Horoscope Today 17th February 2022: ఈ మూడు రాశులవారికి ఈరోజు గోల్డెన్ డే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
2022 ఫిబ్రవరి 17 గురువారం రాశిఫలాలు
మేషం
కొత్తగా ఏమైనా ట్రై చేయాలనుకుంటే ఈ రోజు కానివ్వండి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఎంటర్టైన్మెంట్ విభాగానికి చెంది నవ్యక్తులు తమ పనికి సంబంధించి ఆందోళన చెందుతారు. మిమ్మల్ని ఏదో అభద్రతా భావం వెంటాడుతుంది.నిలిచిపోయిన పనులను పూర్తి చేసేందుకు పరుగులు తీస్తారు.
వృషభం
ఈరోజంతా మీరు జాగ్రత్తగా ఉండాలి. అనవసరంగా మాట్లాడవద్దు.కుటుంబంలో అసంతృప్తి ఎక్కువగా ఉంటుంది. మీ అభిప్రాయాలను ఎవరిపైనా రుద్దకండి. మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. వ్యాపారంలో మందగమనం ఉంటుంది. ఉద్యోగులకు సహోద్యోగులతో సమస్యలు ఎదురుకావొచ్చు.
మిథునం
మీరు ఈరోజు వ్యాపార పనిపై ప్రయాణం చేయాల్సి రావొచ్చు. మీ సమర్థత పెరుగుతుంది. శత్రువులు ప్రశాంతంగా ఉంటారు. తలపెట్టిన పనులన్నీ పూర్తిచేస్తారు. ఉద్యోగంలో ప్రమోషన్ సంబంధిత సమాచారం వినే అవకాశం ఉంది. అప్పిచ్చిన మీరు రుణం మొత్తాన్ని తిరిగి పొందవచ్చు.
కర్కాటకం
ఈ రోజు మీకు మిశ్రమంగా ఉంటుంది. బద్దకాన్ని వీడండి. కుటుంబంలో కలహాలు జరిగే అవకాశం ఉంది. చాలా కాలం తర్వాత బంధువుతో కలుస్తారు. రాజకీయ నాయకులు అప్రమత్తంగా ఉండాలి. మీరు కోర్టు కేసులో చిక్కుకోవచ్చు. అనారోగ్య సూచలున్నాయి జాగ్రత్త.
Also Read:
సింహం
వ్యాపారంలో గొప్ప విజయం సాధించవచ్చు. యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. మీ మనస్సు సానుకూలంగా ఉంటుంది. ఆనందం కోసం డబ్బు ఖర్చుచేస్తారు. చిన్నవిషయానికి వాదనలు పెట్టుకోకండి. ధన సంబంధిత సమస్యలు దూరమవుతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
కన్య
వైవాహిక జీవితంలో సమస్యలతో కోపం పెరుగుతుంది. వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండండి. మీ బాధ్యత పట్ల మీరు అంకితభావంతో ఉండాలి. విద్యార్థులకు చదవుపై నిర్లక్ష్యం పెరుగుతుంది. అనవసర ఖర్చులను నియంత్రించుకోండి. ఎవరినీ ఎగతాళి చేయవద్దు. వివాదాల్లో చిక్కుకోకుండా దూరంగా ఉండాలి.
తుల
ఈ రోజు మీకు అద్భుతంగా ఉంటుంది. కమీషన్ సంబంధిత వ్యాపారంలో లాభం వస్తుంది. దంపతుల మధ్య అన్యోన్యత పెరుగుతుంది. గత అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటారు. కార్యాలయ వాతావరణం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
వృశ్చికం
బంధువులతో సబంధాలు బలపడతాయి. కొత్త ప్రేమ సంబంధాలు ఏర్పడతాయి. మీ ఆస్తులు స్థిరంగా ఉంటాయి. లావాదేవీలు సాఫీగా సాగుతాయి. ఏ సమస్యకైనా ఈరోజు పరిష్కారం లభిస్తుంది. అవసరమైన వారికి సహాయం చేయండి. కార్యాలయంలో కొత్త అవకాశాలు లభిస్తాయి.
Also Read:
ధనుస్సు
వ్యాపారం పెరుగుతుంది. ఉదర సంబంధిత వ్యాధులతో ఇబ్బంది పడతారు. విద్యార్థులు మంచి విద్యాసంస్థల్లో ప్రవేశం పొందుతారు. ఆధ్యాత్మికతవైపు మొగ్గుచూపుతారు. కొత్త వ్యాపారస్తులకు కుటుంబ సభ్యుల నుంచి మద్దతు లభిస్తుంది. దంపతులు తమ వ్యక్తిగత చర్చలు చేసుకోవచ్చు. నిరుద్యోగులకు కలిసొచ్చే సమయం.
మకరం
ఆహారం సమయం దాటి తీసుకోవడం కారణంగా అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉంది. కుటుంబంలో ఓ సమస్య మిమ్మల్ని బాధపెడుతుంది. ఎవరైనా మీ మాటను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. క్షేత్రస్థాయిలో పనిచేసే వారికి కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తలపెట్టిన పనులన్నీ పూర్తవడం కష్టమే.
కుంభం
పనికిరాని పనులకోసం టైమ్ వేస్ట్ చేయకండి. అడగకుండా ఎవరికీ సలహాలు ఇవ్వొద్దు. రహస్య విషయాలను ఇతరులతో పంచుకోవద్దు. ఏదైనా అడ్డంకి మీ పనిని ప్రభావితం చేస్తుంది. సమాజంలో మీ గౌరవం పెరుగుతుంది. మీరు సృజనాత్మక పనిని ఆనందిస్తారు. మీ సంపద పెరుగుతుంది. కొత్త పనులు లాభిస్తాయి.
మీనం
ఈరోజు మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కోపంగా ప్రవర్తించవద్దు. మీ దినచర్య ప్రభావితం అవుతుంది. రాజకీయ నాయకులు జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మీకు కొత్త బాధ్యత వస్తుంది. తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు లభిస్తాయి