Mahabharat: ప్రపంచంలోనే తొలి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరో తెలుసా? మహాభారతంలో ప్రస్తావన!
Mahabhat: ఈ మధ్య కాలంలో పెరుగుతున్న టెస్ట్ ట్యూబ్ బేబీ ప్రక్రియ ఇప్పటిది కాదు. ఇది మహాభారత కాలం నుంచే ఉంది. ప్రపంచంలో మొట్టమొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ ఎవరు? అతని గురించి మీకు ఏమైనా తెలుసా?
Mahabharat: మహాభారతంలో ఉన్న అనేకమంది ప్రముఖ పాత్రలకు సంబంధించిన పలు విభిన్న కథల గురించి మీకు తెలుసు. అయితే కొందరికి ఈ కథల గురించి అవగాహన ఉంటే, మరికొందరికి ఈ కథల గురించి తెలియదు. మహాభారతంలోని ఆదిపర్వంలో కౌరవుల గురువైన ద్రోణాచార్యుడి వివరాలు ఉన్నాయి. ఆయన తల్లిదండ్రుల కలయిక కారణంగా జన్మించలేదు. నేటి ఆధునిక యుగంలో 'టెస్ట్ ట్యూబ్' పద్ధతిగా ప్రాచుర్యం పొందిన విధానంలో జన్మించాడు. పాండవులు, కౌరవుల గురువైన ద్రోణాచార్యుడిని ప్రపంచంలోనే మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీగా పరిగణిస్తారు. మరి ద్రోణాచార్యుడి జననం ఎలా జరిగింది? ద్రోణాచార్యుడిని టెస్ట్ ట్యూబ్ బేబీ అని ఎందుకు అంటారో తెలుసుకుందాం.
ద్రోణాచార్యుడు మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీ
ద్రోణాచార్యుడిని ప్రపంచంలోనే మొదటి టెస్ట్ ట్యూబ్ బేబీగా పరిగణించవచ్చు. ఆయన జననానికి సంబంధించిన కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ద్రోణాచార్యుని తండ్రి భరద్వాజ మహర్షి, తల్లి ఘృతాచి అనే అప్సర. పురాణాల ప్రకారం, ద్రోణుడు నేటి డెహ్రాడూన్ నగరంలో జన్మించాడు. ఒక సాయంత్రం భరధ్వాజ మహర్షి గంగానదిలో స్నానానికి వెళ్లినప్పుడు, అక్కడ నదిలో స్నానం చేస్తున్న ఘృతాచి అనే అప్సరసను చూసి ఆమె అందానికి మంత్రముగ్ధుడయ్యాడు. ఈ క్రమంలో అప్రయత్నంగా వీర్య స్కలనం జరగడంతో, ఆ రేతస్సును ఆయన మట్టి కుండలో నిల్వ చేసి చీకటిలో ఉంచాడు. అలా కుండ నుంచి ద్రోణాచార్యుడు జన్మించాడు. 'ద్రోణం' అంటే కుండ. కుండ నుంచి పుట్టినవాడు కాబట్టి 'ద్రోణుడు' అయ్యాడు.
Mahabharat: ధర్మరాజు చెప్పిన అబద్ధం.. చరిత్రలో నిలిచిపోయింది.. ఇప్పటికీ అదే జరుగుతోంది..
ద్రోణాచార్యుడు చదువుకుంటున్న సమయంలో పరశురాముడు బ్రాహ్మణులకు సర్వదానం చేస్తున్నాడని తెలుసుకున్నాడు. ఆయన వద్దకు వెళ్లి తనను తాను పరిచయం చేసుకున్నాడు. ద్రోణాచార్యుడు పరశురాముడిని ఆయన వద్ద ఉన్న ఆయుధాలన్నీ ఇవ్వమని అడిగాడు. అంతేకాకుండా ఆ ఆయుధాలను ఎలా ఉపయోగించాలో కూడా నేర్చుకున్నాడు. ద్రోణాచార్యుడు అస్త్ర విద్యలో ప్రావీణ్యం సంపాదించడానికి ఇది కూడా ఒక ప్రధాన కారణం.
కురుక్షేత్ర యుద్ధంలో ఒకరినొకరు ఎదుర్కొన్న చాలా మంది యోధులకు ద్రోణాచార్యుడే గురువు. ఆయనకు పాండవులపైనే ఎక్కువ వాత్సల్యం ఉన్నా, కౌరవుల పక్షాన పోరాడవలసి వచ్చింది. యోధులందరిలో అత్యంత శక్తిమంతుడైన ఆయన వేలాది మంది పాండవ సైన్యాన్ని మట్టుబెట్టాడు. భీష్ముడు తీవ్రంగా గాయపడి అంపశయ్యపై నిద్రించిన తరువాత, ద్రోణాచార్యుడు ఐదు రోజుల పాటు కురు సైన్యానికి సర్వ సైన్యాధ్యక్షుడిగా వ్యవహరించాడు.
Vidur Niti in telugu: విదుర నీతి - ఈ 10 నియమాలు పాటిస్తే జీవితంలో బాధలే ఉండవు!
అశ్వత్థామ హతః కుంజరహః
పాండవ సైన్యాన్ని మట్టుపెడుతూ చెలరేగిపోతున్న ద్రోణాచార్యుడిని నిలువరించేందుకు శ్రీకృష్ణుడు ధర్మరాజుతో అబద్ధం చెప్పిస్తాడు. అశ్వత్థామ హతః అని ధర్మరాజుతో గట్టిగా పలికించిన కృష్ణుడు.. తర్వాత కుంజరహః అని పలికే సమయంలో భేరీలు మోగిస్తాడు. వాస్తవానికి అక్కడ చనిపోయింది ఓ ఏనుగు. ధర్మరాజు అబద్ధం చెప్పడు అనే ఉద్దేశంతో తనకు వినిపించిన అశ్వత్థామ హతః అనే మాట నమ్మిన ద్రోణుడు ... కొడుకు లేడనే బాధతో అస్త్ర సన్యాసం చేస్తాడు (అశ్వత్థామ చనిపోతే అస్త్ర సన్యాసం చేస్తానని ద్రోణుడు యుద్ధ ప్రారంభంలో ప్రతిజ్ఞ చేస్తాడు). ఇదే అదనుగా దృష్టద్యుమ్నుడు ద్రోణాచార్యుణ్ని అంతమొందిస్తాడు.
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.