అన్వేషించండి

Guru Purnima Wishes 2023 : వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే - గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి

ఏబీపీ దేశం ప్రేక్షకులకు ముందుగా గురు పౌర్ణమి శుభాకాంక్షలు. లౌకిక, అలౌకిక, ఆధ్యాత్మిక.. ఏ రంగంలో అయినా నడిపించడానికి గురువు కావాలి. అలాంటి గురువులను స్మరించుకునే రోజే గురు పౌర్ణమి.

Guru Purnima Wishes 2023 : మహాభారతం, భాగవతంతోపాటు అష్టాదశ పురాణాలు సైతం వ్యాసుడి రచనలే. వేదాలను నాలుగు బాగాలుగా చేశాడు కాబట్టే వేదవ్యాసుడని పేరు వచ్చింది. వ్యాసుడు జన్మించిన రోజునే గురు పౌర్ణమిగా జరుపుకుంటున్నాం. అందుకే దీనికి వ్యాస పూర్ణిమ అని కూడా అంటారు. ఈ సందర్భంగా మీ  గరువులకు శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి...

గురు ప్రార్ధన
వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే!
నమోవై బ్రహ్మనిదయే వాసిష్టాయ నమో నమః!!
విష్ణు రూపుడైన వ్యాసునకు, వ్యాస రూపుడైన విష్ణువుకు నమస్కారం. హ్మ విద్యానిలయుండై శ్రీవాసిష్టుడనే వ్యాస భగవానునికి నమస్కారం..

Also Read: గురు పూర్ణిమ (జూలై 3) విశిష్టత ఏంటి, మత్స్య కన్యకి జన్మించిన వ్యాసుడు ఆదిగురువు ఎలా అయ్యాడు!
 
​గురువు విశిష్టత
గురుబ్రహ్మ గురుర్విష్ణు: గురుర్దేవో మహేశ్వర: 
గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ: 

‘న గురోరధికం తత్త్వం న గురోరధికం తపః
తత్త్వఙ్ఞానాత్పరం నాస్తి తస్మై శ్రీగురవే నమః’
అంటే గురువును మించిన తత్వం, తపస్సు, జ్ఞానం వేరొకటి లేవు
 
 గుకారశ్చాంధకారస్తు రుకార్తన్నిరోధకృత్‌
‘గు’ అంటే చీకటి.. ‘రు’ అంటే దానిని అడ్డగించువాడు. అజ్ఞానమనే చీకటిని తొలిగించే శక్తే గురువు.
 
 అజ్ఞాన తిమిరాంధస్య జ్ఞానాంజన శలాకయా
చక్షురున్మీలితం యేన తస్మై శ్రీగురవేనమః
అజ్ఞానమనే చీకటితో అంధులైనవారికి జ్ఞానమనే అంజనాన్ని పూసి, కన్నులు తెరిపించిన గురువుకు నమస్కారం అని దీని భావం.  

Also Read: జూలై నెలలో ఈ రాశులవారికి గ్రహస్థితి బావుంది, మీ రాశి ఉందా ఇందులో!

 అఖండ మండలాకారం వ్యాప్తం యేన చరాచరం |
తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః ||
అఖండ ప్రపంచాన్ని ఆకాశం లా వ్యాపించిన ఏ గురుతత్వమైతే 'తత్ 'అని పిలువబడే బ్రహ్మను దర్శింపజేసిందో,అట్టి శ్రీ గురువుకు నమస్కారము.

బ్రహ్మ  అందరినీ సృష్టిస్తారు -  గురువు మనలో మంచి గుణాన్ని పుట్టిస్తాడు 
విష్ణువు అందరినీ పోషిస్తాడు -  గురువు మనలో మంచి గుణాల్ని, మంచితనాన్ని పెంపొందిస్తాడు 
మహేశ్వరుడు అందరినీ లయము చేస్తాడు-  గురువు శివుని రూపంలో మనలోని చెడును దూరం చేస్తాడు
అందుకే గురువు... బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల కంటే ఎక్కువని అర్థం 

గురు సందేశం
వేదవ్యాసుడు తన రెండు చేతులనూ పైకెత్తి లోకమంతటికీ నమస్కరిస్తూ చెప్పిన మాటల్లో విశిష్టమైనది ఏంటంటే
'ఇతరులు మీ పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తే మీరు బాధపడతారో మీరు ఇతరుల పట్ల ఆ విధంగా ప్రవర్తించవద్దు.' పరమ ధర్మపథాలన్నింటిలోకీ పరాయణమైన ఈ ఒకే ఒక్క విషయాన్ని త్రికరణశుద్ధిగా పాటించినట్లయితే మన సమాజం కచ్చితంగా శాంతిధామమవుతుంది. 

గౌతమ బుద్ధుడు
విద్యార్థి నేర్చుకోవడానికి సంసిద్ధంగా ఉన్నప్పుడే ఉపాధ్యాయుడు ప్రత్యక్షమవుతాడు. మనలో నేర్చుకోవాలనే కుతూహలం కలిగితే చాలు.. తనకు వచ్చిన విజ్ఞానాన్నంతా నేర్పడానికి గురువు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. ఈ ప్రయత్నంలో విద్యార్థుల మస్తిష్కంలో పుట్టే ఎన్నో అనుమానాలను తనవిగా భావించి ఏ ఫలమూ ఆశించకుండా వాటిని నివృత్తి చేస్తాడు 

రమణ మహర్షి 
స్వపరభేదం లేనివాడు, ఏ భ్రాంతికి లోను కానివాడు, అహంకారాన్ని ఆమడ దూరంలో ఉంచేవాడు, ఏ పరిస్థితుల్లో మనోస్థ్యైర్యం కోల్పోక ఆత్మనిష్ఠతో ఉండేవాడే సద్గురువు. అలాంటి గురువుల బోధన విద్యార్థుల ఉన్నతికి దోహదం చేస్తుంది 

గురువంటే సచ్చిదానంద స్వరూపం. తాను పారదర్శకంగా ఉంటూ.. తనలోని విజ్ఞానాన్ని శిష్యుల్లోకి పరిపూర్ణంగా ప్రసరింపజేసేవాడే నిజమైన గురువు. నీరు పల్లమెరిగినట్టుగా.. గురువులోని విజ్ఞానం శిష్యుడికి చేరాలి. ఇందులో ఎలాంటి సంశయాలకు తావుండకూడదు - రామకృష్ణ పరమహంస

స్వామి వివేకానంద
నాకు అందరికంటే ఆత్మీయుడు గురువే. ఆ తర్వాతే అమ్మానాన్న. తండ్రి ‘ఇది చెయ్‌’ అని చెబుతాడు. అదే గురువైతే ఏం చేయకూడదో చెబుతాడు. తల్లిదండ్రులు జన్మనిస్తే.. గురువు పునర్జన్మనిస్తాడు. అందుకే గురువుకే తొలివందనం అర్పిస్తాను 

రవీంద్రనాథ్‌ ఠాగూర్‌
పిల్లలను బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దే క్రమంలో ఉపాధ్యాయుడిదే కీలక పాత్ర. ఇంతటి మహత్కార్యాన్ని విజయవంతంగా నిర్వర్తించే గురవు కలకాలం తలెత్తుకుని జీవించవచ్చు. ఇలాంటి గొప్ప అవకాశం మరెవరికీ దక్కదు 

జిడ్డు కృష్ణమూర్తి
సద్గురువు సాంగత్యంతోనే నిన్ను నీవు తెలుసుకోగలవు. ఎందుకంటే.. నిన్ను శిష్యుడిగా స్వీకరించిన క్షణంలోనే నీ గురించి ఆయనకు అవగతం అవుతుంది. నీలో మంచిని, చెడునూ గుర్తించగలడు. ఆ చెడును పారద్రోలి.. నిన్ను మంచివ్యక్తిగా మార్చగలిగేది గురువే 

ఓషో
ఒక వ్యక్తి జీవనయానం దిక్కుతోచని పరిస్థితుల్లో సాగుతోందంటే.. అతడికి సద్గురువు సాక్ష్యాత్కారం లభించలేదని అర్థం చేసుకోవచ్చు. మంచి ఉపాధ్యాయుడి అనుగ్రహం పొందిన వాడు గమ్యం దిశగా సాగిపోతుంటాడు. లక్ష్యాన్ని అందుకుని తీరుతాడు  

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

నేను బాగున్నా, చట్టాన్ని గౌరవిస్తా, రేవతి ఫ్యామిలీకి నేనెప్పుడూ అండగా ఉంటాప్రభుత్వం చేసిన పెద్ద కుట్ర, అల్లు అర్జున్ అరెస్ట్చంపుతరా.. చంపండి.. బన్నీ కోసం జైల్లోకి దూకిన ఫ్యాన్చంచల్ గూడ జైలుకి అల్లు అర్జున్ తరలింపు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Allu Arjun Issue: అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
అల్లు అర్జున్ ఇష్యూలో సీఎం రేవంత్ రిస్క్ చేశారా ? రాజకీయంగా ఆయనకు ఎంత నష్టం ?
Telangana News: శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
శనివారం సంక్షేమ హాస్టళ్లలో సీఎం, మంత్రుల ఆకస్మిక తనిఖీలు - ట్విస్ట్ ఏంటంటే!
Allu Arjun: భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
భోజనం లేకుండా నేలపైనే నిద్ర - అండర్ ట్రైల్ ఖైదీగా అల్లు అర్జున్
Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
CM Revanth Reddy: 'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
'సినీ స్టారా? పొలిటికల్ స్టారా? అనేది ప్రభుత్వం చూడదు' - అల్లు అర్జున్ ఘటనపై స్పందించిన సీఎం రేవంత్ రెడ్డి
2024 Flashback: గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
గ్రేట్ ఇయర్ - ఈ ఏడాది తండ్రులుగా మారిన క్రికెటర్లు వీరే!
Jagan For Arjun: అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
అర్జున్‌ను అరెస్టు చేయడం అన్యాయం - మద్దతుగా జగన్ సంచలన ట్వీట్
Ind Vs Aus Test Series: నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
నేటి నుంచే భారత్ - ఆసీస్ మూడో టెస్టు - టీమిండియాలో మార్పులు!
Embed widget