Horoscope Today 20th February 2022: ఈ రాశివారు కష్టానికి తగిన ఫలితం పొందుతారు, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఫిబ్రవరి 20 ఆదివారం రాశిఫలాలు
మేషం
ఈ రోజంతా బాగానే ఉంటుంది. కార్యాలయంలో అనుకూల వాతావరణం ఉంటుంది, చేసే పనిలో సక్సెస్ అవుతారు. వ్యాపారం బాగా సాగుతుంది. కుటుంబ బాధ్యత పెరుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనవసర ఖర్చులు అధికమయ్యే అవకాశం ఉంది. మనసులో ప్రతికూలత ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని అదుపులో పెట్టుకోండి. ప్రతిపనిలో జీవిత భాగస్వామి నుంచి మద్దతు పొందుతారు.
వృషభం
ఈరోజంతా ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులు తమ అన్ని ప్రయత్నాల్లో విజయం సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. పని పట్ల మక్కువ పెరుగుతుంది. మిత్రులను కలుస్తారు. ఇంటి వాతావరణం అద్భుతంగా ఉంటుంది. బంధువుల నుంచి శుభవార్తలు అందుకుంటారు. ఎవరికైనా సహాయం చేయవచ్చు. కొత్త పని ప్రారంభించడానికి మంచి సమయం ఉంటుంది. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి.
మిథునం
వ్యాపారంలో సమస్యలు ఉంటాయి. కష్టపడి పని చేస్తే పనిలో విజయం లభిస్తుంది. ధనలాభం పొందే అవకాశం ఉంది. అలసట ఎక్కువగా ఉంటుంది. మీ ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉండొచ్చు. కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటాయి. లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అనవసర పనులకు డబ్బు ఖర్చు చేస్తారు.
కర్కాటకం
ఈరోజు మంచి రోజు అవుతుంది. వ్యాపార పరిస్థితులు మెరుగ్గా ఉంటాయి. పాత మొత్తాన్ని తిరిగి పొందే అవకాశాలున్నాయి. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు స్వీకరిస్తారు. ఈ రోజు అనుకున్న పనులన్నీ పూర్తవుతాయి. కుటుంబ వాతావరణం బాగుంటుంది. తీర్థయాత్రలు వెళతారు లేదా ప్లాన్ చేస్సతారు. ఇంట్లో బాధ్యతలు పెరుగుతాయి. స్త్రీ ద్వేషానికి దూరంగా ఉండండి.
సింహం
ఈ రోజు సాధారణంగా ఉంటుంది. పని ఒత్తిడి పెరుగుతుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. కోపం తెచ్చుకోవచ్చు. మీ ఆలోచనలను ఎవరిపైనా రుద్దకండి. ప్రతికూలత ఉంటుంది. అవసరం లేకుండా ఏ పనికి ఖర్చు పెట్టకండి. యువత ఉద్యోగాలు పొందవచ్చు. రక్తపోటు, షుగర్ వ్యాధిగ్రస్తులు జాగ్రత్త.
Also Read: కనీసం పాటించాల్సిన వాస్తు నియమాలివి, మీ ఇల్లు ఇలాగే ఉందా చెక్ చేసుకోండి
కన్య
ఈ రాశి ఉద్యోగులు పదోన్నతికి సంబంధించిన సమచారం పొందుతారు. సమిష్టిగా పనిచేసే వారి సహకారంతో అన్ని కార్యాల్లో విజయం ఉంటుంది.ఈ రోజు మీకు సంతోషకరమైన రోజు అవుతుంది. స్నేహితుడిని కలిసే అవకాశం ఉంటుంది. స్వీయ అధ్యయనం ఆసక్తిని కలిగిస్తుంది. బంధువులతో కలిసి ప్రయాణం చేస్తారు. సమయాన్ని వృథా చేయకండి, మీ ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. ఆర్థికంగా నష్టపోయే సూచనలున్నాయి జాగ్రత్త. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
తుల
ఈరోజు మీరు జాగ్రత్తగా ఉండాలి. ఖర్చులు పెరుగుతాయి.శారీరకంగా ఇబ్బందులకు గురవుతారు. పాదాల నొప్పుల సమస్య ఉంటుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఖర్చు చేస్తారు. మిత్రులతో వివాదాలు తలెత్తవచ్చు. కోపం ఎక్కువగా ఉంటుంది. ఆర్థికంగా నష్టపోవచ్చు. జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు.
వృశ్చికం
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. వ్యాపారంలో ఆర్థికంగా లాభపడే పరిస్థితి ఉంటుంది. మీరు సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గృహంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. బంధువులను కలుస్తారు. అదనపు వ్యయం కారణంగా బడ్జెట్ ప్రభావితం అవుతుంది. పదోన్నతుల విషయంలో మీ అధికారులతో చర్చలు జరుగుతాయి.ఒకరి మాటల్లోకి వచ్చి మీ ప్రియమైన వారిని అనుమానించకండి.
Also Read: ఈ అష్టకం అష్ట దరిద్రాలను నాశనం చేస్తుంది, ఎందుకంత పవర్ ఫుల్ అంటే
ధనుస్సు
ఈరోజు మీ చాలా పనులు సులభంగా పూర్తవుతాయి. మీరు ఉద్యోగంలో విజయం సాధిస్తారు. కార్యాలయంలో శుభవార్తలు అందుతాయి. పనిలో విజయం సాధించడం ద్వారా ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. రుణం మొత్తం తిరిగి వస్తుంది. మీకు పెట్టుబడి ఆఫర్లు వచ్చినప్పుడు త్వరగా నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ ఆనందం ఉంటుంది. మీరు ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. ఎలాంటి బాధల నుంచి అయినా ఉపశమనం పొందే అవకాశం ఉంది.
మకరం
ఈరోజు మీరు గృహ సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఆఫీసులో మరింత బాధ్యత పెరుగుతుంది. సహోద్యోగుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. మీ మాటల మీద సంయమనం పాటించండి. అహంకారాన్ని అదుపులో పెట్టుకోండి. మీరు వివాదాస్పద పరిస్థితిని ఎదుర్కోవలసి రావచ్చు. జీవిత భాగస్వామి మాటల వల్ల మనసు కలత చెందుతుంది...ఏకాంతంగా ఉండాలనుకుంటారు.
కుంభం
ఈ రోజు మిశ్రమంగా ఉంటుంది. మీరు మీ భవిష్యత్తు కోసం ప్లాన్ చేసుకోవచ్చు. వ్యాపారంలో కొత్త అవకాశాలు లాభిస్తాయి. వ్యవసాయ రంగానికి సంబంధించిన వారికి ఈ రోజు మంచి రోజు అవుతుంది. రోజంతా బిజీగా ఉంటారు. మానసికంగా కలవరపడవచ్చు. అనియంత్రిత ఆహారాన్ని నియంత్రించండి. విలువైన వస్తువుల భద్రత విషయంలో జాగ్రత్త వహించండి. విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
మీనం
మీరు ప్రమోషన్ పొందవచ్చు. విద్యార్థులకు ఉపాధ్యాయుల సహాయం అందుతుంది. తలపెట్టిన పని పూర్తి అవుతుంది. అకస్మాత్తుగా మీరు డబ్బు సంపాదించవచ్చు. సాంకేతిక నైపుణ్యాలను నేర్చుకోవడాన్ని పరిశీలిస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. పిల్లల అవసరాలు తీర్చగలరు.వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. ఎవరికైనా సలహాలు ఇవ్వడం మానుకోండి. మీ జీవిత భాగస్వామి ఏదో ఒక విషయంలో కలత చెందవచ్చు.