Hariyali Teej 2025: శ్రావణ శుక్రవారం, మంగళవారమే కాదు హరియాలి తీజ్ కూడా విశేషమైనదే, ఈ 4 రాశుల స్త్రీలకు అదృష్టం కలసొస్తుంది.
Hariyali Teej 2025 Date and time: శ్రావణ శుక్రవారం, శ్రావణ మంగళవారం మాత్రమే కాదు ఈ నెలలో మూడో రోజు వచ్చే హరియాలి తీజ్ కూడా విశేషమైనది. ఈ రోజు ఏర్పడే యోగం ఈ 4 రాశుల స్త్రీలకు అదృష్టాన్నిస్తుంది..

Hariyali Teej 2025: హరియాలి అమావాస్య (ఆషాఢ అమావాస్య) జరిగిన 3 రోజుల తర్వాత వచ్చే తదియ ( శ్రావణమాసంలో మూడోరోజు) ను హరియాలి తీజ్ పండుగగా జరుపుకుంటారు. ఇది మహిళలకు చాలా ప్రత్యేకమైన పండుగ.
నిండు నూరేళ్ల సౌభాగ్యం కోసం మహిళలు జరుపుకునే ముఖ్యమైన పండుగే శ్రావణమాసంలో జరుపుకునే హరియాలీ తీజ్. ఈ ఫెస్టివల్ ను శ్రావణ మాసంలోని శుక్ల పక్షం మూడో రోడు జరుపుకుంటారు. అందుకే దీనిని శ్రావణ తీజ్ అని కూడా పిలుస్తారు. ఈ పండుగను ప్రధానంగా ఉత్తర భారత రాష్ట్రాలైన మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, జార్ఖండ్ లో జరుపుకుంటారు.
ఈ రోజున మహిళలు ఉపవాసం ఉండి గౌరీశంకరులను పూజిస్తారు. సంతోషకరమైన వైవాహిక జీవితాన్ని కోరుకుంటారు. అవివాహితులకు కూడా హరియాలి తీజ్ అత్యంత ముఖ్యమైన రోజు అని చెబుతారు పండితులు. ఈ రోజు ఆదిదంపతులను పూజిస్తే వివాహానికి ఉండే అడ్డంకులు తొలగిపోయి ఉత్తమ జీవిత భాగస్వామిని పొందుతారని నమ్మకం. ఈ రోజు ఆకుపచ్చని దుస్తులు, గాజులు ధరిస్తారు.
ఈ ఏడాది హరియాలి తీజ్ జూలై 27 ఆదివారం వచ్చింది.
మతపరమైన అంశాలతో పాటు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా ఈ రోజు ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ఎందుకంటే ఈసారి హరియాలి తీజ్‌పై మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతోంది, ఇది కొన్ని రాశిచక్ర గుర్తుల స్త్రీలకు ఐశ్వర్యాన్నిస్తుంది. అవివాహితులకు ఉత్తమ భగాస్వామిని పొందే అదృష్టాన్ని తీసుకొస్తుంది.
మంగళుడు - చంద్రుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు మహాలక్ష్మి రాజయోగం ఏర్పడుతుంది.
హరియాలి తీజ్‌కు ఒక రోజు ముందు, జూలై 26 శనివారం మధ్యాహ్నం 3 గంటల 51 నిముషాలకు చంద్రుడు సింహ రాశిలోకి ప్రవేశిస్తాడు...ఇదే రాశిలో మంగళుడి సంచారం జరుగుతోంది. మంగళ-చంద్రుల కలయిక మహాలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది. ఈ యోగం ధనం, సంపద , ఐశ్వర్యానికి చిహ్నం. ఇది వ్యక్తిని ఆర్థికంగా బలంగా మారుస్తుందని నమ్ముతారు.
హరియాలి తీజ్ 2025 ఏ రాశి స్త్రీలకు శుభప్రదం
మేష రాశి (Aries )
మేష రాశి అవివాహితులకు వివాహానికి మంచి ప్రతిపాదనలు రావచ్చు. శివపార్వతుల అనుగ్రహంతో త్వరలో వివాహం కూడా జరగవచ్చు. కోరుకున్న జీవిత భాగస్వామితో వివాహానికి వస్తున్న అడ్డంకులు కూడా తొలగిపోతాయి. మంగళుడి ప్రభావంతో మీలో ధైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. మీ మాటను నెగ్గించుకోవడంలో విజయం సాధిస్తారు. ఈ సమయంలో మీరు కొత్త డీల్స్, భాగస్వామ్యాలు లేదా వ్యాపార విస్తరణకు మంచి అవకాశాలను పొందుతారు
మిథున రాశి (Gemini )
మిథున రాశి స్త్రీలకు హరియాలి తీజ్ సంబంధాలలో మాధుర్యాన్ని తెస్తుంది. భర్తతో విభేదాలు తొలగిపోతాయి. ప్రేమ పెరుగుతుంది. అలాగే మీకు మానసిక శాంతి లభిస్తుంది. ఆర్థికంగా ఈ పండుగ చాలా లాభదాయకంగా ఉంటుంది. పాత పెట్టుబడుల నుంచి డబ్బు వస్తుంది, లగ్జరీ పెరుగుతుంది. వ్యాపారంతో సంబంధం ఉన్న వ్యక్తులు లాభం పొందుతారు.
సింహ రాశి (Leo)
హరియాలి తీజ్‌పై మహాలక్ష్మి రాజయోగం సింహ రాశి వారికి వ్యాపారంలో ప్రయోజనం చేకూరుస్తుంది. వ్యాపారంలో మంచి పేరు తెచ్చుకుంటారు, ఇది గౌరవాన్ని పెంచుతుంది. కాంట్రాక్టులపై పనిచేసే స్త్రీలకు ఉద్యోగంలో మంచి అవకాశాలు లభిస్తాయి. అవివాహితులకు వివాహ సూచనలున్నాయి
గమనిక: జ్యోతిష్య శాస్త్ర పండితులు చెప్పినవి, పుస్తకాల నుంచి సేకరించి రాసిన వివరాలివి.. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఆయా రాశుల్లో ఫలితాలన్నీ ఒక్కరికే వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకంలో ఉండే గ్రహస్థితి ఆధారంగా ఫలితాలు మార్పులుంటాయి.






















