Horoscope Today 16th June 2022: ధనస్సులో చంద్రుడు, కుంభంలో శని, మిథునంలో సూర్యుడు-ఈ రోజు ఏ రాశివారికి ఎలా ఉందో తెలుసుకోండి!
Horoscope 16th June 2022:ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి
2022 జూన్ 16 గురువారం రాశిఫలాలు
చంద్రుడు ధనుస్సు రాశిలో ఉన్నాడు. శని కుంభరాశిలో ఉన్నాడు. గురు స్వరాశి మీనరాశిలో ఉన్నారు. సూర్యుడు మిథునరాశిలో ప్రవేశించాడు. ఈ రోజు ధనుస్సు, కన్య రాశి వారు వ్యాపారంలో విజయం సాధిస్తారు. మేషం, తుల రాశికి చెందిన సాంకేతిక, నిర్వహణ రంగాల విద్యార్థులకు ఉద్యోగంలో కొత్త అవకాశాలు లభిస్తాయి. మీన రాశి వారు వాహనం నడపడం పట్ల అజాగ్రత్తగా ఉండకూడదు. మరి ఏ రాశివారికి ఈరోజు ఎలా ఉందో పూర్తివివరాలు తెలుసుకుందాం..
మేషం
ఈ రోజు మీ ఆర్థిక పరిస్థితి బావుంటుంది. ఆధ్యాత్మిక విషయాలపై ఆసక్తి పెరుగుతుంది. కార్యాలయంలో ఆహ్లాదకరంగా ఉంటుంది. విద్యార్థులకు ప్రయోజనం ఉంటుంది. తెలుపు, పసుపు రంగులు మీకు కలిసొస్తాయి.
వృషభం
అష్టమ శని ఉన్నప్పటికీ వ్యాపారం బాగానే సాగుతుంది.ధనం చేతికందుతుంది. చంద్రుడు, శని కారణంగా ఆరోగ్యం అంతగా బావోదు. మీ మాటతీరు మెచ్చుకోలుగా ఉంటుంది. ఆకుపచ్చ, ఆకాశం రంగు మీకు కలిసొస్తాయి.
మిథునం
మీ రాశిలో బృహస్పతి మరియు చంద్రుడి సంచారం వల్ల ఉద్యోగంలో పురోగతి ఉంటుంది. ప్రయాణాలకు సంబంధించిన ఏ నిర్ణయమైనా జాగ్రత్తగా తీసుకోండి. ఆకుపచ్చ , ఊదా రంగులు కలిసొస్తాయి. వైవాహిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది.
Also Read: శని తిరోగమనం, ఈ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలి
కర్కాటకం
ఈ రోజు వ్యాపారంలో విజయం సాధించే సమయం. విద్యార్థులు తమ కెరీర్‌లో గందరగోళానికి గురవుతారు. తెలుపు, ఎరుపు రంగులు మంచివి. శ్రీ మహా విష్ణువును పూజించండి. పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.
సింహం
సూర్యుడు పదకొండో స్థానంలో సంచరించడం వల్ల మీకు ప్రతి పనిలోనూ విజయం లభిస్తుంది. ధనం చేతికందుతుంది. వ్యాపారంలో కొత్త అవకాశాలు లాభిస్తాయి. పసుపు, ఎరుపు రంగులు మీకు మంచివి. శ్రీ సూక్తం చదవండి, గోధుమలు దానం చేయండి.
కన్య
పదో స్థానంలో సూర్యుడు, నాలుగో స్థానంలో చంద్రుడు, సప్తమంలో గురుడు వల్ల మీకు అంతా శభకరంగా ఉంటుంది.
వ్యాపారంలో పురోగతితో మీరు సంతోషంగా ఉంటారు. శుక్రుడి సంచారం వల్ల బ్యాంకింగ్ ఉద్యోగాల్లో విజయం సాధిస్తారు. తండ్రి ఆశీస్సులు తీసుకోండి. ఆర్థిక లాభాలు సాధ్యమే. వినాయకుడిని పూజించండి. ఆరెంజ్, స్కై బ్లూ మీకు కలిసొచ్చే రంగులు.
తులా
వ్యాపారంలో పురోగతితో ఆనందంగా ఉంటుంది.విద్యార్థులు పోటీపరీక్ష్లలో సక్సెస్ అవుతారు. ఆర్థిక ఆనందం కోసం కనకధార స్తోత్రాన్ని పఠించండి. ఈ రోజు మీ జీవిత భాగస్వామి యొక్క మద్దతు మీలో ధైర్యాన్ని పెంచుతుంది. మీకు కలిసొచ్చే రంగులు తెలుపు, ఆకుపచ్చ. కిష్కింధాకాండ పారాయణం చేయండి.
వృశ్చికం
ఈ రోజు ఉద్యోగులకు అంతా శుభసమయం. నువ్వులు దానం చేయండి. వైవాహిక జీవితంలో నమ్మకాన్ని నిలబెట్టుకోండి. భూములు కొనుగోలు చేసే సూచనలున్నాయి. సూర్యారాధన చేయండి. వైలెట్, స్కై బ్లూ శుభప్రదం
Also Read: ఆరోగ్యం, ఆనందం, ఆదాయం-జూన్ నెలలో ఈ రాశులవారికి అద్భుతంగా ఉంది
ధనుస్సు
ఈ రాశిలో బృహస్పతి, మిధునరాశిలో సూర్యుడు ఉన్నారు. వ్యాపారంలో ఏదైనా మార్పు గురించి మీరు శుభవార్త అందుకుంటారు. విద్యార్థులు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోకతప్పదు. ప్రేమికులు సంతోషంగా ఉంటారు. తెలుపు, నీలం రంగులు మీకు మంచివి.
మకరం
ఈ రాశి నుంచి చంద్రుడు పెన్నెండో స్థానంలో , శని రెండో స్థానంలో ఉండడంతో ఆర్థిక ప్రయోజనాలుంటాయి. తల్లిదండ్రుల ఆశీర్వచనాలు మీపై ఉంటాయి. మతపరమైన ఆచారాలు ఫాలో అవుతారు. ఆరెంజ్, ఊదారంగులు మీకు కలిసొస్తాయి.
కుంభం
ఈ రాశికి చెందిన రాజకీయ నాయకులకు మంచి రోజు. ఉద్యోగులకు కార్యాలయంలో పని ఒత్తిడి తగ్గుతుంది.వ్యాపారులకు, విద్యార్థులకు సాధారణంగా ఉంటుంది. నిర్ణయాలు తీసుకోవడంలో అసలత్వం వద్దు. వైలెట్, నీలం మీకు కలిసొస్తాయి.
మీనం
శుక్రుడు,బుధుడు సంచారం వల్ల ధనలాభం ఉంటుంది. కుటుంబ పనుల్లో బిజీగా ఉంటారు. రాజకీయ నాయకులకు కలిసొచ్చే రోజు. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఎరుపు, పసుపు మీకు కలిసొచ్చే రంగులు.
Also Read: జూన్ నెలలో ఈ ఆరు రాశులవారికి గ్రహస్థితి అంత అనుకూలంగా లేదు