News
News
X

Holi 2022: హోలీ ఎందుకు జరుపుకోవాలి, ఈ సంప్రదాయం ఎప్పటినుంచి ఉంది

‘హోలీ’ ఆనందాల ‘డోలిక’ అంటారు. చిన్నా పెద్దా అంతా కలసి రంగులు చల్లుకుని ఉత్సాహంగా గడుపుతారు. ఇంతకీ హోలీ అంటే ఏంటీ... పురాణాల్లో ఈ పండుగ గురించి ఏం చెప్పారు..

FOLLOW US: 

మార్చి 18 శుక్రవారం హోలీ
దివాలీ తర్వాత దేశవ్యాప్తంగా సంబరంగా జరుపుకునే పండుగ 'హోలీ. ఉత్తర భారతదేశంలో రాక్షస పీడ తొలగిపోవడం కోసం హోలికా అనే శక్తిని ఆరాధిస్తారు. ఆ మర్నాడు బహుళ పాడ్యమి వసంతోత్సవం పేరుతో ఒకరి పై ఒకరు రంగులు చల్లుకొని సంబరాలు జరుపుకొంటారు. చతుర్దశి నాడు కాముని దహనం అనంతరం పాల్గుణ పౌర్ణమి నాడు వచ్చే హోలీ పండుగను భారత్‌లోనే కాకుండా నేపాల్‌, బంగ్లాదేశ్‌ దేశాల్లో కూడా వైభవంగా జరుపుకుంటారు. ఈ పండుగను సత్యయుగం నుంచి జరుపుకుంటున్నట్టు హిందూ పురాణాలు చెబుతున్నాయ్. సత్య యుగం అంటే ధర్మం నాలుగు పాదాలపైనా నడిచిన తొలియుగం అన్నమాట. సత్యయుగంలో హోలీ గురించి ఏం చెప్పారంటే 'హోలీ' అంటే అగ్ని లేదా అగ్నితో పునీతమైనది అని అర్థం. హోలీని ‘హోళికా పూర్ణిమగా కూడా వ్యవహరిస్తారు. ఏటా ఫాల్గుణ మాసంలో పౌర్ణమి రోజున వచ్చే ఈ పండుగను..హోలీ, కాముని పున్నమి, డోలికోత్సవం అని కూడా అంటారు. ఈ పండుగ గురించి పురాణాల్లో ప్రచారంలో ఉన్న గాథలేంటంటే...

హోలిక అనే రాక్షసి దహనమైన రోజు
రాక్షస రాజు హిరణ్యకశపుడి కుమారుడైన ప్రహ్లాదుడు నిత్యం విష్ణు మూర్తిని స్మరిస్తుంటాడు. అది గిట్టని హిరణ్యకశపుడు ప్రహ్లాదుడిని చంపాలని నిర్ణయించుకుని సోదరి హోళికను పిలుస్తాడు. ఆమెకు ఉన్న శక్తిని వినియోగించి ప్రహ్లాదుడిని మంటల్లో ఆహుతి చేయాలని కోరుతాడు. దీంతో ఆమె ప్రహ్లాదుడిని ఒడిలో కూర్చోబెట్టుకుని మంటల్లో దూకుతుంది. అయితే విష్ణుమాయతో ప్రహ్లాదుడు మంటల్లోంచి బయటపడగా...హోళిక మాడి మసైపోతుంది. అంటే హోలిక దహనమైన రోజునే ‘హోలీ’ అని పిలుస్తారనే ప్రచారం ఉంది. అందుకే కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళ ‘హోలిక’ దహనం నిర్వహిస్తారు.  హోలికా దహనం చూడడం మంచిదని భావిస్తారు. అయితే  కొత్తగా పెళ్లైన మహిళలు మాత్రం చూడకూడదంటారు. ఎందుకంటే హోలికా దహనం అంటే శరీరం అగ్నిలో కాలుతోంది- ఇంకా అర్థమయ్యేలా చెప్పాలంటే శవదహనం కదా..అందుకే కొత్తగా పెళ్లైన వాళ్లు చూస్తే వారి జీవితంలో బాధలు వెంటాడతాయంటారు. 

Also Read: ఇంట్లో ఆదిశగా దీపం పెడితే అన్నీ అపశకునాలే

రాత్రివేళ రాక్షసికి పూజలు
కృతయుగంలో రఘునాథుడనే సూర్యవంశపు మహారాజు వుండేవాడు. ఓ రోజు ప్రజలంతా వచ్చి ‘హోళిక’ అనే రాక్షసి తమ పిల్లలను బాధిస్తోందని మొరపెట్టుకుంటారు. ఆ సమయంలో అక్కడే ఉన్న నారద మహర్షి.. ఏటా ఫాల్గుణ పూర్ణిమ రోజు హోళికను పూజిస్తే బాధలు తొలగిపోతాయని తెలుపుతాడు. ఆ పూజలు పగటి వేళ చేస్తే కష్టాలు వస్తాయని, అంతా రాత్రివేళ నిర్వహించాలని వివరిస్తాడు. దీంతో అప్పటి నుంచి ‘హోలీ’ పూజలు నిర్వహిస్తున్నట్లు చెబుతారు.

హోలీ రోజు కామదహనం 
ఫాల్గుణ పౌర్ణమి రోజు కాముని పున్నమి పేరుతో సంబరాలు జరుపుకుంటారు. సతీవియోగంతో విరాగిగా మారిన పరమేశ్వరుడికి హిమవంతుని కుమార్తెగా జన్మించిన పార్వతితో వివాహం జరిపించాలని దేవతలు నిర్ణయిస్తారు. దీంతో పార్వతీదేవిపై పరమశివుడి దృష్టి నిలిచేలా చేయమని మన్మథుని సాయం తీసుకుంటారు. మన్మథుడు శివుడిపైకి పూల బాణాన్ని ప్రయోగించి, తపోభంగం కలిగిస్తాడు. తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన శివుడు మూడో కన్ను తెరిచి మన్మథున్ని భస్మం చేస్తాడు. అలా కోరికలు దహింపజేసిన రోజు కావడం వల్ల  హోలీ రోజు కామదహనం పేరుతో మన్మథుడి బొమ్మను గడ్డితో చేసి తగులబెడతారు.

హోలీ రోజు డోలోత్సవం
 శ్రీకృష్ణుడు గోపికలతో కలిసి బృందావనంలోని పువ్వులతో, రంగులతో ఈ ఉత్సవాన్ని జరుపుకున్నట్లుగా భావిస్తారు. ఇలా రంగులు, పూలు చల్లుకోవడం ద్వారా ప్రేమ, సౌభాగ్యాలు వెల్లివిరిస్తాయని నమ్ముతారు.

Also Read: చితాభస్మంతో హోలీ సంబరాలు, అక్కడ పండుగ ప్రత్యేకతే వేరు

డోలిక అంటే
డోలిక అంటే ఉయ్యాల అని అర్థం. బాలకృష్ణుడిని ఫాల్గుణ మాసం, పూర్ణిమ తిథిలో ఉయ్యాల్లో వేసినట్లు పురాణాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్‌లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతిమను ఊయలలో వేసి ‘డోలికోత్సవం’ జరుపుతారు. ఈ హోలి రోజున శ్రీకృష్ణుడు.. రాధను ఊయలలో కూర్చోబెట్టి ప్రేమగా రంగులు చల్లాడని చెబుతారు. 

శాస్త్రీయ కారణం
శాస్త్రీయ కారణం చెప్పుకుంటే వసంత కాలంలో వాతావరణం చలి నుంచి వేడికి మారుతుంది. దీనివల్ల వైరల్ ఫీవర్స్, జలుబు లాంటి వ్యాధులు ప్రబలుతాయి. కాబట్టి కొన్ని ఔషధ మొక్కల నుంచి తయారు చేసిన సహజమైన రంగులు కలిపిన నీటిని చల్లుకోవడం వల్ల ఈ వ్యాధుల వ్యాప్తి తగ్గుతుందనేది ఒక వాదన. కుంకుమ, పసుపు, బిల్వాలను ఉపయోగించి ఆయుర్వేద వైద్యులు ఔషధ వనమూలికలను తయారు చేస్తారు. తడి రంగుల కోసం, మోదుగ పువ్వుల్ని రాత్రంతా మరిగించి అవి పసుపు రంగులోకి మారేంత వరకు ఉంచుతారు, అది ఔషధ లక్షణాలు కలిగి ఉంటుంది. వాస్తవానికి ఇవి చల్లుకోవాలి కానీ ఇప్పుడు కృత్రిమ రంగులు చల్లుకుంటున్నారు..వీటివల్ల మంచి జరగకపోగా ఆరోగ్యానికి హానికరం కూడా....

Published at : 13 Mar 2022 06:39 AM (IST) Tags: sri krishna Spirituality holi 2022 khesari lal holi song 2022 khesari lal yadav holi 2022 bhojpuri holi 2022 holi stash 2022 neelkamal singh bhojpuri holi song 2022 2022 holi hil holi 2022 prahalada

సంబంధిత కథనాలు

Weekly Horoscope Telugu: మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఈ వారం జరగబోతోంది, ఆగస్టు 15 నుంచి 21 వరకు రాశిఫలాలు

Weekly Horoscope Telugu: మీ జీవితాన్ని మలుపు తిప్పే సంఘటన ఈ వారం జరగబోతోంది, ఆగస్టు 15 నుంచి 21 వరకు రాశిఫలాలు

Horoscope Today 15 August 2022: స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Horoscope Today  15 August 2022:  స్వాతంత్ర్య దినోత్సవం ఈ రాశులవారి జీవితంలో రంగులు నింపుతుంది, ఆగస్టు 15 రాశిఫలాలు

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Tirumala: తిరుమలకు పోటెత్తిన భక్తులు, శ్రీవారి దర్శనానికి అన్ని గంటలు వేచి చూడాలి: టీటీడీ

Horoscope Today, 14 August 2022: ఈ రాశులవారు స్టేటస్ కోసం ఖర్చుచేయడం మానుకోవాలి, ఆగస్టు 14 రాశిఫలాలు

Horoscope Today, 14 August 2022:  ఈ రాశులవారు స్టేటస్ కోసం ఖర్చుచేయడం మానుకోవాలి, ఆగస్టు 14 రాశిఫలాలు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

Tirumala Heavy Rush : తిరుమలలో భారీ రద్దీ, ఈ నెల 21 వరకు బ్రేక్ దర్శనాలు రద్దు

టాప్ స్టోరీస్

Independence Day 2022 Live Updates: విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలు - జెండా ఆవిష్కరించిన సీఎం జగన్

Independence Day 2022 Live Updates: విజయవాడలో స్వాతంత్య్ర వేడుకలు - జెండా ఆవిష్కరించిన సీఎం జగన్

Gaur Hari Das: స్వాతంత్య్ర సమరయోధుడిగా నిరూపించుకునేందుకు 32 ఏళ్లు పోరాడిన గౌర్ హరి దాస్

Gaur Hari Das: స్వాతంత్య్ర సమరయోధుడిగా నిరూపించుకునేందుకు 32 ఏళ్లు పోరాడిన గౌర్ హరి దాస్

Independence Day Google Doodle: ఇండిపెండెన్స్ డే సందర్భంగా గూగుల్ డూడుల్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా

Independence Day Google Doodle: ఇండిపెండెన్స్ డే సందర్భంగా గూగుల్ డూడుల్, దీని ప్రత్యేకత ఏంటో తెలుసా

Vijay Devarakonda : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ

Vijay Devarakonda : పూరి నాన్న, ఛార్మి అమ్మ - 'లైగర్' ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ