Good Friday 2024 Date: గుడ్ ఫ్రైడే ఎప్పుడు , ఆంతర్యం ఏంటి - ఈ రోజు శుభాకాంక్షలు ఎందుకు చెప్పరు!
Good Friday 2024: ఈ ఏడాది గుడ్ ఫ్రైడే ఎప్పుడొచ్చింది? ఇంతకీ గుడ్ ఫ్రైడే ఎందుకు జరుపుకుంటారు? ఈరోజు శుభాకాంక్షలు చెప్పకూడదు అని ఎందుకంటారు?
Good Friday 2024: క్రిస్టియన్స్ జరుపుకునే ముఖ్యమైన వేడుకల్లో గుడ్ ఫ్రైడే ఒకటి. క్రైస్తవులకు 3 వేడుకలు చాలా ముఖ్యం
క్రిస్మస్
ఇది క్రీస్తు జననానికి సంబంధించిన వేడుక
గుడ్ ఫ్రైడ్
ఇది క్రీస్తు మరణానికి సంబంధించిన వేడుక
ఈస్టర్
మరణించిన ఏసు క్రీస్తు పునరుత్థానం పొందిన రోజు
ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవులు నిర్వహించే ప్రధాన వేడుకలు ఈ మూడు.. వీటిలో క్రిస్మస్, ఈస్టర్ రెండూ సంతోషంగా జరుపుకునే వేడుకలు అందుకే శుభాకాంక్షలు తెలియజేస్తారు. గుడ్ ఫ్రైడే మాత్రం క్రీస్తు మరణానికి సంబంధించిన వేడుక..అందుకే ఈ రోజు శుభాకాంక్షలు చెప్పుకోరు.
Also Read: శవాల బూడిదతో హోలీ సంబరాలు - ఇక్కడ వారం ముందు నుంచే సందడి మొదలు!
గుడ్ ఫ్రైడే కాదు గాడ్ ఫ్రైడే
భూలోకంలో ఆవిర్భవించిన ఏసు క్రీస్తు..ఈ లోకానికి ఏం అవసరమో బోధించాడు. కేవలం బోధనల ద్వారా అర్థంకాదేమో అని తానే స్వయంగా ఆచరించి చూపించాడు. ఇంకా అర్థం కానివారికి ఎన్నో అద్భుతాలు చేసి చూపించాడు. మహిమలు ఏవీ ప్రదర్శించకుండా సాదా సీదా వ్యక్తిలా ప్రాణాలు అర్పించాడు. అలా ప్రాణాలు అర్పించిన రోజే గుడ్ ఫ్రైడే. ఆ తర్వాత తనదైన సహజ దైవశక్తితో పునరుత్థానం పొందాడు...అదే ఈస్టర్. మరి ఏసు మరణిస్తే బ్యాడ్ ఫ్రైడ్ అవ్వాలి కానీ గుడ్ ఫ్రైడే ఎందుకంటారు అనే సందేహం వచ్చి ఉండొచ్చు...అయితే .. గుడ్ ఫ్రైడే తర్వాత వచ్చే ఆదివారం అంటే ఈస్టర్ రోజు క్రీస్తు పునరుత్థానం చెంది తన మహిమను లోకానికి చాటిచెప్పాడు. ఆయన త్యాగపూరిత మరణానికి కారణమైన రోజు కాబట్టే గుడ్ ఫ్రైడే అయింది. వాస్తవానికి ఇది గుడ్ ఫ్రైడే కాదు గాడ్ ఫ్రైడే...
Also Read: హోళీ రోజు రంగులెందుకు చల్లుకుంటారు, కొత్తగా పెళ్లైనవారికి ఈ విషయం తెలుసా!
శుభాకాంక్షలు ఎందుకు చెప్పరు?
అన్ని పండుగలకు విశెష్ చెప్పినట్టు గుడ్ ఫ్రైడే రోజు శుభాకాంక్షలు చెప్పరు. ఎందుకంటే ఇది ఆనందోత్సాహల మధ్య జరుపుకునే వేడుక కాదు. యేసుకు సంతాపాన్ని తెలియజేసే పవిత్ర దినం. అందుకే గుడ్ ఫ్రైడే వేడుకలు సంతోషంగా నిర్వహించరు. బైబిల్ ప్రకారం దేవుని బిడ్డ అయిన యేసును కొట్టి, శిలువ వేశారు. ఆయన శిలువపైన మరణించారు. పెద్ద అరుపుతో తుదిశ్వాస విడిచిపెట్టినప్పుడు లోకమంతా చీకటిగా మారిపోయిందని చెబుతారు. ఇదంతా శుక్రవారమే జరిగింది అంటారు. అందుకే గుడ్ ఫ్రైడే రోజు చర్చిని సందర్శించి ప్రార్థనలు చేస్తారు. ఉపవాసాలుంటాకు. ఇది యేసు జీవితంలోని చివరి ఘట్టం కాబట్టి... ‘పాషన్ ఆఫ్ జీసస్’ అని పిలుస్తారు.
Also Read: మొదటి 2 నెలలు మినహా క్రోధినామ సంవత్సరం ఈ రాశివారికి తిరుగులేదంతే!
ఓవరాల్ గా చెప్పుకుంటే గుడ్ ఫ్రైడే ఆంతర్యం ఏంటంటే...పాపభూయిష్టమైన మనిషి ప్రవర్తన త్యాగపూరితం కావాలి, ప్రేమ నిండి ఉండాలి, సేవచేయడంపై ఆసక్తి పెరగాలి, తమలో చెడు లక్షణాలను తొలగించుకుని పరిపూర్ణ మానవుడిగా పునరుత్థానం చెందాలి...ఏసు క్రీస్తు త్యాగానికి , గుడ్ ఫ్రైడేకి అదే అసలైన సార్థకత...
ఈ ఏడాది గుడ్ ఫ్రైడే మార్చి 29న వచ్చింది