By: ABP Desam | Updated at : 22 Feb 2022 05:46 PM (IST)
Edited By: RamaLakshmibai
Zodiac Signs
తన కోపమే తన శత్రువు తన శాంతమె తనకు రక్ష అంటారు. అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం అంటే చెప్పినంత తేలికేం కాదు. ఆ క్షణం ఏం జరిగినా విచక్షణతో ఆలోచించి ఆగ్రహాన్ని అణుచుకోవాల్సి ఉంటుంది. అలా ఉన్నప్పుడే సమస్య పెద్దది కాకుండా, వాతావరణంలో ప్రశాంతత చెడిపోకుండా ఉంటుంది. ఆ ఒక్క క్షణం కంట్రోల్ అయితే చాలు... ఆ తర్వాత మొత్తం నార్మల్ అయిపోతుంది. అయితే అందరికీ అది సాధ్యం కాకపోయినా కొన్ని రాశుల వారు మాత్రం మ్యాగ్జిమం కూల్ గా ఉండేందుకు ప్రయత్నించడమే కాదు...తన చుట్టుపక్కల ఉన్నవారిని కూడా కూల్ గా ఉంచేందుకు విశ్వప్రయత్నాలు చేస్తారట.
మిథునం
ఈ రాశి వారు సాధారణంగా ప్రశాంతంగా ఉంటారు. ఎదుటివారు ఎంత కోపంగా ఉన్నప్పటికీ కూల్ చేయగల సామర్థ్యం వీరి సొంతం. ఈ రాశివారి మాటలు అంత ప్రభావం చూపిస్తాయట. ముఖ్యంగా మిథున రాశి వారు తమ ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. అయితే ఈ కూల్ ప్రవర్తన కారణంగా కొన్నిసార్లు కుటుంబంలో, కార్యాలయంలోనూ సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఎంత తగ్గిఉందామనుకున్నా పరిస్థితులు పీక్స్ కి వెళ్లినప్పుడు మాత్రం అగ్నిగోళంలా మండుతారట.
Also Read: ఈ రాశులవారు మహా తెలివైనోళ్లు.. వ్యూహాలు రచిస్తే తిరుగులేదు...
కర్కాటకం
ఈ రాశి వారి అధిపతి చంద్రుడు కావడంతో వీళ్లు కూడా వెన్నెలలా ప్రశాంతంగా ఉంటారని చెబుతారు జ్యోతిష్య పండితులు. వీరికి కూడా కోపం రాదని చెప్పలేం కానీ చాలా తక్కువ సార్లు కోప్పడతారట. ఎంత కోపం ఉన్నప్పటికీ ఎదుటివారిపై వీరు చూపించే ప్రత్యేక శ్రద్ధకు అంతా ఫిదా అయిపోతారు. అందుకే కర్కాటక రాశివారితో స్నేహాన్ని వదులుకోవాలని ఎవ్వరూ అనుకోరు.
కన్య
కన్య రాశివారు చాలా తెలివిగలవారు..వీళ్ల ప్రవర్తన, మాట్లాడే విధానం చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వీళ్లని చూసిన వాళ్లంతా ఇలా ఉంటే బావుంటుంది అనుకునేంతగా ఉంటారట. కోపంలో ఉన్నా, నార్మల్ గా ఉన్నా తమ సహజ స్వభావానికి విరుద్ధంగా అస్సలు ప్రవర్తించరు. వీళ్లకి కూడా కోపం రాదు అని కాదు కానీ ఎండుగడ్డి మంటలా కోపం వచ్చి భగ్గున మండి వెంటనే కూల్ అయిపోయి...ఎదుటి వారిని కూడా నార్మల్ చేసేస్తారట.
కుంభం
కుంభ రాశివారది నిండు కుండలాంటి వ్యక్తిత్వం. వీరి సంకల్పం గట్టిది. తమ సొంత నిర్ణయాల ఆధారంగా జీవితాన్ని గడపాలని అనుకుంటారు. ఎంత అపార్థాలున్నప్పటికీ వీళ్ల ప్రవర్తన కారణంగా అవి తొలగిపోతాయి. తమ జీవితాన్ని ఓ దారిలో పెట్టుకోవడమే కాదు తమతో ఉన్నవారికి కూడా సహాయ పడే మనస్తత్వం వీరిది. వీళ్లు కోప్పడినా అది కేవలం ఎదుటి వారి మంచిదే అని గుర్తించాలంటారు జ్యోతిష్యులు. ఊరికే ఊరికే కోప్పడని వ్యక్తుల్లో కుంభరాశివారు కూడా ఉంటారు.
Also Read: ఈ రాశుల వారిని ప్రేమిస్తే నెత్తిన గుడ్డేసుకుని కూర్చోవడమే..
మీనం
మీన రాశి వారిది చాలా ప్రశాంత స్వభావం. వీళ్లను చూసి ముందు బ్యాడ్ పర్సన్స్ అనిపించినా క్లోజ్ గా ఉండి అబ్జర్వ్ చేస్తే అద్భుతం అనిపిస్తారట. మీన రాశివారు కూడా తమ మనస్సాక్షికి వ్యతిరేకంగా అస్సలు ప్రవర్తించరు..కొన్ని సందర్భాల్లో తాము బాధపడినా ఎదుటివారిపై మాత్రం కోపాన్ని ప్రదర్శించకుండా ఉంటారట. ఒక్కమాటలో చెప్పాలంటే సహనంతో సమస్యలు పరిష్కారం అవుతాయన్నది వీరి విశ్వాసం.
Horoscope Today, 14 August 2022: ఈ రాశులవారు స్టేటస్ కోసం ఖర్చుచేయడం మానుకోవాలి, ఆగస్టు 14 రాశిఫలాలు
Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు
Mangal Gochar 2022: రాశిమారిన అంగారకుడు, ఈ రాశులవారికి ఆరోగ్యం, ఆదాయం, ఆనందం
Mars Transit 2022: వృషభ రాశిలో కుజుడి సంచారం, ఈ 5 రాశులవారికి అన్నీ సవాళ్లే!
Tirumala: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ - నిన్న ఒక్కరోజులో శ్రీవారి హుండీకి ఆదాయం ఎంతంటే !
Kia Seltos: కొత్త మైలురాయి అందుకున్న కియా సెల్టోస్ - ఏకంగా 60 శాతానికి పైగా!
Minister Srinivas Goud : నా ఎదుగుదల ఓర్చుకోలేకే కుట్రలు, అది బుల్లెట్లు లేని బ్లాంక్ గన్ - మంత్రి శ్రీనివాస్ గౌడ్
ఇక ఆన్లైన్లో ఉన్నా కనిపించదు - మూడు సూపర్ ఫీచర్లు తీసుకొస్తున్న వాట్సాప్!
చైనా ఫోన్లపై ప్రభుత్వం బ్యాన్? - వినియోగదారుడికి లాభమా? నష్టమా?