(Source: ECI/ABP News/ABP Majha)
Horoscope Today 26 January 2022: ఈ రోజు ఈ రాశివారు చిన్న తప్పు చేసినా దోషిగా నిలబడాల్సి వస్తుంది, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి...
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
2022 జనవరి 26 బుధవారం రాశిఫలాలు
మేషం
ఈ రోజు మీరు ఎలాంటి ముఖ్యమైన నిర్ణయం తీసుకోలేరు. జీవిత భాగస్వామికి మీపై అంచనాలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు సంపాదిస్తారు. ఉద్యోగులు తమ పనితీరుతో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటారు. స్నేహితులతో సమయం గడపొచ్చు. ఈ రోజంతా బాగానే ఉంటుంది.
వృషభం
మీరు ఉద్యోగం విషయంలో కొంత ఒత్తిడికి లోనవుతారు. మీరు చిన్న తప్పు చేసినా దోషిగా నిలబడతారు. సహోద్యోగుల నుంచి మంచి సహకారం అందుతుంది. ప్రణాళికాబద్దంగా పని చేయడం ప్రయోజనకరంగా ఉంటుంది.
మిథునం
ఈ రోజు మీరు ప్రయాణం చేయొచ్చు. ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. పొద్దున్నే పెద్దగా కలసిరాకపోయినా సాయంత్రానికి పనులు వేగవంతమవుతాయి. విద్యార్థులకు గౌరవం లభిస్తుంది. గుర్తు తెలియని వ్యక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది.
Also Read: స్వర్గానికి షార్ట్ కట్! ధర్మరాజు తమ్ముళ్లు కుక్కతో కలసి వెళ్లిన రూట్ మ్యాప్ క్లియర్‌గా ఉందిగా!
కర్కాటకం
కల్పిత ధోరణి వదిలి వాస్తవానికి దగ్గరగా ఆలోచించండి. ఈరోజు మీరు ఆర్థిక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. కుటుంబ సభ్యులు మీపై కోపంగా ఉంటారు. వ్యాపారంలో ఆదాయం బాగానే ఉంటుంది. ప్రయాణం చేయాల్సి రావొచ్చు.
సింహం
కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. మీ మనసులో ప్రేమను వ్యక్తపరిచేందుకు ఈ రోజు మంచిరోజు. ఉద్యోగంలో గౌరవం పొందుతారు. ఇంట్లో నచ్చిన ఆహారాన్ని ఆస్వాదిస్తారు. స్నేహితులను కలుస్తారు.
కన్య
ఈ రోజు తలపెట్టిన పనులన్నీ ఓపికగా నిర్వహించండి. కొన్ని చిన్న చిన్న విషయాల కారణంగా వైవాహిక జీవితంలో ఇబ్బందులు రావొచ్చు. ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. ప్రజా జీవితంలో చురుకుగా ఉండండి. చాలా మందిని కలుస్తారు. కుటుంబ సభ్యులకు అవసరమైన పనులు నిర్వహిస్తారు.
Also Read: తమ్ముళ్లని కాదని కుక్కని సపోర్ట్ చేసిన ధర్మరాజు .. ఆనందించిన తండ్రి యమధర్మరాజు..
తుల
మీలోని ఏదైనా చెడు అలవాటును వదిలేయడానికి ప్రయత్నించండి. విద్యార్థులకు మంచి సమయం..పోటీ పరీక్షలు రాసేవారు విజయం సాధిస్తారు. మీ నైపుణ్యంతో ప్రశంసలు అందుకుంటారు. వ్యాపారంలో లాభం ఉంటుంది. ఈరోజు కుటుంబ సభ్యులతో గడుపుతారు. ప్రయాణం శుభప్రదంగా, ప్రయోజనకరంగా ఉంటుంది.
వృశ్చికం
ఆస్తి విషయంలో వివాదాలు రావొచ్చు. ఆఫీస్‌లో ఎక్కువ పని కారణంగా మీరు కొంచెం చికాకుగా ఉంటారు. లావాదేవీ పత్రాలను జాగ్రత్తగా చదవండి. మీ ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి. వ్యాయామం చేయడం వల్ల ప్రయోజనం ఉంటుంది.
ధనుస్సు
మీరు చాలా ఉత్సాహంగా ఉంటారు. విద్యార్థులకు ఈరోజు చాలా అనుకూలమైన రోజు. పోటీ పరీక్ష ఫలితాలు మీకు అనుకూలంగా ఉంటాయి. ఉద్యోగులు మీ పనితీరుతో అధికారులను మెప్పిస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది.
Also Read: కృష్ణుడు 36 ఏళ్లలో చనిపోవాలనే గాంధారీ శాపం నెరవేరిందా? కురుక్షేత్రంలో ఏం జరిగింది?
మకరం
సామాజికంగా గౌరవం అందుకుంటారు.మీ విజయంతో అందరూ సంతోషిస్తారు. కొత్త వ్యాపారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళిక రూపొందిస్తారు. ఈ రోజంతా మీకు అద్భుతంగా అనిపిస్తుంది. మీరు కోరుకున్న వస్తువును పొందడం ద్వారా సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.
కుంభం
ఓ పని ఆగిపోవడం మీకు సంతోషాన్నిస్తుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగిపోతాయి. ఉద్యోగులకు కొత్త అవకాశాలు వస్తాయి. ప్రభుత్వ పనుల్లో వచ్చిన ఆటంకాలు తొలగిపోతాయి.కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు.
మీనం
కుటుంబ కలహాలతో ఇబ్బంది పడతారు. కొంతమంది తమ స్వార్థ ప్రయోజనాల కోసం మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. ఏ పనిలోనూ అసహనం ప్రదర్శించవద్దు. గొంతు నొప్పి సమస్య ఉంటుంది. వ్యాపారంలో మందగమనం ఉంటుంది. మీరు ఓ పనిలో నష్టపోవచ్చు..ప్రశాతంగా వ్యవహరించండి. పిల్లల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి