Holi 2022: ఓ రంగు శుభానికి, మరో రంగు ప్రేమకి, ఇంకో రంగు అనుబంధానికి- హోలీ రంగుల వెనుకున్న అంతరార్థం ఇదే
రంగుల కేళి, ఆనందాల హేళి హోలీ. వసంతాగమనానికి సూచికగా జరుపుకునే ఈ పండుగ రోజు చల్లుకునే ప్రతి రంగు వెనుకా అర్థం, పరామార్థం ఉంది...అవేంటో చూద్దాం...
పండుగంటే సంతోషం, ఉత్సాహం... యాంత్రికంగా సాగిపోయే జీవితాల్లో పండుగ ఒక ఆటవిడుపు. ముఖ్యంగా చిన్నా పెద్దా అందర్న ఏకంచేసి అందరిలోనూ ఆనందాన్ని నింపే హోలీ అంటే మరింత సంబరంగా జరుపుకుంటాం. వసంతరుతువు ఆగమనాననికి సూచికగా జరుపుకుంటాం. ఎందుకంటే ప్రకృతి కొత్త రంగులు నింపుకున్నట్టే మనం కూడా రంగులతో పండుగచేసుకుంటాం. మరి ఆ రంగుల వెనుకున్న ఆంతర్యం తెలుసా.
ఏ రంగు దేనికి ప్రతీక
పసుపు రంగు
పసుపు రంగు శుభానికి, శాంతికి, ఆనందానికి, శ్రేయస్సుకుప్రతీక. పసుపు రంగు లేకుండా హోలీ సెలబ్రేట్ చేసుకోవడంలో సంపూర్ణత ఉండదేమో అనిపిస్తుంది. ఎందుకంటే హిందువులకు పసుపు శుభానికి సంకేతం అందుకే శుభానికి సూచికగా పసుపు రంగు చల్లుకుంటారు.
ఎరుపు రంగు
ప్రేమ, అనుబంధం, సాన్నిహిత్యానికి సూచికగా భావించే ఎరుపు రంగును హోలీ సమయంలో వివాహిత మహిళలు నుదిటిన పెట్టుకుంటారు. పెళ్లికాని అమ్మాయిలు కూడా తమ ప్రియమైన వారితో నుదిటిన పెట్టించుకుంటారు. ప్ర రంగును హోలీలో వివాహిత మహిళలు నుదిటికి పెట్టుకుంటారు. అంతేకాదు ఈ హోలీలో పెళ్లికాని యువతులు తమ ప్రియమైన వారితో నుదిటిన పెట్టించుకుంటారు.
Also Read: హోలీ ఎందుకు జరుపుకోవాలి, ఈ సంప్రదాయం ఎప్పటినుంచి ఉంది
ఆకుపచ్చ రంగు
ఈ రంగు నూతన ప్రారంభాలకు, శ్రేయస్సుకు సూచికగా భావిస్తారు. పచ్చని పంటలను, సంతోషాన్ని, సంతృప్తిని సూచిస్తుంది. గ్రీన్ కలర్ ను దేవుళ్లకు కూడా సమర్పిస్తుంటారు.
నీలిరంగు
నీలిరంగు అంటే కన్నయ్య...కన్నయ్య అంటే నీలి రంగు అన్నట్టుంటుంది. శ్రీ కృష్ణుడికి దగ్గర రంగులో ఉండే నీలిరంగుని పురాణాల్లో ఆయనకు అంకితం ఇచ్చినట్టు ఉంటుంది. అందుకే కృష్ణుడు కొలువైన మధుర లాంటి ప్రదేశాల్లో హోలీ సెలబ్రేషన్స్ ఓ రేంజ్ లో ఉంటాయి. ఈ రంగు విశ్వాసం, ఆధ్యాత్మిక, సానుకూల శక్తికి సూచికగా భావిస్తారు.
గులాబీ రంగు
గులాబీ రంగు..అదేనండీ పింక్ ...ఈ కలర్ నచ్చని అమ్మాయిలు ఉండరేమో. చిన్న పిల్లలకైతే ఇది మోస్ట్ ఫేవరేట్ కలర్. తమ ఆనందాన్ని తెలియజేసేందుకు ఈ రంగు ఉపయోగిస్తారు. స్నేహానికి ప్రతీకగా కూడా ఈ రంగుని చల్లుకుంటారు.
నారింజపండు రంగు
నారింజ ( ఆరెంజ్) ఇది సానుకూలతకు ప్రతీక. ఈ రంగుని కేవలం తమ ప్రియమైన వారిపై మాత్రమే చల్లుతారు. ఈ రంగు ఆధ్యాత్మికతకు ప్రతీక అని విశ్వసిస్తారు.
Also Read: చితాభస్మంతో హోలీ సంబరాలు, అక్కడ పండుగ ప్రత్యేకతే వేరు
డిసంబరం రంగు
ఈ రంగు రాయల్టీకి ప్రతీకగా చెబుతారు. హోలీ సెలబ్రేషన్స్ లో మరింత కలర్ ను నింపుతుంది ఆకాశం రంగు.
ఇంకా ఎన్నో రంగుల మయమైన ఈ పండుగలా మీ అందరి జీవితాలు కూడా కలర్ ఫుల్ గా ఉండాలని ఆశిస్తోంది మీ ఏబీపీ దేశం.
Also Read: అక్కడ ఐదు రోజుల ముందుగానే హోలీ సంబరాలు