వినాయకచవితి సెప్టెంబరు 18 or 19?



చవితి తిథి 18, 19 తేదీల్లో రెండు రోజుల్లోనూ ఉండ‌టంతో పండుగ నిర్వహణపై వివిధ వ‌ర్గాల్లో ఏ రోజు పండుగ చేసుకోవాల‌నే అనుమానాలు త‌లెత్తాయి.



ఏటా భాద్రపద శుద్ధ‌ చవితి రోజు వినాయక చవితి పండుగను దేశ‌మంతా జరుపుకుంటారు. ఈసారి సెప్టెంబరు 18, 19 తేదీల్లో రెండు రోజులూ చ‌వితి తిథి ఉంది.



సెలవుల జాబితాలో ఇప్పటికే 18వ తేదీని అధికారిక సెల‌వు దినంగా ప్రకటించింది.



వెయ్యేళ్ల‌ చరిత్ర ఉన్న స్వయంభు కాణిపాకం వరసిద్ధి వినాయకుడి దేవస్థానం కూడా చవితిని ఈ నెల 18వ తేదీనే జ‌రుపుకోవాల‌ని సూచించింది.



ఈ‌ సంవత్సరం భాద్రపద శుద్ధ చవితి 18వ తేదీ సోమవారం ఉదయం 10:15 నిమిషాల నుంచి మరుసటి రోజు ఉదయం 10:43 నిమిషాలు వరకూ ఉంటుంది



క‌థ‌లో చెప్పిన ప్ర‌కారం చ‌వితి తిథి 18వ తేదీ రాత్రి మాత్ర‌మే ఉంది. అందువ‌ల్లే ప్ర‌ముఖ పుణ్య‌క్షేత్రం కాణిపాకం ఆల‌యంలో బ్రహ్మోత్సవాలు ఈ నెల 18వ తేదీ నుంచి ప్రారంభం అవుతాయి.



వినాయకచవితి పండుగను ఈ నెల 18వ తేదీ సోమవారం రోజునే జరుపుకోవాలని తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఆచార్యుడు, ఆగమ పండితులు చెప్పారు



(Representational Images/Pixabay)


Thanks for Reading. UP NEXT

చాణక్య నీతి: మధురంగా మాట్లాడటం దానంతో సమానమా!

View next story