News
News
X

Horoscope Today 21th February 2022: ఈ రాశి నిరుద్యోగులు శుభవార్త వింటారు, ఈ రోజు మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.

FOLLOW US: 

2022 ఫిబ్రవరి 21 సోమవారం రాశిఫలాలు
మేషం
దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తికాగలవు. మీ పిల్లలకు సంతోషాన్నివ్వండి. ఇతరుల సలహాలు తీసుకుని వ్యాపారంలో పని చేయకండి. కోర్టు వ్యవహారాల్లో మీకు అనుకూలంగా నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఈ రోజంతా ఆనందంగా ఉంటారు. 

వృషభం
అనుభవం ఉన్న వ్యక్తుల సలహాల వల్ల మీరు ప్రయోజనం పొందుతారు. కొత్తగా తలపెట్టిన పని మీకు లాభదాయకంగా ఉంటుంది. ఇంటి పెద్దల పట్ల శ్రద్ధ వహించాలి. మాటల మీద కోపం తెచ్చుకోకండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలుంటాయి.మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితిలో మార్పు ఉంటుంది.
 
మిథునం
ఈ రోజంతా బిజీగా ఉంటారు. ఒకేసారి ఎక్కువ పనులు చేయొద్దు, ఏపనీ చేయకుండా ఖాళీగా ఉన్నామని చింతింతొద్దు.  కుటుంబ సభ్యులతో అనుబంధం దృఢంగా ఉంటుంది. శత్రువుల వల్ల నష్టం జరగవచ్చు. ఫాంటసీ ప్రపంచం నుంచి బయటపడండి, వాస్తవికతను అర్థం చేసుకోండి.

కర్కాటకం
మీ స్వభావం మెరుగుపరచుకునేందుకు ప్రయత్నించండి. ఉద్యోగుల బాధ్యతలు పెరుగుతాయి. అధిక వ్యయం గురించి ఆందోళన చెందుతారు. వ్యాపార పనులపై ప్రయాణం చేయాల్సి ఉంటుంది.  వ్యాపారంలో కొత్త ఒప్పందాలతో ఆదాయం పెరుగుతుంది.
 
Also Read: శివుడు పులిచర్మంపైనే ఎందుకు కూర్చుంటాడు, మెడలో పాము ఎందుకుంటుంది
సింహం
ఈ రోజు మీకు ఆహ్లాదకరంగా ఉంటుంది. స్నేహితులతో కలిసి ప్రయాణాలకు ప్రణాళిక వేస్తారు. ప్రజలు మీ ప్రవర్తనను చాలా ఇష్టపడతారు. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఏ పనిని పూర్తి చేయడంలో అలసత్వం వహించవద్దు. మీ తోబుట్టువులతో సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఉద్యోగులకు జీతం పెరిగే అవకాశం ఉంది. 
 
కన్య 
ఈ రోజు మిశ్రమ ఫలితాలుంటాయి. ఎవరితోనైనా వివాదాల కారణంగా సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. మీరు చట్టపరమైన విషయాల్లో చిక్కుకునే ప్రమాదం ఉంది జాగ్రత్త. విద్యార్థులకు ఈరోజు సాధారణంగా ఉంటుంది, చదువుపై మరింత శ్రద్ధ పెట్టాలి. అనారోగ్య సమస్యలు ఉండొచ్చు. 

తుల
ఈ రోజంతా మీకు మంచిరోజు. కొత్త ఉద్యోగంలో బెటర్ ఆఫర్ అందుకుంటారు. నిరుపేదలకు ఆర్థిక సహాయం చేస్తారు. జీవిత భాగస్వామితో కలిసి షికారు వెళ్తారు. పిల్లల చదువు విషయంలో పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. మీ దినచర్యలో మార్పు ఉంటుంది. యోగా వ్యాయామం వల్ల చురుకుదనం పెరుగుతుంది.
 
వృశ్చికం
కష్టపడి పనిచేసినా సరైన ఫలితాలు రాకపోవడంతో నిరాశ మిగులుతుంది. రిస్క్ తీసుకోవడం మానుకోవాలి. విలువైన వస్తువుల భద్రతకు తగిన ఏర్పాట్లు చేయండి. కుటుంబ సభ్యులు మీ మాట వినరు. ఈ రోజు ఏకాంతంగా గడపడానికి ప్రయత్నిస్తే మంచిది.
 
Also Read: ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే
ధనుస్సు 
వైవాహిక జీవితంలో ప్రేమ అలాగే ఉంటుంది. జీవిత భాగస్వామికి మద్దతు లభిస్తుంది. కొత్త పని ప్రారంభించడానికి ఈ రోజు మంచి రోజు. కళారంగంతో అనుబంధం ఉన్నవారికి కొత్త అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ గురించి సమాచారం వచ్చే అవకాశం ఉంది. మీరు స్నేహితుల మద్దతు పొందుతారు.
 
మకరం
వివాహేతర సంబంధం కుటుంబ సంబంధాల్లో దుమారం రేపుతుంది. మీ మాటలపై ఇతరులకు విశ్వాసం తగ్గుతుంది. మంచి పని చేసినా ప్రజలను సంతృప్తి పరచలేరు. మీరు కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఆటో లేదా ఎలక్ట్రానిక్స్ వ్యాపారులకు ఈ రోజు మంచి రోజు.
 
కుంభం
వ్యాపారంలో మందగమనం ఉండొచ్చు. ఈరోజు ఎవరితోనైనా గొడవలు జరిగే అవకాశం ఉంది. మీరు విమర్శలు ఎదుర్కొంటారు. మీరు ఎలాంటి బాధల నుంచైనా ఉపశమనం పొందుతారు. ప్రత్యర్థులకు దూరంగా ఉండండి. ఎవరితోనూ కఠినంగా మాట్లాడొద్దు. పిల్లలతో మర్యాదగా ప్రవర్తించండి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 

మీనం
ఈరోజు కొంతమంది కారణంగా మిమ్మల్ని ఇబ్బందిపడతారు. ఎవ్వరి కారణంగా మోసపోవద్దు. ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంది. వాహనాన్ని జాగ్రత్తగా నడపండి. సున్నితత్వం మంచిది కాదు. మీరు కోరుకున్న పని జరగదు. తప్పు విషయాలను దాటవేయండి.

Published at : 21 Feb 2022 06:20 AM (IST) Tags: Horoscope Today Taurus Gemini Virgo Aries Cancer Leo Libra Scorpio Sagittarius Capricorn Aquarius Pisces Horoscope Today 2022 Horoscope Today 21th February 2022

సంబంధిత కథనాలు

Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!

Krishna Janmashtami 2022: శ్రీ కృష్ణుడు చిన్నప్పుడు ఎలా ఉన్నాడో చూడాలనుకుంది రుక్మిణి, ఏం చేసిందో తెలుసా!

Tirumala Updates: టీటీడీ కీలక నిర్ణయం - చతుర్దశ కలశ విశేష పూజ రద్దు

Tirumala Updates: టీటీడీ కీలక నిర్ణయం - చతుర్దశ కలశ విశేష పూజ రద్దు

Weekly Horoscope Telugu: మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఈ వారం జరగబోతోంది, ఆగస్టు 15 నుంచి 21 వరకు రాశిఫలాలు

Weekly Horoscope Telugu: మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఈ వారం జరగబోతోంది, ఆగస్టు 15 నుంచి 21 వరకు రాశిఫలాలు

Horoscope Today 15 August 2022: స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Horoscope Today  15 August 2022:  స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

టాప్ స్టోరీస్

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం

Bandi Sanjay: బండి సంజయ్ పాదయాత్రలో ఉద్రిక్తత, పరస్ఫరం రాళ్లదాడులు - పోలీసులపై బండి ఆగ్రహం

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Independence Day 2022: ఎమోషనల్ వీడియో షేర్ చేసిన ఆనంద్ మహీంద్రా, వసుధైక కుటుంబకం అంటూ ట్వీట్

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

Karthikeya 2 Collections : రెండవ రోజు పెరిగిన 'కార్తికేయ 2' కలెక్షన్లు - మూడో రోజు లాభాల్లోకి?

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం

TTD: 50 మందితో మంత్రిగారి శ్రీవారి దర్శనం, అంతకుముందు ఏకంగా 140 మంది - భక్తుల ఆగ్రహం