Horoscope Today 12th February 2022: ఈ రాశివారి గ్రహస్థితి ఈ రోజు బావుంది, ఏం చేసినా సక్సెసే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి
Horoscope In Telugu: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి.
![Horoscope Today 12th February 2022: ఈ రాశివారి గ్రహస్థితి ఈ రోజు బావుంది, ఏం చేసినా సక్సెసే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి Horoscope Today : Aaries, Gemini, Libra, Sagittarius, Aquarius And Other Zodiac Signs check Astrological Prediction Horoscope Today 12th February 2022: ఈ రాశివారి గ్రహస్థితి ఈ రోజు బావుంది, ఏం చేసినా సక్సెసే, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2022/02/11/97991212a01587f3c0313f7a036207b1_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఫిబ్రవరి 12 శనివారం రాశిఫలాలు
మేషం ( Aries)
మేష రాశి వారికి ఈ రోజు సాధారణంగా ఉంటుంది. నిలిచిపోయిన కొన్ని పనులు పూర్తి అవుతాయి. కార్యాలయంలో అప్రమత్తంగా ఉండండి, ప్రత్యర్థి కారణంగా మీకు ఇబ్బందులు తలెత్తవచ్చు. పనికిరాని పనులకు దూరంగా ఉండండి. డబ్బు ఖర్చు చేసేటప్పుడు బడ్జెట్‌ను గుర్తుంచుకోండి.
వృషభం (Taurus)
మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. రోజంతా బిజీగా ఉంటారు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు అన్ని పత్రాలను మీతో తీసుకెళ్లండి. వాహనం జాగ్రత్తగా నడపండి. రాజకీయ నాయకులతో చర్చలు పెట్టుకువారు గుడ్ న్యూస్ వింటారు.
మిథునం (Gemini)
మీరు మీ పని శైలిలో మార్పును గమనిస్తారు. ఈరోజంతా సంతృప్తిగా ఉంటారు. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. ఆరోగ్యం పట్ల ఆందోళన దూరమవుతుంది. ఉద్యోగస్తులు శుభవార్తలు వింటారు. పదోన్నతి పొందే అవకాశాలున్నాయి.
కర్కాటకం ( Cancer)
తలనొప్పి కారణంగా మీ మనస్సు ఏ పనిలోనూ నిమగ్నమై ఉండదు. పిల్లల వైపు నుంచి శుభవార్తలు అందుకుంటారు. మతపరమైన వ్యక్తులను కలిసేటప్పుడు మీ ఉత్సాహం తగ్గుతుంది. మీరు తలపెట్టిన పనులకు మీ జీవిత భాగస్వామి మద్దతు ఉంటుంది.
సింహం (Leo)
ఈరోజు మీరు శుభవార్త వింటారు. పూర్వీకుల ఆస్తిలో వాటా లభిస్తుంది. పాత ఒత్తిడులు తొలగిపోతాయి. వేరేవారి గురించి పాజిటివ్ గా ఆలోచిస్తారు. చాలా అలసటగా ఉంటారు. ఓ పాత పనిపై స్నేహితులను కలుస్తారు.
కన్య (Virgo)
మీ జీవిత భాగస్వామితో సంతోషంగా ఉంటారు. అర్థరాత్రి వరకూ కార్యాలయానికి సంబంధించిన చర్చల్లో బిజీగా ఉంటారు. బ్యాంకు సంబంధిత పనులు పూర్తవుతాయి. స్నేహితులను కలవడం వల్ల ప్రయోజనం పొందుతారు, ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తారు. మీకు అధికారితో వాగ్వాదం జరిగే అవకాశం ఉంది.
Also Read: తొలిచూపులోనే భీముడితో ప్రేమలో పడిన హిడింబి
తుల ( Libra)
గతంలో ఇచ్చిన రుణం మొత్తాన్ని తిరిగి పొందే అవకాశం ఉంది. ఓపనికి సంబంధించి మరొక నగరానికి వెళ్లడానికి ఒక ప్రణాళికను రూపొందించవచ్చు. దిగుమతి-ఎగుమతి పనులు చేసే వ్యాపారులు సంతోషంగా ఉంటారు, లాభాలు పొందుతారు. కుటుంబ జీవితంలో సంతోషం ఉంటుంది.
వృశ్చికం (Scorpio)
మీరు ఒకరి నియంత్రణలో పనిచేయడానికి ఇష్టపడరు. అయినప్పటికీ విమర్శలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వ్యాపారులకు ఈరోజు మంచి రోజు అవుతుంది. కొత్త ఒప్పందాన్ని ఆమోదించవచ్చు. పెద్దలు ఆరోగ్యం పట్ల అజాగ్రత్త మానుకోవాలి.
ధనుస్సు ( Sagittarius)
రోజు ప్రారంభంలో మంచి సమాచారాన్ని పొందుతారు. విహారయాత్రకు వెళ్లేందుకు ప్రణాళికలు వేసుకుంటారు. పనికిరాని విషయాల్లో మిమ్మల్ని మీరు నిమగ్నం చేయకండి. మీ ఆర్థిక స్థితిని మెరుగుపరచుకోవడానికి కొత్త ప్రాజెక్ట్‌లో పనిని ప్రారంభించవచ్చు.
మకరం ( Capricorn )
మీరు తల్లి వైపు నుండి శుభవార్త అందుకుంటారు. మిమ్మల్ని మీ లక్ష్యం నుంచి పక్కకు తప్పించడానికి ఎవరైనా ప్రయత్నించవచ్చు. మీరు భవిష్యత్తు కోసం ప్రణాళికలు వేస్తారు. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. యువత ఉద్యోగాలు పొందవచ్చు.
కుంభం ( Aquarius)
మీ స్నేహితులతో సమయం గడపడంతో పాటు, మీరు వివిధ ప్రణాళికలపై చర్చించవచ్చు. కొత్త పనులు ప్రారంభించేందుకు రుణం తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. మీరు ఇల్లు కొనడానికి కొత్త ఆఫర్లను పొందవచ్చు. మతపరమైన కార్యక్రమాల పట్ల ఆసక్తి ఉంటుంది. అనవసరంగా ఖర్చు పెట్టకండి.
మీనం ( Pisces)
ఈరోజు తక్కువగా మాట్లాడండి. మీ మాటలు కుటుంబ సభ్యులను బాధించవచ్చు. కుటుంబంలో కలహాలు ఉంటాయి. అపరిచితుల పట్ల జాగ్రత్త వహించండి. మీ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. అడగకుండా ఎవరికీ సలహా ఇవ్వకండి.
Also Read: పగలు కనిపించి రాత్రి పూట మాయమయ్యే శివలింగం , అక్కడ క్షణం క్షణం అద్భుతమే
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)