Horoscope Today 21th January 2022: ఈ రాశివారు ఈ రోజు ఇతరుల వ్యవహారాల్లో తలదూర్చొద్దు, మీ రాశి ఫలితం ఇక్కడ తెలుసుకోండి..
ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా చాలా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు.
2022 జనవరి 21 శుక్రవారం రాశిఫలాలు
మేషం
విద్యార్థులు ఉన్నత విద్యలో సత్ఫలితాలు పొందుతారు. దిగుమతి-ఎగుమతులకు సంబంధించిన వ్యాపారంలో భారీ ధనలాభం ఉంటుంది. పిల్లలు తమ తప్పులను సరిదిద్దుకుంటారు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు చేసుకోవడంలో జాగ్రత్త వహించండి. ఉద్యోగులకు అనుకూల సమయం.
వృషభం
ఈరోజు లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఆధ్యాత్మిక శాస్త్రానికి సంబంధించిన చర్చల్లో పాల్గొంటారు. చిన్న వ్యాపారంలో నష్టాలు రావొచ్చు. హోటల్, రెస్టారెంట్ వ్యాపారులు నష్టాలు చూసే అవకాశం ఉంది. ఇతరుల విషయాలలో జోక్యం చేసుకోకండి.
మిథునం
ఇతర ఆదాయ వనరులను అభివృద్ధి చేసుకోండి. మంచి కస్టమర్ల వల్ల వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. మీ గౌరవం పెరుగుతుంది. పాత అనుభవాలను గుర్తు చేసుకుంటూ పెద్దలు సంతోషిస్తారు. వైవాహిక జీవితం సంతోషంగా ఉంటుంది. ప్రేమ వివాహానికి కుటుంబ సభ్యులను ఒప్పించడం సులభం అవుతుంది.
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-1
కర్కాటకం
మీరు అప్పు చేయాల్సి రావొచ్చు. సమాజంలో మీ పలుకుబడి బావుంటుంది. మధుమేహ వ్యాధిగ్రస్తుల ఆరోగ్యం బాగా ఉండదు. ఒత్తిడికి దూరంగా ఉండండి. అనవసర విషయాలపై మనసు లగ్నం చేస్తారు. నిరుద్యోగులు ఉద్యోగాల గురించి ఆందోళన చెందుతారు.
సింహం
మీకు ఈ రోజు పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక స్థితి బలంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు. కళారంగంతో అనుబంధం ఉన్న వ్యక్తులకు ఈరోజు ప్రత్యేకమైన రోజు. పనులు స్వల్ప జాప్యంతో పూర్తవుతాయి. ప్రేమ జీవితం చాలా రొమాంటిక్‌గా ఉంటుంది.
కన్య
తప్పని పరిస్థితుల్లో తప్పితే ప్రయాణం చేయొద్దు. ఉద్యోగులు పక్కవారి కారణంగా ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాస్త వినయంగా ఉండండి. వెన్నునొప్పితో బాధపడే అవకాశం ఉంది. వివాహేతర సంబంధాలపై ఆసక్తి చూపే అవకాశం ఉంది. మనస్సాక్షిని ప్రశ్నించుకోండి.
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2
తుల
మీరు ఈ రోడు ఇంటర్వ్యూలో విజయం సాధిస్తారు. మీ భావజాలానికి ప్రజలు చాలా త్వరగా ఆకర్షితులవుతారు. కుటుంబ సభ్యుల్లో కొన్ని సానుకూల మార్పులు ఉండొచ్చు. నిలిచిపోయిన పనులు వేగంగా పూర్తి చేస్తారు. విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులకు శుభసమయం.
వృశ్చికం
సహోద్యోగులను ఎక్కువగా నమ్మేయకండి. ఈ రోజు మీరు మంచి భోజనం ఆస్వాదిస్తారు. వ్యాపారస్తులు సన్నిహితుల సహాయం తీసుకుంటే మంచి ఫలితాలు సాధిస్తారు. ఆర్థిక సమస్యలు పరిష్కారమవుతాయి. నిర్మాణ పనుల్లో వేగం ఉంటుంది.
ధనుస్సు
మీ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం మీకు లభిస్తుంది. అదృష్టం మీరు కలిసొస్తుంది. మహిళలకు భలే మంచిరోజు. ఇంటా బయటా ప్రశంసలు అందుకుంటారు. విదేశాలకు వెళ్లే ప్రయత్నాల్లో ఓ అడుగు ముందుకు పడుతుంది. తల్లిదండ్రులు, గురువుల మార్గదర్శకత్వంలో ఉండండి.
Also Read: పిల్లలు ఏ నక్షత్రంలో పుడితే ఎలాంటి దోషం ఉంటుంది.. ఇక్కడ తెలుసుకోండి.. Part-2
మకరం
ఈరోజు పెట్టిన పెట్టుబడి లాభాన్నిస్తుంది. ఉద్యోగులు కొంత ఒత్తిడికి లోనవుతారు. మీ మాటతీరుతో కొందరు ఇబ్బంది పడే అవకాశం ఉంది. పనికిరాని పనులకు డబ్బు ఖర్చు చేస్తారు..జాగ్రత్త. ఎవరైనా ఏమైనా అంటే వెంటనే స్పందించకండి.
కుంభం
స్నేహితుడిని కలుస్తారు. ప్రభుత్వ పనుల్లో విజయం సాధిస్తారు. కొంచెం కష్టపడితే మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారం విస్తరించవచ్చు. గృహంలో కొన్ని శుభ కార్యాలు జరుగుతాయి.
మీనం
ప్రత్యర్థుల పట్ల జాగ్రత్త వహించండి. కుటుంబ సభ్యులు మీ మాటలను తప్పుగా అర్థం చేసుకోవచ్చు. కార్యాలయంలో మహిళా సహోద్యోగితో విభేదాలు రావొచ్చు. దిగుమతి-ఎగుమతి సంబంధిత వ్యాపారం పెరుగుతుంది. అధికారులు మీ పట్ల అసంతృప్తిగా ఉండవచ్చు.
Also Read: రేవతి మినహా చివరి ఏడు నక్షత్రాల్లో జన్మిస్తే మీరు సూపర్..నక్షత్ర దోషాలు Part-4
Also Read: పద్మవ్యూహం అనే మాట పదే పదే వాడేస్తుంటాం కానీ.. పద్మవ్యూహం ఎంత భయంకరంగా ఉంటుందో తెలిస్తే..
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి