది. తల్లిదండ్రుల మధ్య వివాదాల విషయంలో జాగ్రత్తగా ఉండండి.
మిథునం
విద్యారంగంలో పోటీ వాతావరణం ఉంటుంది. ప్రయాణాలు కలిసొస్తాయి. వినోదం కోసం డబ్బు ఖర్చు చేస్తారు. కొత్త ఉద్యోగం పొందే అవకాశాలు ఉన్నాయి. సంప్రదాయవాద అభిప్రాయాలను మార్చుకోండి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
Also Read: శివుడు ఖండించిన వినాయకుడి తల ఇప్పటికీ అక్కడుంది
కర్కాటకం
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మాట్లాడేటప్పుడు పరుష పదజాలాన్ని ఉపయోగించవద్దు. పిల్లల ఆరోగ్యం గురించి ఆందోళన ఉండవచ్చు. కుటుంబం కోసం సమయాన్ని వెచ్చించండి.
సింహం
మంచి వ్యక్తులు పరిచయమవుతారు. మీ పనితీరు మారుతుంది. మీరు కుటుంబానికి సంబంధించి కొన్ని ప్రణాళికలు వేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు శుభసమయం.
కన్య
పనికిరాని పనులకు దూరంగా ఉండండి. ఉదర సంబంధిత రుగ్మతలతో బాధపడతారు. చెడు సాంగత్యం వల్ల మీరు బాధపడతారు. సహోద్యోగులతో వివాదాలు వద్దు.
తుల
కొన్ని విచారకరమైన వార్తలు విన్న తర్వాత మీరు భావోద్వేగానికి లోనవుతారు. మీ సమర్థత పెరుగుతుంది. వ్యాపార పరిస్థితులు మెరుగుపడతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు.
వృశ్చికం
మీరు చాలా చురుకుగా ఉంటారు. కుటుంబంలో ఏదైనా ముఖ్యమైన విషయంపై చర్చిస్తారు. ప్రభుత్వ ఉద్యోగాలు చేసే వారికి ఈ రోజు చాలా మంచిది. మీ మనసులో కొత్త సృజనాత్మక ఆలోచనలు పుడతాయి. తెలియని అడ్డంకి ద్వారా ప్రభావితమవుతుంది.
Also Read:శనివారం సాయంత్రం ఈ చెట్టుకింద దీపం వెలిగిస్తే జాతకంలో దోషాలు తొలగిపోతాయి
ధనుస్సు
మీరు శారీరక బలహీనతతో బాధపడతారు. ఉద్యోగంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. మీరు కుటుంబ సభ్యులపై కోపం ప్రదర్శించకండి. ప్రేమ సంబంధాల్లో పరస్పర విశ్వాసం లోపిస్తుంది. విహారయాత్రకు వెళ్తారు
మకరం
ఈ రోజంతా అసంతృప్తిగా ఉంటుంది. కార్యాలయంలో ఆటంకాలు ఉంటాయి. నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందడం కష్టమవుతుంది. మీ తప్పులను అంగీకరించండి. ఒత్తిడికి లోనవుతారు.
కుంభం
ఈరోజు మంచి రోజు అవుతుంది. మీరు భాగస్వామ్యంతో చేసిన వ్యాపారం నుంచి ప్రయోజనం పొందుతారు. మీ ఆత్మవిశ్వాసం పెరగవచ్చు. ఉద్యోగంలో మీ ప్రభావం పెరుగుతుంది. మీరు అనుభవజ్ఞులైన వ్యక్తుల నుంచి మార్గదర్శకత్వం పొందుతారు.
మీనం
ఎవరినీ వ్యతిరేకించొద్దు. వృత్తికి సంబంధించిన పనులు పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కార్యాలయంలో అసంపూర్తిగా ఉన్న పనులను పూర్తి చేయాలనే ఒత్తిడి పెరుగుతుంది. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. అర్ధంలేని చర్చలో సమయం వృధా చేసుకుంటారు.
Horoscope Today Dec 10, 2023: ఈ రాశులవారు అనుమానించే అలవాటు వల్ల నష్టపోతారు, డిసెంబరు 10 రాశిఫలాలు
Chirstmas 2023: క్రిస్మస్ సందర్భంగా మీరు చేసే దానం ఇలా ఉండాలి!
Karthika Masam End date Deepadaanam 2023: కార్తీక మాసం ఆఖరి సోమవారం లేదా చివరి రోజు దీపదానం చేస్తే!
Astrology: ఈ రాశులవారికి చలికాలం అంటే చాలా ఇష్టం!
Daily Horoscope Today Dec 9, 2023: ఈ రాశివారు ముఖ్యమైన విషయాలు వాయిదా వేసుకోవడం మంచిది, డిసెంబరు 09 రాశిఫలాలు
Bhatti Vikramarka: లక్షల కోట్ల అప్పుల్లో తెలంగాణ, ఛాలెంజ్ గా ఆర్థికశాఖ తీసుకున్నాను: భట్టి విక్రమార్క
Look Back 2023: భారీ సక్సెస్ కొట్టిన చిన్న సినిమాలు - ఈ ఏడాది టాలీవుడ్‌లో క్రేజీ సిక్సర్!
2024 TVS Apache RTR 160 4V: సూపర్ డిజైన్, అదిరిపోయే లుక్‌తో వచ్చిన కొత్త అపాచీ - ధర ఎంతో తెలుసా?
Mahalaxmi Scheme: రాష్ట్రంలో ఉచిత బస్సు ప్రయాణం - ప్రభుత్వ నిర్ణయంపై మహిళల హర్షం
/body>