News
News
X

Horoscope Today, 12 August 2022:శ్రావణ పూర్ణిమరోజు ఏ రాశివారికి ఎలా ఉందో ఇక్కడ తెలుసుకోండి

Horoscope 12 August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

FOLLOW US: 

ఆగస్టు 12 రాశిఫలాలు (Horoscope 12th August 2022)

మేషం 
ఈ రోజు మీకు చాలా ఫలవంతంగా ఉంటుంది. పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులు పూర్తిచేయడం వల్ల మనసులో సంతృప్తి ఉంటుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కలిసొస్తుంది.మీరు కొత్త వ్యక్తులను కలుస్తారు ఇది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. పూర్తి శ్రద్ధతో పని చేయాలి. కుటుంబ సభ్యులు ప్రతి విషయంలోనూ మీకు పూర్తి సహకారం అందిస్తారు. వివాహితుల జీవితం బావుంటుంది.

వృషభం
ఈ రోజు మీకు బావుంటుంది. మీ పాత చెడు అలవాట్లలో కొన్నింటిని వదులుకోవడం గురించి ఆలోచించడం మంచిది. క్షేత్రస్థాయిలో మంచి పనులు చేయడం వల్ల అధికారులు సంతోషంగా ఉంటారు.ఆర్థిక స్థితి గతం కంటే బలంగా ఉంటుంది. ఆధ్యాత్మికంపై ఆసక్తి పెరుగుతుంది. మీకు ఏదైనా శారీరక సమస్య ఉంటేఈ రోజు మళ్లీ ఇబ్బంది పెడుతుంది. 

మిథునం
ఈరోజు మీరు దానధర్మాలు చేయడంపై ఆసక్తి చూపిస్తారు. ఫైనాన్స్‌ వ్యాపారం చేస్తున్నవారు జాగ్రత్తగా ఉండాలి. వ్యాపారులకు రోజు ప్రారంభం కాస్త నిదానంగా ఉన్నా ఆ తర్వాత లాభం పొందుతారు.  మీ మాటల్లో మాధుర్యం ఇతరులను ఆకట్టుకుంటుంది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు పొందుతారు. 

Also Read: ఆగస్టు 12 హయగ్రీయ జయంతి, విద్యార్థులకు అత్యంత ముఖ్యమైన రోజు

కర్కాటకం
ఈ రోజు మీకు అనుకూల ఫలితాలు వస్తాయి. రచయితలకు శుభవార్తలు అందుతాయి. ఉద్యోగంలో ఉన్న వ్యక్తులు పార్ట్ టైమ్ పనిలో కూడా సంపాదించవచ్చు. కుటుంబంలో కొనసాగుతున్న విభేదాలు సమసిపోతాయి. సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీ పనులను సకాలంలో పూర్తి చేయాలి. మీరు పిల్లల సాంగత్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకుంటే వారు తప్పుదారి పట్టే అవకాశం ఉంది. తల్లిదండ్రుల సేవలో కూడా కొంత సమయం గడుపుతారు.

సింహం
ఈ రోజు మీ ఆదాయాన్ని పెంచే రోజు.బంధువల ఆకస్మిక రాక కారణంగా షెడ్యూల్ చేసిన ప్లాన్‌లలో కొన్ని మార్పులు చేయాల్సి వస్తుంది. కొత్త వ్యాపారం ప్రారంభించేవారికి అదృష్టం కలిసొస్తుంది. విదేశాల్లో నివసిస్తున్న కుటుంబ సభ్యుల నుంచి కొన్ని శుభవార్తలు వింటారు. మీరు మీ తల్లితో ఏదో ఒక విషయంలో గొడవ పడతారు కానీ ఆమెతో వాదనకు దిగొద్దు..
 
కన్య
ఈ రోజు మీకు సాధారణంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల అంచనాలకు అనుగుణంగా ఉంటారు. మీరు మీ బాధ్యతలను సకాలంలో పూర్తి చేస్తారు. పిల్లల సమస్యల గురించి ఆందోళన చెందుతారు. దుబారా ఖర్చులు తగ్గించండి. కార్యాలయంలో వ్యక్తులు మిమ్మల్ని లక్ష్యంగా చేసుకుని ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే అవకాశం ఉంది జాగ్రత్త. 

Also Read: దిష్టి తీసి పడేసినవి తొక్కుతున్నారా, ఏమవుతుందో తెలుసా!

తుల 
ఈ రోజు మీకు విజ్ఞతతో, ​​విచక్షణతో తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలనిస్తాయి. మీ జీవితంలో కొన్ని బంగారు క్షణాలు ఎదురవుతాయి...వాటిని స్వీకరిస్తే ఆనందంగా ఉంటారు. కుటుంబ సభ్యులతో కొంత సమయం స్పెండ్ చేస్తారు.  మీ తెలివితేటలు,  నైపుణ్యంతో కొన్ని సమస్యలు పరిష్కరిస్తారు. చాలా కాలంగా మీ పెండింగ్‌లో ఉన్న కొన్ని పనులు మీకు ఇబ్బంది కలిగిస్తాయి.

వృశ్చికం
పని చేసే ప్రదేశంలో మార్పులు చేయడం ద్వారా లాభదాయకంగా ఉంటుంది. శుభకార్యానికి హాజరయ్యే అవకాశం ఉంది. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేయడం వల్ల సంతోషంగా ఉంటారు. అప్పులు ఇవ్వడం, తీసుకోవడం మానేయాలి. మీ మనసులో కోరిక నెరవేరుతుంది. ఉద్యోగులు, వ్యపారులకు మంచి సమయం 

ధనుస్సు 
ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది. శుభవార్త వింటారు. విలువైన వస్తువులు కొనుగోలు చేసేముందు ఓసారి ఆలోచించంచండి. డబ్బు గురించి చాలా ఆలోచనలు రావొచ్చు. వ్యాపారం చేసేవ్యక్తులు తమ వ్యాపారం పెంచుకునేందుకు కొత్త మార్గాలు ఆలోచిస్తారు. కుటుంబంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. 

Also Read: వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1

మకరం
ఉద్యోగులకు మంచి రోజు...జీతం పెరుగుదల, ప్రమోషన్ కి సంబంధించిన సమచారం వింటారు. ఏదైనా ఆర్థిక సమస్య గురించి ఆందోళన చెందుతున్నట్టైతే మీ స్నేహితుల సహాయంతో సాల్వ్ అవుతుంది.  మృదువుగా మాట్లాడటం వల్ల మీకు గౌరవం లభిస్తుంది. మీ పిల్లల వివాహంలో వస్తున్న సమస్య కుటుంబ సభ్యుల సహాయంతో అధిగమిస్తారు.  కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది.

కుంభం
ఆర్థిక లావాదేవీలు కలిసొస్తాయి. వ్యాపార ప్రణాళికలు ఊపందుకుంటాయి. మీ పాత పెట్టుబడులలో కొన్ని మీకు ప్రయోజనకరంగా ఉంటాయి. వైవాహిక జీవితంలో కొన్ని సమస్యలు ఉంటే, ఇప్పుడు మీరు వాటిని మరింత భరించవలసి ఉంటుంది. కెరీర్ గురించి ఆందోళన చెందుతున్న యువకులకు మంచి అవకాశాలు లభిస్తాయి. మీ పాత స్నేహితుడు మీతో సమస్య గురించి మాట్లాడటానికి రావచ్చు.

మీనం
ఈ రోజు మీకు కష్టమైన రోజు అవుతుంది. కుటుంబ సమస్యలకు పరిష్కారం పొందుతారు, కానీ మీ మనస్సులో కొన్ని ఆటంకాలు ఉంటాయి. త్వరగా డబ్బు సంపాదించాలనే తపనతో మీరు కొన్ని తప్పులు చేస్తారు.  మీ ప్రసంగం తీరు మీకు వరం అనిపిస్తుంది. విద్యార్థులకు చదువుపై శ్రద్ధ తగ్గుతుంది. వేరేవారి చేతిలో మోసపోకుండా జాగ్రత్తపడండి. 

Also Read: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2

Published at : 12 Aug 2022 05:16 AM (IST) Tags: astrology in telugu horoscope today Zodiac Signs aaj ka rashifal 12 August y 2022 astrological prediction for 12th August 2022 aaj ka rashifal 12th August 2022

సంబంధిత కథనాలు

Tirumala Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ‌, సెప్టెంబర్ 27న సీఎం పట్టువస్త్రాల సమర్పణ

Tirumala Brahmotsavam 2022: శ్రీవారి బ్రహ్మోత్సవాలకు నేడు అంకురార్పణ‌, సెప్టెంబర్ 27న సీఎం పట్టువస్త్రాల సమర్పణ

Tirumala News: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, నిన్న శ్రీవారి హుండీ కలెక్షన్ ఎంతంటే

Tirumala News: తిరుమలలో తగ్గిన భక్తుల రద్దీ, నిన్న శ్రీవారి హుండీ కలెక్షన్ ఎంతంటే

Horoscope Today 26th September 2022: ఈ నాలుగురాశుల వారిపై దుర్గామాత ఆశీస్సులు ఉంటాయి, సెప్టెంబరు 26 రాశిఫలాలు

Horoscope Today 26th September 2022:  ఈ నాలుగురాశుల వారిపై దుర్గామాత ఆశీస్సులు ఉంటాయి, సెప్టెంబరు 26 రాశిఫలాలు

Dussehra 2022: శరన్నవరాత్రుల్లో మొదటి రోజు పారాయణం చేయాల్సినవి ఇవే

Dussehra 2022: శరన్నవరాత్రుల్లో మొదటి రోజు పారాయణం చేయాల్సినవి ఇవే

Dussehra 2022: శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపం మొదటి రోజు ఎందుకు వేస్తారు, దీనివెనుకున్న విశిష్టత ఏంటి!

Dussehra 2022: శ్రీ స్వర్ణకవచాలంకృత దుర్గాదేవి రూపం మొదటి రోజు ఎందుకు వేస్తారు, దీనివెనుకున్న విశిష్టత ఏంటి!

టాప్ స్టోరీస్

Mahesh Bhagwat: మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? బీ కేర్ ఫుల్! రాచకొండ సీపీ వార్నింగ్

Mahesh Bhagwat: మీ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఉందా? బీ కేర్ ఫుల్! రాచకొండ సీపీ వార్నింగ్

Viral Video: పాప బ్యాగ్‌లో పాము- ఓపెన్ చేసిన టీచర్, వైరల్ వీడియో!

Viral Video: పాప బ్యాగ్‌లో పాము- ఓపెన్ చేసిన టీచర్, వైరల్ వీడియో!

Salaar: 'సలార్' లీక్స్, డైరెక్టర్ అప్సెట్ - సెట్స్ లో కొత్త రూల్స్!

Salaar: 'సలార్' లీక్స్, డైరెక్టర్ అప్సెట్ - సెట్స్ లో కొత్త రూల్స్!

Director Anish Krishna : స్క్రిప్ట్ కి న్యాయం చేయాలంటే ఇద్దరు వెన్నెల కిషోర్ లు కావాలి | ABP Desam

Director Anish Krishna : స్క్రిప్ట్ కి న్యాయం చేయాలంటే ఇద్దరు వెన్నెల కిషోర్ లు కావాలి | ABP Desam