(Source: ECI/ABP News/ABP Majha)
Holi 2022: హోలీ రోజు మగాళ్లని చితక్కొట్టేయడమే అక్కడి వేడుక
హోలీ అంటే ఏంటి అన్నారనుకోండి..ఇకేముంది రంగులు చల్లుకోవడమే కదా అని సమాధానం చెబుతారు. కానీ అన్ని ప్రాంతాల్లో ఓ లెక్క అక్కడో లెక్క...అక్కడ హోలీ మామూలుగా ఉండదండోయ్. ఏకంగా కర్రలతో కొట్టుకుంటారు..ఎందుకిలా.
వసంతరుతువు ఆగమనంతో వచ్చే తొలి పండుగ హోలి. చెట్లు కొత్త చిగుళ్లు తొడుక్కుంటాయి. కోయిలలు కూస్తాయి. కొత్త కొత్త పూలు కనువిందు చేస్తాయి. ప్రపంచంలోని రంగులన్నీ కుప్పపోసినట్లుగా కోలాహలం చేసే రోజు. చిన్న-పెద్ద , ఆడ- మగ, కుల-మత బేధాలు లేకుండా అందరూ కలిసి జరుపుకునే హోలీ రోజు ఒకరిపై మరొకరు రకరకాల రంగులు చల్లుకుంటూ ఎంజాయ్ చేస్తుంటారు. దేశవ్యాప్తంగా ఉల్లాసంగా ఉత్సాహంగా జరుపుకునే హోలి పండుగలో రంగులు చల్లుకోవడం కామన్ అయినప్పటికీ ప్రాంతాన్ని బట్టీ సెలబ్రేషన్ మారుతుంది.
#World #Traditions such as the #Lathmar #Holi, #India's #carnival of #women ... #Batons and #colours: In the cities of #Barsana and #Nandgaon in the Indian state of #UttarPradesh, the #Hindu #festival of colours, Holi, is deliberat…https://t.co/pkWyoJ25s9 https://t.co/PEXldGsXPq
— H. Phillip PULVER (@HPPulver) March 14, 2022
Also Read: చితాభస్మంతో హోలీ సంబరాలు, అక్కడ పండుగ ప్రత్యేకతే వేరు
ఉత్తర ప్రదేశ్ రాష్ట్రం మధుర నుంచి 42 కిలోమీటర్ల దూరంలో ఉన్న బర్సానాలో హోలీ రోజుకంటే ముందే వేడుకలు ప్రారంభమవుతాయి. ఇక్కడ హోలీని విభిన్నంగా జరుపుకుంటారు. దీనినే లాత్ మార్ హోలీ అంటారు. హోలీ పండుగకు బర్సాన ప్రదేశం చాలా ప్రసిద్ధి. లాత్ మార్ హోలీలో కొన్ని వేల మంది సాక్షిగా స్త్రీలంతా కలసి పురుషులను కర్రలతో కొడతారు. మరోవైపు పురుషులు రెచ్చగొట్టే పాటలు పాడుతూ స్త్రీలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తారు. స్త్రీలు పురుషులను కర్రలతో వెంబడించి మరీ కొడుతుంటే...పురుషులు తమ వద్ద ఉన్న డాలుతో కాపాడుకునేందుకు ప్రయత్నిస్తారు. ఈ ఉత్సవాన్ని అన్ని గ్రామాలు కలసి ఉత్సాహాంగా జరుపుకుంటారు. నందిగాన్ లో కూడా హోలీ వేడుకలు ఇలాగే జరుపుకుంటారు.
Also Read:ప్రేమ వికసించి కామం దహనమైన రోజు - హోలీ అంటే రంగులు చల్లుకోవడమే అనుకుంటే ఎలా
( గతేడాది నందిగాన్ లో హోలీ వేడుకలు వీడియో ఇక్కడ చూడొచ్చు)
#Barsana women beat men from Nandgaon with wooden sticks during the celebrations of #Lathmar holi. #Mathura #Holi pic.twitter.com/zMgrCRohGE
— Anuja Jaiswal (@AnujaJaiswalTOI) March 23, 2021
Also Read: అక్కడ ఐదు రోజుల ముందుగానే హోలీ సంబరాలు