(Source: ECI/ABP News/ABP Majha)
Dussehra2024: దసరా వచ్చేస్తోంది.. ఇంట్లోకి దైవిక శక్తిని ఆహ్వానించేందుకు ఈ వాస్తు సూత్రాలు పాటించండి!
Durga Pooja 2024: చెడుపై మంచి విజయం సాధించినందుకు గుర్తుగా జరుపుకునేవే శరన్నవరాత్రి ఉత్సవాలు. దసరా పండుగ జరుపునే ముందు.. మీ ఇంట్లో వాస్తు పరంగా చేయాల్సిన మార్పులివే..
Durga Pooja 2024 Vastu Tips: శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుపుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇంటిని శుభ్రపరచడం మొదలు ప్రత్యేక పూజలు చేసేవరకూ ఇప్పటి నుంచి ఏర్పాట్లు ప్రారంభించేశారు. అయితే మీ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీ తొలగిపోయి..దైవిక శక్తిని ఆహ్వానించేందుకు, ఇంట్లో సానుకూలత మెరుగుపడేందుకు కొన్ని వాస్తు సూత్రాలు సూచించారు వాస్తు నిపుణులు.. అవేంటో చూద్దాం..
పాడైన వస్తువులు పారేయండి
ఇంటిని దుర్గాపూజకోసం సిద్ధం చేస్తున్నప్పుడు..శుభ్రపరచడంలో భాగంగా ఇంట్లో ఉండే చెత్తా చెదారం తొలగించండి. విరిగిన, పాడైన వస్తువులుంటే వాటిని బయటపడేయండి. విరిగిన, పగిలిన , ఉపయోగించని వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల నెగెటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుందని గుర్తించండి. పండుగ వేళ ఇంట్లో సానుకూల ప్రకంపనలు రావాలంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఇది.
పాడైన వస్తువులు పారేయండి
ఇంటిని దుర్గాపూజకోసం సిద్ధం చేస్తున్నప్పుడు..శుభ్రపరచడంలో భాగంగా ఇంట్లో ఉండే చెత్తా చెదారం తొలగించండి. అదే సమయంలో విరిగిన, పాడైన వస్తువులుంటే వాటిని వెంటనే బయటపడేయండి. విరిగిన, పగిలిన , ఉపయోగించని వస్తువులు ఇంట్లో ఉండడం వల్ల నెగెటివ్ ఎనర్జీ వ్యాప్తి చెందుతుందని గుర్తించండి. పండుగ వేళ ఇంట్లో సానుకూల ప్రకంపనలు రావాలంటే ముందుగా మీరు చేయాల్సిన పని ఇది.
నీటిలో ఉప్పు వేసి శుభ్రం చేయండి
అప్పట్లో అంటే ఇల్లంతా నీళ్లు పోసి కడిగేవారు..ఇప్పుడంతా తుడిచేయడమే. అయితే మీరు ఇల్లు తుడిచేందుకు వినియోగించిన నీటిలో ఫ్లోర్ క్లీనర్ తో పాటూ కొంచెం ఉప్పు వేయండి. నీటిలో ఉప్పు వేసి ఇంటిని శుభ్రం చేస్తే ప్రతికూల శక్తులు తొలగిపోతాయి. ఉప్పు అన్నాంకదా అని పౌడర్ కాదు రాళ్ల ఉప్పు వేయండి. ఇలా చేస్తే ఇంట్లోకి సానుకూల శక్తి ప్రసరిస్తుంది.
Also Read: అజాన్..నమాజ్ సమయంలో దుర్గాపూజ ఆపేయండి!
ధూపం
ఇంటిని నీటితో శుభ్రం చేసిన వెంటనే ఇల్లంతా ధూపం వేస్తే వాతావరణం ప్రశాంతంగా మారుతుంది...ఆధ్యాత్మికత సంతరించుకుంటుంది. ఇంల్లంతా ధూపం వేస్తే సానుకూల శక్తులకు ఆహ్వానం పలుకుతున్నట్టే. ఏ మూలో ఉన్న నెగెటివ్ ఎనర్జీ కూడా పూర్తిగా తొలగిపోతుంది. ముఖ్యంగా ఈశాన్య మూలలో ధూపం వేయండి...ఎందుకంటే వాస్తుపరంగా ఇది అత్యంత ప్రధానమైన ప్రదేశం..
పూలతో అలంకరణ
పూలు ప్రశాంతతని ఇస్తాయి..ఇంట్లో ఆహ్లాదకర వాతావరణాన్ని నింపుతాయి. అందుకే ఇల్లంతా పూలతో అలంకరించండి. తాజా పూలు సానుకూల పవనాలు వీచేలా చేస్తాయి. అందుకే అలంకరణ కోసం ఉపయోగించే పూలు మీలో ఆహ్లాదాన్ని నింపేలా ఉండాలి. వాడిపోయిన, ఎండిపోయిన పూలవల్ల నెగెటివ్ ఎనర్జీకి స్వాగతం పలుకుతున్నట్టే.
రంగోలి
ఇంటి ముందు ముగ్గు వేసి ఉందంటే..అది ధర్మబద్ధమైన నేల అని అర్థం. ఇంటిని శుభ్రం చేయడంలో మొదటగా అనుసరించాల్సింది ఇదే. ఇంటి ద్వారం దగ్గర అమ్మవారికి స్వాగతం పలుకుతూ బియ్యంపిండితో ముగ్గు వేయాలి.
సహజ కాంతి
ఇల్లంతా రంగురంగుల విద్యుత్ దీపాలతో నింపినా కానీ సహజంగా వచ్చే కాంతి ఇంట్లో పాజిటివ్ ఎనర్జీని నింపుతుంది. ఆరోగ్యకరమైన వాతావరణాన్ని సృష్టించేందుకు సహకరిస్తుంది. ముఖ్యంగా తూర్పు వైపు ఉండే కిటికీలకు ఎలాంటి అడ్డంకులు లేకుండా చూసుకోవాలి. ఉదయాన్నే సూర్య కిరణాలు ఇంట్లో పడుతున్నాయంటే ఆ ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి అవకాశం లేదు. ఇంట్లో కాంతిని రంగు రంగు కర్టెన్లు కాకుండా లేత రంగు కర్టెన్లు ఉపయోగించాలి.
కొవ్వొత్తులు వద్దు
పూజా స్థలాన్ని ప్రకాశంవంతం చేసేందుకు కొవ్వొత్తులు వినియోగించవద్దు.. దీపాలనే వెలిగించండి. నువ్వులనూనె, నెయ్యి, ఆవాలనూనెను ఉపయోగించండి. అవి స్వచ్ఛమైన సానుకూల శక్తిని వ్యాప్తి చెందేలా చేస్తాయి.
Also Read: దసరా నవరాత్రుల్లో పూజించాల్సిన నవ దుర్గలు - దేవీ కవచంలో ఉన్న అలంకారాలివి!
దుర్గమ్మను సరైన దిశలో ఉంచండి
పూజాగదిలో అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించేటప్పుడు వాస్తు ప్రకారం సరైన దిశను చూసుకోండి. పెద్ద పెద్ద విగ్రహాలు కాకుండా చిన్న బొమ్మను కానీ లేదంటే అమ్మవారి పటాన్ని కానీ ఉంచి కలశ పెట్టి పూజ చేసుకోవచ్చు. దేవుడి మందిరం దగ్గర అమ్మవారిని పెట్టేందుకు స్థలం అనువుగా లేకుంటే మరో ప్రదేశాన్ని ఎంపిక చేసుకోండి
పరిశుభ్రత
పూజా ప్రదేశాన్ని పరిశుభ్రంగా ఉంచండి. పూలు, కొబ్బరికాయలు, అక్షతలు, పసుపు, కుంకుమ, పూజా సామగ్రిని ఎలా అంటే అలా పడేయవద్దు. పూజ కోసం రాగి లేదా ఇత్తడి సామగ్రిని ఉపయోగించండి. పూజా ప్రదేశంలో ప్లాస్టిక్ ను నివారించండి.
Also Read: శరన్నవరాత్రులు ఎప్పటి నుంచి మొదలు.. దసరా ఏ రోజు వచ్చింది - ఇంద్రకీలాద్రిపై అమ్మవారి అలంకారాలివే!