![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Ganesh Chaturthi 2023: వినాయక చవితికి ఇలాంటి బొమ్మను తెచ్చుకోండి!
వినాయక చవితి పండుగ వచ్చేస్తోంది. ఎక్కడ చూసినా వినాయక విగ్రహాల సందడే. ఒక్కొక్కరికి ఒక్కో రంగు ఇష్టం.. కొందరైతే కేవలం మట్టి బొమ్మలే వినియోగిస్తారు. అయితే ఎలాంటి బొమ్మ తెచ్చుకోవాలో తెలుసా...
![Ganesh Chaturthi 2023: వినాయక చవితికి ఇలాంటి బొమ్మను తెచ్చుకోండి! Ganesh Chaturthi 2023: What kind of Ganesha to buy for vinayaka pooja, know in telugu Ganesh Chaturthi 2023: వినాయక చవితికి ఇలాంటి బొమ్మను తెచ్చుకోండి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/14/829540d3f187d21d1004267c27d4f28c1694679197064217_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Ganesh Chaturthi 2023: వినాయక చవితి రోజు భక్తులంతా తమ అభీష్టానికి అనుగుణంగా బొమ్మను కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చి పూజలు చేస్తారు. ఏ బొమ్మ అయితే ఏముంది..వినాయకుడే కదా అనుకోవచ్చు. నిజమే కానీ ఒక్కో రకమైన వినాయకుడిలో ఒక్కో ప్రత్యేకత ఉంది.. అవేంటో చూద్దాం...
తొండం ఎడమ వైపు ఉంటే
వినాయకుడి తొండం ఎడమ వైపు తిరిగి ఉన్నట్లుగా ఉండే విగ్రహాన్ని తీసుకొచ్చి పూజిస్తే ఆ ఇంట్లో ఉండే వాస్తు దోషాలు తొలగిపోతాయి. ఏపని మొదలెట్టినా విజయం పొంది తీరుతారు..
తొండం కుడివైపు ఉంటే
వినాయకుడి తొండం కుడి వైపు తిరిగి ఉండే విగ్రహాన్ని తీసుకొచ్చి పూజిస్తే కోరిన కోర్కెలు నెరవేరుతాయి.
తొండం మధ్యలో ఉంటే
వినాయకుడికి తొండం మధ్యలో ఉండే విగ్రహాలను ఇంట్లో పెట్టి పూజిస్తే దుష్టశక్తుల ప్రభావం తగ్గుతుందట. ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మాయమైపోతుందని చెబుతారు
తెలుపు రంగు
తెల్లని రంగులో ఉండే వినాయకుడిని పూజించే ఇంట్లో ప్రశాంతత ఉంటుంది. సాధారణంగా ఇంట్లో, దంపతులు లేదా కుటుంబ సభ్యుల మధ్య కలహాలు ఉంటే తెల్లని వినాయకుడి విగ్రహాలను పూజిస్తే ఆ కలహాలు అన్నీ తొలగిపోయి అందరూ సఖ్యతగా ఉంటారని చెబుతారు.
Also Read: వినాయక పూజ చేయడమే కాదు - ఆ రూపం నుంచి ఏం నేర్చుకోవాలో తెలుసా!
- రావి ఆకు రూపంలో ఉన్న వినాయకుడిని పూజిస్తే ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు తొలిగిపోతాయి
- వెండి గణేషుడిని పూజిస్తే పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి
- చెక్క రూపంలో ఉన్న గణేషున్ని పూజిస్తే ఆరోగ్యం మెరుగుపడుతుంది
- ఇత్తడి వినాయకుడిని పూజిస్తే సంతోషం పెరుగుతుంది
- మట్టి గణపతిని పూజిస్తే కెరీర్‌లో సక్సెస్ అవుతారు
విగ్రహం సైజ్ ఎంత ఉండాలి
మన ఇంట్లో నిత్యం చేసుకునే పూజకు బొటనవేలికి మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవాలి. వినాయక చవితి లాంటి పూజలు చేసేటప్పుడు మాత్రం అరచేతిని మించకుండా విగ్రహాలు ఉండేలా చూసుకోవడం మంచిది. ఎంతపెద్ద విగ్రహం ఉంటే ఆ విగ్రహం పరిమాణం ప్రకారంగా రోజూ ఆ స్థాయిలో ధూపదీప నైవేద్యములు జరగాలి. అందుకే ఇంట్లో చేసుకొనే పూజకు అరచేతికి మించకుండా విగ్రహం వాడటం మంచిది. సిద్ధివినాయక పూజలో మట్టి విగ్రహం గానీ, పంచలోహములతో చేసిన విగ్రహాలను మాత్రమే వాడాలి.
Also Read: ఓంకారేశ్వర్‌లో 108 అడుగుల ఆదిశంకరాచార్య విగ్రహావిష్కరణకు మూహూర్తం ఫిక్స్!
వినాయకుడి రూపాలు
వినాయకుడికి 32 రూపాలు ఉన్నాయి. వీటిలో 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనవిగా తాంత్రికులు పూజిస్తారని చెబుతారు. అందుకే ఈ 16 రూపాలు అత్యంత ప్రాధాన్యమైనవని చెబుతారు. 1. బాలగణపతి 2. తరుణ గణపతి 3. భక్త గణపతి 4. వీర గణపతి 5. శక్తిగణపతి 6. ద్విజ గణపతి 7. సిద్ధి గణపతి 8. ఉచ్ఛిష్ట గణపతి 9. విష్ణు గణపతి 10.క్షిప్త గణపతి, 11. హేరంభ గణపతి 12. లక్ష్మీగణపతి 13. మహాగణపతి 14. విజయ గణపతి 15. రుత్య గణపతి 16. ఊర్ధ్వ గణపతి
Also Read: శివుడికి పంచారామ క్షేత్రాల్లా గణేషుడికి అష్టవినాయక ఆలయాలు, వీటి విశిష్టత ఏంటంటే!
Disclaimer:ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను ధృవీకరించడం లేదని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)