Horoscope Today 29 January 2022: ఈ నాలుగు రాశులవారిపై శని అనుగ్రహం ఉంటుంది, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
జనవరి 29 శనివారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీకు మిశ్రమ ఫలితాలుంటాయి. వ్యాపారంలో వేగం తగ్గుతుంది. బంధువుల నుంచి చెడు వార్తలు వినే అవకాశం ఉంది. జీవిత భాగస్వామితో వివాదాలు పరిష్కారమవుతాయి. వృద్ధులను జాగ్రత్తగా చూసుకోండి. ఖర్చులు అధికంగా ఉంటాయి.
వృషభం
ఈరోజు మీరు డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. గాయపడే ప్రమాదం ఉంది. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. పెట్టిన పెట్టుబడులు లాభాన్నిస్తాయి. స్నేహితుని నుంచి ఒత్తిడి తొలగిపోతుంది.
మిథునం
మీరు వివాదాలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పిల్లల వైపు నుంచి ఇబ్బంది ఉంటుంది. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది. అనవసరంగా ఖర్చుచేసే ధోరణిని అదుపులో పెట్టుకోవాలి. విద్యార్థులు లాభపడతారు.
Also Read: అప్పులు, అనారోగ్యం, శత్రుబాధలు తొలగించే సూర్యారాధన ...రథసప్తమి ప్రత్యేకత ఇదే..
కర్కాటకం
ఈ రోజు మీరు మంచి బహుమతి పొందొచ్చు. సమాడంలో గౌరవం లభిస్తుంది. వ్యాపారంలో అధిక లాభాలు పొందుతారు. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. మాటల విషయంలో సంయమనం పాటించాలి.
సింహం
మీరు మానసికంగా ఇబ్బంది పడతారు. సమస్య పరిష్కరించకపోవడం వల్ల కోపం వస్తుంది. ప్రత్యర్థి మీకు హాని చేయడానికి ప్రయత్నిస్తారు. ప్రయాణం కష్టంగా ఉంటుంది.
కన్య
మీ ఆర్థిక కార్యకలాపాలు వేగవంతంగా సాగుతాయి. ఉదయం నుంచి మీరు బిజీగా ఉంటారు. విద్యార్థులకు శుభసమయం. నిరుద్యోగులకు ఉద్యోగఅవకాశాలకు సంబంధించిన సమాచారం అందుతుంది. చదవడంపై ఆసక్తి పెరుగుతుంది. ఆర్థికపరిస్థితి బావుంటుంది.
Also Read: నవగ్రహాల ఆరాధన వల్ల ఏం జరుగుతుంది… గ్రహ దోషాల నుంచి విముక్తి పొందాలంటే నిత్యం ఈ శ్లోకం చదవండి..
తుల
మీడియాతో సంబంధం ఉన్న వ్యక్తులు కొత్త అవకాశాలు పొందుతారు. ఉద్యోగంలో ప్రమోషన్ ఉంటుంది. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. ఆందోళన దూరమయ్యే అవకాశం ఉంది. బంధువులను కలుస్తారు.
వృశ్చికం
మీరు కార్యాలయంలో ప్రశంసలు పొందుతారు. కొత్త అవకాశాలు లభిస్తాయి.ఈరోజు ఎవరో తెలియని వ్యక్తితో గొడవలు రావచ్చు. కోపం తగ్గించుకోండి. న్యాయపరమైన చిక్కుల్లో పడొచ్చు. ఆదాయంలో ఎలాంటి మార్పు ఉండదు.
ధనుస్సు
ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. మీరు సామాజికంగా విమర్శలకు గురవుతారు. మీ శ్రమను మరొకరు సద్వినియోగం చేసుకోవచ్చు. ఆర్థికంగా బావుంటుంది.
Also Read: యజ్ఞయాగాదులు దేవుడికోసం అనుకుంటే మీరు పొరబడినట్టే...
మకరం
పనికిరాని పనులకోసం సమయాన్ని వృథా చేయకండి. సమాజంలో మీకు గౌరవం లభిస్తుంది. దూరప్రాంత ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. స్నేహితులతో కలిసి పార్టీ ఏర్పాటు చేసుకుంటారు. మత్తు పదార్ధాల వ్యసనాన్ని విడిచిపెట్టండి. చెడు వార్తలు వినే అవకాశం ఉంది.
కుంభం
వ్యాపారంలో లాభాలుంటాయి. ఆధ్యాత్మిక వ్యక్తులతో మంచి సంబంధాలు కలగి ఉంటారు. ఈ రోజు మంచి రోజు అవుతుంది. మీరు స్నేహితుని నుంచి సహాయం పొందుతారు. మీరు మీ జీవిత భాగస్వామి నుంచి బహుమతి పొందుతారు.
మీనం
ఒకరి మాటల్లో పడి మీపని పాడు చేసుకోవద్దు. అప్పిచ్చిన మొత్తం తిరిగి పొందుతారు. మీకు రోజు అద్భుతంగా ఉంటుంది. పిల్లల వైపు విజయం సాధిస్తారు. సంతోషంగా ఉంటారు. ఈ రోజు మీకు పెద్ద ఒత్తిడి దూరమవుతుంది.
Also Read: సోమవారం, శనివారం గణపతిని ఇలా పూజిస్తే శనిబాధలతో పాటూ కష్టాలన్నీ తొలగిపోతాయట…
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి