Guru Purnima 2023: గురు పూర్ణిమ నాడు ఈ 5 మంత్రాలు పఠిస్తే మీ దోషాలు తొలగిపోతాయి
Guru Purnima 2023: ఆషాఢ మాసంలోని పూర్ణిమను ఆషాఢ పూర్ణిమ లేదా గురు పూర్ణిమ అంటారు. గురు పూర్ణిమ నాడు ఈ 5 మంత్రాలను పఠించడం వలన మీకు గురు అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది.
![Guru Purnima 2023: గురు పూర్ణిమ నాడు ఈ 5 మంత్రాలు పఠిస్తే మీ దోషాలు తొలగిపోతాయి guru purnima 2023 on 3 july chant these 5 mantras on this day to come out from all doshas Guru Purnima 2023: గురు పూర్ణిమ నాడు ఈ 5 మంత్రాలు పఠిస్తే మీ దోషాలు తొలగిపోతాయి](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/07/02/e295beaea08846153400cf505cd5eb261688316684880691_original.png?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Guru Purnima 2023: ఆషాఢ పూర్ణిమ వ్రతాన్ని గురు పూర్ణిమగా జరుపుకొంటారు. ఈసారి గురు పూర్ణిమ జూలై 3వ తేదీన జరుపుకొంటున్నారు. ఈ రోజు గురుపూజకు విశేష ప్రాధాన్యం ఉంది. మీకు ఎవరైనా గురువు ఉంటే, గురు పూర్ణిమ రోజున ఆయన నుంచి శ్రీగురు పాదుకా మంత్రాన్ని తీసుకోండి. కొన్ని కారణాల వల్ల గురువు మీతో లేకుంటే, లేదా మీకు గురువును కలిసే అవకాశం లేకుంటే, మీరు గురు పూర్ణిమ రోజున మీ గురువు చిత్రం లేదా పాదుకలను పూజించవచ్చు. గురు పూర్ణిమ రోజు మనం ఏ మంత్రాలను పఠించాలో చూద్దాం.
1. గురువు ప్రాధాన్యం
గురువు ప్రాముఖ్యత గురించి గ్రంధాలలో పేర్కొన్నారు- 'గురు బ్రహ్మ, గురు విష్ణు, గురు దేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరమం బ్రహ్మ, తస్మై శ్రీ గురవే నమః'. అంటే, ఓ గురువా, నువ్వు దేవతలతో సమానం. నీవే బ్రహ్మ, నీవే విష్ణువు, నీవే శివుడవు. నువ్వు కూడా భగవంతుడవు. అంటే ఓ గురువా, నువ్వే పరమాత్మవి, నేను నీకు నా ప్రణామాలు అర్పిస్తున్నాను.
గురు పూర్ణిమ నాడు గురువును ఆరాధించడం, ఆయన ఆశీస్సులు కోరడం వల్ల జీవితంలోని అన్ని అడ్డంకులు తొలగిపోతాయి. గురు పూర్ణిమ నాడు ఈ మంత్రాలను పఠించండి. ఇది మిమ్మల్ని అన్ని లోపాల నుంచి బయటపడేస్తుంది. గురువు ద్వారా పొందే జ్ఞానము వలన జీవితంలోని చీకటి తొలగిపోతుంది. అయితే గురువు అనుగ్రహం పొందడం అంత తేలికైన విషయం కాదు. మీరు ఈ 5 గురు మంత్రాలను పఠిస్తే మీకు తప్పకుండా గురువు అనుగ్రహం లభిస్తుంది. ఆ 5 మంత్రాలు ఏమిటో చూద్దాం.
2. గురువు అనుగ్రహం కోసం 5 మంత్రాలు
- ఓం గురుభ్యో నమః|
- ఓం గం గురుభ్యో నమః|
- ఓం పరమతత్త్వాయ నారాయణాయ గురుభ్యో నమః|
- ఓం వేదాహి
గురు దేవాయ విద్మహే
పరమ గురువు ధీమహి
తన్నౌః గురుః ప్రచోదయాత్|
- గురుబ్రహ్మ, గురువిష్ణు గురుదేవో మహేశ్వరః|
గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః||
3. గురువు లేకపోతే ఏం చేయాలి..?
గురు పూర్ణిమ రోజున గురువును ఆరాధించడం వల్ల మనకు అనంతమైన గురు వైభవం వస్తుంది. మీకు ఇప్పటి వరకు గురువు లేకుంటే లేదా మీరు ఎవరినీ గురువుగా భావించకపోతే, మీ లోపల ఉన్న చీకటిని పారద్రోలి, జ్ఞాన జ్యోతిని వెలిగించే అటువంటి గురువును కనుగొని, గురు పూర్ణిమ నాడు ఆ గురువును పూజించండి.
Also Read : వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే - గురు పౌర్ణమి శుభాకాంక్షలు ఇలా తెలియజేయండి
గురు పూర్ణిమ రోజున పై 5 గురు మంత్రాలను పఠించడం వలన మీకు గురువు అపారమైన అనుగ్రహం లభిస్తుంది. మీరు ఈ మంత్రాలను గురువు ఉన్నా లేకపోయినా పఠించవచ్చు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)