By: ABP Desam | Updated at : 23 Feb 2022 06:14 AM (IST)
Edited By: RamaLakshmibai
2022 ఫిబ్రవరి 23 బుధవారం రాశిఫలాలు
ఫిబ్రవరి 23 బుధవారం రాశిఫలాలు
మేషం
ఈరోజు మంచి రోజు అవుతుంది. పరిస్థితులు మీకు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఉద్యోగంలో పురోగతికి అవకాశం ఉంది. మీరు కార్యాలయంలో సహోద్యోగుల మద్దతు పొందుతారు. దంపతుల మధ్య సఖ్యత ఉంటుంది. శుభ కార్యాలలో పాల్గొంటారు. వినోద సాధనాల కోసం ఎక్కువ ఖర్చు చేస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
వృషభం
వ్యాపారంలో చాలా లాభాలు ఉంటాయి. మిత్రుల నుంచి శుభవార్తలు వింటారు. ఉన్నతాధికారుల మద్దతు లభిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. శుభకార్యాల్లో పాల్గొంటారు. దంపతులు సంతోషంగా ఉంటారు. కొత్త ఇంటిని కొనుగోలు చేసేందుకు ఒప్పందం చేసుకోవచ్చు. ఖర్చులను నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి.
మిథునం
ఈరోజు సాధారణ రోజు అవుతుంది. పెట్టుబడి పెట్టడానికి మంచిది కాదు. డబ్బు సంపాదించే అవకాశం ఉంది. ఏ పనీ చేయకపోవడం వల్ల చికాకులు ఉంటాయి. మీరు కష్టాలను ఎదుర్కోవచ్చు. తోటపనిపై ఆసక్తి ఉంటుంది. ప్రయాణాల వల్ల ప్రయోజనం ఉంటుంది. గృహ సమస్యల పరిష్కారానికి ఖర్చు చేస్తారు.
కర్కాటకం
కొత్త ఆదాయ అవకాశాలు లభిస్తాయి. వ్యాపారంలో నష్టాల కారణంగా ఒత్తిడి పెరుగుతుంది.శత్రువు వైపు ఆధిపత్యం ఉండొచ్చు. ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. అనవసర ఖర్చులను అరికట్టడంలో విజయం సాధిస్తారు. వివాహ కార్యక్రమాల్లో పాల్గొంటారు. జీవిత భాగస్వామితో ప్రేమ పెరుగుతుంది.
Also Read: ఈ రాశివారు కూల్, వీరితో ఉన్నవారూ కూల్ , మీరున్నారా ఇందులో
సింహం
ఆర్థిక పరిస్థితి మారుతుంది. ఏదైనా పెద్ద సమస్య నుంచి ఉపశమనం పొందే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో చేతికందాల్సిన మొత్తం తిరిగి పొందుతారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. మిత్రులను కలుస్తారు. కుటుంబ సహకారం లభిస్తుంది. వ్యాపార ప్రయాణాలు లాభిస్తాయి. మాటల విషయంలో సంయమనం పాటించాలి. ప్రయాణం వాయిదా వేయడానికి ప్రయత్నించండి.
కన్య
చేతికి అందాల్సిన మొత్తం అందుతుంది. ప్రత్యర్థుల కార్యకలాపాలు పెరుగుతాయి. ఆదాయం పెరిగే అవకాశం ఉంది.కొత్త మెళకువలు నేర్చుకోవచ్చు. వాహనం అందుబాటులో ఉంటుంది. మీరు సామాజిక రంగంలో ప్రశంసలు పొందుతారు. మీరు వ్యాపార పనుల్లో బిజీగా ఉంటారు. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
తుల
ప్రమోషన్‌కు అవకాశాలు లభించవచ్చు. మీరు ఆర్థిక కార్యక్రమాలను కూడా నిర్వహించవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఆఫీస్ పనుల్లో బిజీగా ఉంటారు. సానుకూలత ఉంటుంది. చేసిన పని పూర్తి కావడంతో మనసు ఆనందంగా ఉంటుంది. సోమరితనం వీడండి. సామాజిక జీవితంలో చురుకుగా ఉంటారు. పనికిరాని వాటిపై ఖర్చు చేయవద్దు.
వృశ్చికం
ఆదాయం పెరుగుతుంది. విద్యార్థులకు చదువులో ఆటంకాలు ఎదురవుతాయి. పిల్లలు సంతోషాన్ని పొందుతారు. కార్యాలయంలో అధికారుల సహాయం అందుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. స్నేహితుడితో విభేదాలు రావొచ్చు. మత్తు పదార్థాలకు దూరంగా ఉండండి. కోర్టు కేసుల్లో ఇరుక్కోవచ్చు. బాధ్యతను నిర్వర్తించలేరు.
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
ధనుస్సు
ఎక్కువ బాధ్యతలు స్వీకరించడం వల్ల చిరాకు వస్తుంది. ఎవరైనా మీకు వ్యతిరేకంగా కుట్ర చేయవచ్చు. అననసర ప్రసంగాలు వద్దు. ఈరోజు లావాదేవీలకు సంబంధించిన పనులు చేయవద్దు. ప్రయాణం చేయవచ్చు. వ్యాపారంలో సమస్యలు ఉండొచ్చు.
మకరం
కుటుంబం లేదా డబ్బు సంబంధిత విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. దంపతుల మధ్య మనస్పర్థలు తలెత్తే అవకాశం ఉంది. వ్యాపారానికి సంబంధించి విహారయాత్రకు వెళ్తారు. ఖర్చులు అధికమవుతాయి.అప్పు ఇవ్వడం మానుకోండి. కోపాన్ని నియంత్రించుకోవడానికి ప్రయత్నించండి. అకస్మాత్తుగా బంధువులతో సమావేశం కావచ్చు.
కుంభం
ఈరోజు అద్భుతంగా ఉంటుంది. మీరు మానసికంగా సంతోషంగా ఉంటారు. ప్రతి పనిని సకాలంలో పూర్తి చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. మీ స్నేహితులతో కలిసి షికారు వెళ్తారు. మీ సంభాషణ ద్వారా ప్రజలు ఆకట్టుకుంటారు. మీరు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు.
మీనం
ఈరోజు కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో వాగ్వాదం జరగొచ్చు. మీరు నిరుత్సాహపరిచే వాతావరణాన్ని ఎదుర్కోవచ్చు. ఆర్థిక పరిస్థితి చక్కగా ఉంటుంది. పనికిరాని పనులకు సమయాన్ని వెచ్చించకండి. మీ శ్రేయస్సు పెరుగుతుంది. అధిక శ్రమ వల్ల అలసట ఉంటుంది. విద్యార్థులు పరీక్షలలో విజయం సాధిస్తారు. వృత్తిలో పురోగతి ఉంటుంది.
Shukra Gochar 2022 : శుక్రగ్రహ సంచారం వల్ల ఈ మూడు రాశులవారు ఓ సమస్య నుంచి బయటపడితే మరో సమస్యలో ఇరుక్కుంటారు
Shukra Gochar 2022 zodiac: మే 23న రాశి మారుతున్న శుక్రుడు, ఈ రాశులవారి జీవితం ప్రేమమయం
Subramanian Swamy: నిత్యం కలలో పాములు కనిపిస్తున్నాయా, అయితే ఈ ఆలయానికి వెళ్లండి
Astrology: సెప్టెంబరులో పుట్టారా, ఎన్నికష్టాలు పడినా తగ్గేదేలే అనే టైప్ మీరు
Horoscope Today 20th May 2022: ఈ రాశివారికి పెద్ద సమస్య పరిష్కారం అవుతుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
RR Vs CSK Highlights: రెండో స్థానానికి రాయల్స్ - చెన్నైపై ఐదు వికెట్ల తేడాతో విజయం!
Disha Accused Encounter Case: దిశ నిందితుల ఎన్కౌంటర్ కేసులో పోలీసులు చెప్పింది నిజం కాకపోతే, అసలు జరిగింది ఏంటి ?
Nikhat Zareen Parents: దెబ్బలు తగిలితే పెళ్లి అవడం కష్టం, బాక్సింగ్ వద్దమ్మా అని చెప్పేదాన్ని : నిఖత్ జరీన్ తల్లి
Honour Killing: హైదరాబాద్‌లో మరో పరువు హత్య - యువకుడిపై కత్తులతో విచక్షణారహితంగా దాడి చేసి దారుణం