అన్వేషించండి

Horoscope 1 August 2022 Rashifal :ఈ 5 రాశులవారిపై శివానుగ్రహం ఉంటుంది, కనకవర్షం కురుస్తుంది

Horoscope 1 August : ఆయా రాశిలో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా కూడా మారుతాయి. పూర్తి వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్య పండితులను సంప్రదించగలరు

Horoscope 1 August 2022

మేషం
ఈ రాశికి చెందిన వ్యక్తులకు గౌరవం పెరుగుతుంది. వినయ స్వభావంతో అందర్నీ ఆకట్టుకుంటారు. ప్రతి విషయంలోనూ విజయం సాధిస్తారు. వ్యాపారులు, ఉద్యోగులు, విద్యార్థులకు శుభసమయం. న్యాయసంబంధిత వ్యవహారాలు కలిసొస్తాయి. ప్రేమ సంబంధాలు అంతగా కలసిరావు. జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయంలో టెన్షన్ పడతారు.

వృషభం
ఈ రాశివారి జీవితంలో కొత్త సంఘటన జరుగుతుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. మీ మనసులో ఉన్న ప్రేమను వ్యక్తం చేసేందుకు ఇదే మంచి సమయం.మిమ్మల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్న విజయం మీకు చేరువలో ఉంది కాస్త ఓపిక పట్టండి. ఆరోగ్యం బాగానే ఉంటుంది.

మిథునం
ఆర్థికంగా బావుంటుంది. ఎవరికైనా ఇచ్చిన డబ్బు తిరిగొస్తుంది. పాత విషయాల గురించి ఆలోచిస్తూ ఇబ్బంది పడతారు... స్నేహితులు లేదా బంధువులతో షేర్ చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుంది. అవసరమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. విదేశీ ప్రయాణాలు చేసేవారికి అనుకూల సమయం. కొన్ని అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెడతాయి.ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. ప్రేమ సంబంధాలకు అనుకూలంగా ఉంటుంది. 

Also Read: ఆగస్టు నెలలో ఈ రాశులవారికి వాహనప్రమాదం ఉంది జాగ్రత్త

కర్కాటకం
ఈ రాశికి చెందిన వారు ఈ రోజంతా బిజీగా ఉంటారు. ఆచరణాత్మక సమస్యలపై దృష్టి సారిస్తారు. లక్ష్యాలు నెరవేర్చే పనిలో ఉంటారు. పిల్లల విషయంలో నిర్లక్ష్యం వద్దు. ఆరోగ్యం బావుంటుంది. నిర్ణయాధికారం దెబ్బతింటుంది. జీవిత భాగస్వామిపై కోపంగా ఉంటారు.

సింహం
ఈ రోజు ఈ రాశి వారికి మానసిక ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బయటి ఆహారం తీసుకోవద్దు. దూరపు బంధువుల నుంచి విన్న వార్తల వల్ల ఆనందం రెట్టింపువుతుంది. కొత్త పనులు ప్రారంభించడంలో ఉత్సాహం ఉంటుంది. వ్యాపారులు లాభపడతారు. విదేశాలకు వెళ్లేందుకు అనకూల సమయం. మీ ఆదాయం పెరుగుతుంది. ఆరోగ్యం బావుంటుంది. 

కన్య
ఈ రాశికి చెందిన రచయితలు,కళాకారులకు  సమయం అనుకూలంగా ఉంది. సోదరుల మధ్య ప్రేమ పెరుగుతుంది. స్నేహితులతో సరదాగా గడపుతారు. ఆర్థిక పరిస్థితి బావుంటుంది. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. కోర్టు వ్యవహారాల్ల విజయం వరిస్తుంది. ఉద్యోగులకు బదిలీ కానీ, వేరే ఉద్యోగం కానీ వచ్చే అవకాశం ఉంటుంది. 

Also Read:  ఆగ‌స్టులో ఈ రాశులవారికి ధనలాభం, వాహనయోగం, గౌరవ మర్యాదలు

తుల
ఈ రాశికి చెందిన వారికి వ్యాపారంలో లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దూర ప్రాంతాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటారు. శారీరకంగా, మానసికంగా బలహీనంగా ఉంటారు. కుటుంబం కోసం ఖర్చు చేస్తారు. ఆరోగ్యం జాగ్రత్త. విద్యార్థులకు చదువు పట్ల ఆసక్తి పెరుగుతుంది.

వృశ్చికం
ఈ రోజు ఈ రాశికి చెందిన వారి ఆర్థిక పరిస్థితి బావుంటుంది. రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కుటుంబంతో సంతోష సమయం గడుపుతారు. మధ్యాహ్నం తర్వాత ఉద్యోగ, వ్యాపారాల్లో లాభం ఉంటుంది.అవసరం అయినవారికి సహాయం చేస్తారు. విదేశీ ప్రయాణాలకు అనుకూలమైన సమయం. ఉద్యోగులకు కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండండి. 

ధనస్సు
ఈ రాశి వారికి ఇంట్లో కుటుంబంతో విబేధాలు ఉండొచ్చు. శారీరక అసౌకర్యం, మానసిక ఆందోళన ఉంటుంది. పనుల్లో ఉత్సాహం పెరుగుతుంది. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. వినోదం కోసం డబ్బు వెచ్చిస్తారు.ఆర్థిక పరిస్థితి బావుంటుంది. 

Also Read: శ్రావణమాసం ప్రారంభమైంది, వరలక్ష్మీ వ్రతం ఇలా చేసుకోండి part-1

మకరం
ఈ రోజు కొత్త పనులు ప్రారంభించేందుకు అనుకూలమైన రోజు. అసంపూర్తిగా ఉన్న పనులు పూర్తవుతాయి.స్నేహితుల నుంచి బహుమతులు అందుకుంటారు. వ్యాపార రంగంలో కొత్త పరిచయాలతో భవిష్యత్తులో లాభపడతారు. కుటుంబ సభ్యులు, స్నేహితులతో సంతోషకరమైన క్షణాలు గడుపుతారు. ఆదాయం పెరిగే అవకాశాలున్నాయి. ఈ రాశి పిల్లల ఆరోగ్యం జాగ్రత్త. 

కుంభం
అనుకున్న పనులు ప్రణాళిక ప్రకారం పూర్తిచేయడంలో సక్సెస్ అవుతారు. అసంపూర్తిగా ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఏదైనా కొత్త పని ప్రారంభించేందుకు మంచి సమయం. ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. అనారోగ్య సమస్యలలతో ఇబ్బంది పడతారు.ఆస్తి కొనుగోలుకి మంచి సమయం.

మీనం
మీన రాశివారి జీవితంలో ఈ రోజు విచిత్రమైన సంఘటనలు జరుగుతాయి. ఇతరులకోసం చేయాల్సిన పనుల గురించి ఆలోచిస్తారు.బలం, ధైర్యం పెరుగుతుంది. స్నేహితులను, బంధువులను కలుస్తారు. ఆరోగ్యాన్ని మెరుగుపర్చుకునేందుకు ట్రై చేయండి. 

Also Read: గణపతి ఆరాధన అనంతరం వరలక్ష్మీ వ్రతం విధానం part-2

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

RCB Home Ground Sad Story IPL 2025 | సొంత మైదానంలోనే ఆర్సీబీకి షాకులుKL Rahul 93* vs RCB IPL 2025 | కేఎల్ రాహుల్ మాస్ ఇన్నింగ్స్ కు అసలు రీజన్ ఇదేKL Rahul Strong Statement | RCB vs DC మ్యాచ్ లో వీర విజృంభణ తర్వాత కేఎల్ రాహుల్ మాస్RCB vs DC Match Highlights IPL 2025 | ఆర్సీబీపై 6 వికెట్ల తేడాతో ఢిల్లీ జయభేరి | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Tamil Nadu Politics: మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
మళ్లీ ఎన్డీఏలోకి అన్నాడీఎంకే - విజయ్‌కు ఒంటరిపోరే గతి - తమిళనాడు రాజకీయాల్లో కీలక మార్పులు
KTR On HCU: హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
హెచ్‌సీయూ భూముల తాకట్టులో భారీ స్కాం - బీజేపీ ఎంపీ ప్రమేయం - కేటీఆర్ తీవ్ర ఆరోపణలు
YS Sharmila: భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
భారతి రెడ్డి మీద అసభ్యకర వ్యాఖ్యలు బాధాకరం, వాళ్లను ఉరితీసినా తప్పులేదన్న వైఎస్ షర్మిల
AP Inter Results 2025: ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
ఏపీ ఇంటర్ ఫలితాలపై మంత్రి నారా లోకేష్ కీలక ప్రకటన, రిజల్ట్స్ ఎప్పుడంటే
Hyderabad Traffic: హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌- శనివారం హనుమాన్‌ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ రూట్స్ ఇవే
హైదరాబాద్‌వాసులకు బిగ్‌ అలర్ట్‌- శనివారం హనుమాన్‌ విజయ యాత్ర సందర్భంగా ట్రాఫిక్ డైవర్షన్ రూట్స్ ఇవే
TamilNadu Minister: హిందూ దేవతల్ని ఘోరంగా అవమానించిన తమిళనాడు మంత్రి - దేవుళ్లంటే ఇంత అలుసా ? వీడియో
హిందూ దేవతల్ని ఘోరంగా అవమానించిన తమిళనాడు మంత్రి - దేవుళ్లంటే ఇంత అలుసా ? వీడియో
Hit and Run Case: హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
హైదరాబాద్‌లో హిట్ అండ్ రన్, బీఫార్మసీ విద్యార్థిని మృతి- నిందితుడ్ని చాకచక్యంగా పట్టుకున్న పోలీసులు
New OTT Releases: ఒకే రోజు ఓటీటీలోకి 4 హిట్ మూవీస్ - చూసి ఎంజాయ్ చేసెయ్యండి!
ఒకే రోజు ఓటీటీలోకి 4 హిట్ మూవీస్ - చూసి ఎంజాయ్ చేసెయ్యండి!
Embed widget