Horoscope 27 July 2022: ఈ రాశులవారికి సంపద-సంతోషం రెండూ పెరుగుతాయి, జులై 27 రాశిఫలాలు
Horoscope 27 July : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు
జులై 27 బుధవారం రాశిఫలాలు (Horoscope 27-07-2022)
మేషం
ఈ రోజు మీరు మీ పనిని చాలా సీరియస్‌గా చేస్తారు. మీరు వృత్తిలో మెరుగుదల ఉంటుంది. కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు సక్సెస్ అవుతారు. గౌరవమర్యాదలు పొందుతారు. స్నేహితుల సహకారం ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. తల్లిదండ్రులతో సంతోషంగా ఉంటారు. కుటుంబ వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. విలాసాలకు ఖర్చుచేస్తారు.
వృషభం
ఏ పని చేసినా ఈ రోజు ఆలోచించి చేస్తారు. ఉద్యోగులు, వ్యాపారులు, విద్యార్థులకు మంచి సమయం. మీ తెలివితేటలతో గుర్తింపు పొందుతారు. ప్రశాంతంగా ఉంటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. మీరు తలపెట్టిన పనిలో స్నేహితుల సహకారం లభిస్తుంది.
మిథునం
ఆర్థిక లావాదేవీల విషయంలో ఆందోళన చెందుతారు. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక ఆశక్తి పెరుగుతుంది. వ్యాపారులకు మంచి రోజు. తొందరగా అలసిపోతారు.
Also Read: కృష్ణాష్టమి, పోలాల అమావాస్య సహా శ్రావణ బహుళ పాడ్యమి నుంచి శ్రావణ అమావాస్య వరకూ పండుగలివే
కర్కాటకం
మీ సంపద పెరుగుతుంది. ఆర్థిక స్థితి మరింత మెరుగుపడుతుంది. భౌతిన ఆనందాలుంటాయి. కొత్తగా వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటే ముందుకు అడుగేయండి. మీ పనితీరు,ప్రవర్తనతో అందర్నీ ఆకట్టుకుంటారు. పిల్లల పురోగతితో సంతోషిస్తారు.
సింహం
ఈరోజు మీరు ఏ పని చేసినా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. తొందరపాటుతో చేసే పనుల వల్ల కలత చెందుతారు. డబ్బుకు సంబంధించిన పెద్ద నిర్ణయాలు తెలివిగా తీసుకోండి. ఈరోజు మీరు అదృష్టం మీద అస్సలు ఆధారపడకూడదు.మీరు ఉద్యోగం చేస్తున్నట్లయితే, మీరు మీ పనిలో సహాయం కోసం ఎవరి నుంచి ఆశించవద్దు.
కన్య
మేధోపరమైన పనిలో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక వ్యవహారాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆకస్మికంగా ధనలాభం ఉండొచ్చు. వైవాహిక జీవితంలో ఆనందం మీ సొంతం. పెండింగ్ లో ఉన్న కోర్టు పనులు ఈ రోజు పూర్తవుతాయి. కొత్త ప్రాజెక్ట్‌లు ప్రారంభించాలంటే ఓసారి ఆలోచించండి.
తుల
ఉద్యోగ, వ్యాపారాలకు అనుకూలమైన సమయం. మీరు మీ విజయాలకు తగిన ప్రతిఫలాన్ని పొందుతారు. వృద్ధి చెందేందుకు బలమైన సంకేతాలుంటాయి. మీ నెట్ వర్క్ పెరుగుతుంది.ఉద్యోగులకు ఉన్నతాధికారుల సహకారం ఉంటుంది. సహోద్యోగులతో సత్సంబంధాలు ఏర్పరుచుకోండి.
వృశ్చికం
ఎప్పటి నుంచో అనుకున్న పని ఈ రోజు పూర్తవుతుంది. మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కార్యాలయంలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. ప్రేమికులు తమ మనసులో మాటను వ్యక్తం చేయొచ్చు.
ధనుస్సు
మీ భాగస్వామి కోసం ప్రత్యేకంగా ఏదైనా ప్లాన్ చేస్తారు. ఉద్యోగం మారాలి అనుకుంటే ఇదే మంచిసమయం. వ్యాపారంలో కొత్త ఒప్పందంపై సంతకం చేయవచ్చు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ప్రయాణాల్లో జాగ్రత్త వహించండి. ఆహారాన్ని మితంగా తీసుకోండి.
Also Read: వరలక్ష్మీ వ్రతం ఎప్పుడు చేసుకోవాలి!
మకరం
మీకు అదృష్టం కలిసొస్తుంది. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. డబ్బు వృధాను తగ్గించండి. మీరు తలపెట్టే పనిలో జీవిత భాగస్వామి మద్దతు లభిస్తుంది. ఏదైనా పోటీ పరీక్షకు సిద్ధమయ్యే విద్యార్థులు మరింత కష్టపడాలి.
కుంభం
ఈ రోజు మీరు మీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరచుకోవడానికి ప్రయత్నిస్తారు. డబ్బు గురించి ఆలోచించండ వల్ల కొంత ఇబ్బంది పడతారు.సమయానికి చేతిలో మనీ ఉండక అనుకున్న పనులు ఆలస్యం అవుతాయి. కార్యాలయంలో అందరితో మంచిగా ప్రవర్తించండి. ఈరోజు మీ చిన్ననాటి స్నేహితుడిని కలుస్తారు.
మీనం
ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. ఎవ్వరికీ ఎలాంటి వాగ్ధానాలు చేయొద్దు. అవసరం అయినవారికి సహాయం చేస్తారు. సవాలుతో కూడిన సమస్యను అధిగమిస్తారు. మీ ప్రియమైన వారి సలహా తీసుకోండి. జీవిత భాగస్వామితో సౌకర్యవంతమైన రోజు గడపండి.
Also Read:Also Read: గురుగ్రహం తిరోగమనం, నాలుగు నెలల పాటూ ఈ రాశులవారికి ధనం, కీర్తి