Horoscope 25 June 2022: ఈ రాశులవారు నమ్మకాన్ని కోల్పోకుండా చూసుకోవాలి, మీ రాశిఫలితం ఇక్కడ తెలుసుకోండి

horoscope 25-06-2022 : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మార్పులుంటాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు…

FOLLOW US: 

జూన్ 25 శనివారం రాశిఫలాలు (Horoscope 25-06-2022) 

మేషం
మీరు కుటుంబ కార్యక్రమాలకు డబ్బు ఖర్చు చేస్తారు.కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకునేవారికి భాగస్వాములు దొరుకుతారు. కుటుంబ సభ్యులతో ఏదో ఒక విషయంలో అభిప్రాయ భేదాలు ఏర్పడతాయి. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. మీరు తలపెట్టిన పనిలో మీ జీవిత భాగస్వామి సహకారం ఉంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

వృషభం
చాలా కాలం తర్వాత పాత మిత్రులను కలుసుకునే అవకాశం ఉంది. మీ పనిని చిత్తశుద్ధితో పూర్తి చేయండి. ప్రత్యర్థులు యాక్టివ్ గా ఉంటారు. వ్యాపారంలో నిథుల కొరత వల్ల ఇబ్బంది పడతారు. బంధువులతో సంత్సంబంధాలుంటాయి. 

మిథునం
కార్యాలయంలో సహోద్యోగుల సహకారంతో మీరు ప్రశాంతంగా ఉంటారు. విద్యార్థులు చదువు విషయంలో అప్రమత్తంగా ఉంటారు. హోల్‌సేల్ వ్యాపారులు వ్యాపారంలో అధిక లాభాలను పొందుతారు. కోపం తెచ్చుకోవడం వల్ల మీకే హాని కలుగుతుంది. నిరుద్యోగులకు సంబంధించి ముఖ్యమైన సమచారం అందుతుంది.

Also Read:  తిథి, నక్షత్రం, వర్జ్యం, దుర్ముహూర్తం, గ్రహదోషాలను తొలగించే నవగ్రహ శ్లోకం
 
కర్కాటకం
కుటుంబం కోసం సమయం వెచ్చిస్తారు.పొట్టకు సంబంధించిన సమస్యతో బాధపడతారు.అప్పిచ్చిన మొత్తాన్ని తిరిగి పొందగలుగుతారు. ధనలాభం పొందే పరిస్థితి ఉంటుంది. బంధువులను కలుస్తారు. పిల్లల కారణంగా ఉత్సాహంగా ఉంటారు. ఈ రోజు మీకు మంచి రోజు అవుతుంది.

సింహం
మీ సంపద పెరుగుతుంది. ఒత్తిడి నుంచి ఉపశమనం పొందుతారు.పనికిరాని పనుల్లో మునిగిపోకండి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది. మీరు కెరీర్‌కు సంబంధించి శుభవార్తలు అందుకుంటారు. వ్యాపారంలో అధిక లాభం ఉంటుంది. ప్రేమికులకు మంచి రోజు. స్నేహితులతో సంతోష సమయం గడుపుతారు. రోజువారీ పనులు సమయానికి పూర్తి చేస్తారు.

కన్యా
ఈ రోజంతా గందరగోళంగా ఉంటుంది. వివాహేతర సంబంధాల్లో నష్టాలుంటాయి. మీ గౌరవం తగ్గుతుంది. తెలియని వ్యక్తులను ఎక్కువగా నమ్మొద్దు. అతిగా ఆలోచించడం వల్ల సమయం వృథా అవుతుంది. చట్టవ్యతిరేక కార్యకలాపాలపై ఆసక్తి చూపడం మంచిది కాదు. తలనొప్పితో ఇబ్బంది పడతారు. కార్యాలయంలో మీ బాధ్యతలు పెరుగుతాయి. 

తులా
ఏ విషయంలోనూ రిస్క్ తీసుకోకండి. ఈ రోజు గొప్పవారిని కలుస్తారు. పిల్లల సమస్యలను పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఈరోజు కుటుంబానికి తగినంత సమయం ఇస్తారు. మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. అధికారులతో సమావేశం కలిసొస్తుంది.  ఉద్యోగులకు ప్రమోషన్‌కు అవకాశాలుంటాయి. కోపాన్ని అదుపులో పెట్టుకోండి.

Also Read: ఈ ఆలయం నుంచి వారణాసికి సొరంగ మార్గం! ఇక్కడ పుష్కరిణిలో అస్తికలు కలిపితే గంగలో కలిపినట్టే!

వృశ్చికం
వ్యవసాయ రంగంలో ఉన్నవారికి కలిసొచ్చే సమయం ఇది. కొత్త ఒప్పందాలు కుదుర్చుకోవాలి అనుకుంటే తెలివిగా వ్యవహరించండి. కొన్ని సీక్రెట్ విషయాలపై ఆరాలు తీయడం మొదలెడతారు. ఆధ్యాత్మిక విషయాలపై అధ్యయనం చేస్తారు. ఆఫీసు వాతావరణం బాగుంటుంది.

ధనుస్సు 
తొందరపాటులో తప్పులు జరుగుతాయి జాగ్రత్త. ప్రయాణంలో జాగ్రత్తగా డ్రైవ్ చేయండి. గాయపడే ప్రమాదం ఉంది. వ్యాపారంలో  పెద్ద మొత్తంలో డబ్బు పొందే అవకాశం ఉంది. ప్రేమ వివాహాలకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. విద్యార్థులు చదువులో రాణిస్తారు. మీ ఆహారాన్ని నియంత్రించండి.

మకరం
కొన్ని పనులపై దూరప్రయాణం చేసే అవకాశం ఉంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఉంటాయి. అధిక పనిభారం వల్ల కొన్ని చికాకులు ఉంటాయి. ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా ఉండండి. ఒకరి మాటనమ్మి మీ ప్రియమైన వారిని అనుమానించకండి. దురాశ వల్ల కొంత నష్టపోతారు. మీ ప్రవర్తన కారణంగా స్నేహితులు దూరమవుతాయి. 

కుంభం
వ్యాపార సంబంధిత సమస్యలను కుటుంబ సభ్యులతో చర్చించవచ్చు. ఇతరులపై ఆధారపడొద్దు. మీ బాధ్యతల నిర్వహణలో నిర్లక్ష్యంగా ఉండొద్దు. ఆదాయం పెరిగే అవకాశం ఉంది. ప్రైవేట్ రంగంలో ఉండే ఉద్యోగులు మంచి అవకాశాలు పొందుతారు. విలువైన వస్తువుల భద్రత విషయంలో అజాగ్రత్తగా ఉండొద్దు.

మీనం
ఆఫీసులో సహోద్యోగులతో మనస్పర్థలు రావొచ్చు. మీ పని నైపుణ్యం మెరుగుపడుతుంది. టెక్నికల్ ఫీల్డ్‌పై అవగాహన పెంచుకోవాలనే ఆసక్తి పెరుగుతుంది. ఎక్కువ పని చేసిన తర్వాత కూడా ఉత్సాహంగా ఉంటారు. పిల్లల అవసరాలను తీర్చడానికి డబ్బు ఖర్చు చేస్తారు. వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది.

Also Read: దొంగతనం, కామశాస్త్రం, వశీకరణం, శకునశాస్త్రం సహా 64 కళలివే

Published at : 24 Jun 2022 04:56 PM (IST) Tags: astrology in telugu horoscope today in telugu Aaries Gemini Libra And Other Zodiac Signs astrological prediction for 25 june 2022

సంబంధిత కథనాలు

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

Tirumala Updates: తిరుమల ఆలయంలో ఆదివారం స్వామి వారికి జరిగే పూజలు ఇవే

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

TTD Kalyanamasthu: టీటీడీ అనూహ్య నిర్ణయం, కళ్యాణమస్తు రద్దు చేస్తున్నట్లు ప్రకటన - కారణం ఏంటంటే !

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Horoscope 6th August 2022: ఆగస్టు 6 రాశిఫలాలు - ఈ రాశులవారికీ ఈ రోజు చాలా బ్యాడ్ డే!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

Adilabad News : సంతానం కోసం ఆదివాసీల ప్రత్యేక ఆచారం, ఊరి చివర ఉయ్యాల ఊగుతారు!

Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది

Horoscope 5th August 2022: ఈ రాశుల వారు మాటలు తగ్గించడం మంచిది, ఖర్చులు కూడా ఎక్కువే, ఆగస్టు 5న మీ రాశిఫలితం ఇలా ఉంది

టాప్ స్టోరీస్

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

Nikhat Zareen Gold Medal : నిఖత్ జరీన్ కు సీఎం కేసీఆర్ ఫోన్, స్వర్ణ పతకం సాధించడంపై సంతోషం వ్యక్తం

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

CM Jagan : వ్యవసాయం, విద్యా రంగాలకు అత్యంత ప్రాధాన్యత- సీఎం జగన్

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Nikhat Zareen Wins Gold: తెలంగాణ అమ్మాయి పంచ్‌ పవర్‌ - బాక్సర్‌ నిఖత్‌కు స్వర్ణం

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్

Shruti Haasan: నాకోసం అమ్మ నాన్న ఎవరికీ ఫోన్లు చేయలేదు - కష్టం ఎవరికైనా ఒకటే: శ్రుతిహాసన్