నిజంగా 11:11కి కోరిన కోరికలు తీరుతాయా? మీకు ఈ పవిత్ర సంఖ్య గురించి తెలుసా?
11:11 లేదా 1111 అనే సంఖ్యకు ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత గురించి తెలుసుకుందాం.
న్యూమరాలజి లేదా సంఖ్యా శాస్త్రం జ్యోతిషంలో ఒక భాగం. న్యూమరాలజిలో అంకెలు, వాటితో ఏర్పడే సంఖ్యల ప్రాధాన్యతను, వాటి వెనుక దాగి ఉన్న పవిత్రతను గురించి వివరణలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అలాంటి ప్రత్యేక సంఖ్యల్లో కొన్నింటిలో 1111 ఒకటి.
గడియారంలో సమయం 11:11 చూపించినపుడు ఒక కోరిక కోరుకోండి అనే ఒక సామెత ఉంటుందని మీకు కూడా తెలుసా? ఇలా 11:11 సమయం చాలా శక్తివంతమైందని అంటుంటారు. ఈ సమయంలో మీరు కోరుకునే కోరికలన్నీ నిజమవుతాయని నమ్మకం. ఈ సమయానికి ఉన్న అంత ప్రత్యేకత ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
మరి ఇదంతా నిజమేనా?
గడియారంలో 11:11 సమయం జరుగుతున్నపుడు విశ్వశక్తి చాలా చురుకుగా ఉంటుంది. అందువల్ల ఎలాంటి మ్యానిఫెస్టేషన్ చేసిన కూడా అది ఫలిస్తుందట. ఈ సమయంలో చేసని సంకల్పానికి శక్తి వస్తుందని నమ్మకం. ఇది విశ్వశక్తి ఈ సమయానికి ఆధ్యాత్మిక ప్రాధాన్యత ఉంటుంది కనుక తప్పకుండా సంకల్పాలు నెరవేరుతాయి.
అలాగే నవంబర్ 11 తేది కూడా సంవత్సరంలో 11 వ నెలలోని 11వ రోజు. ఈరోజు కూడా చాలా అదృష్టాన్ని తెచ్చిపెట్టే రోజుగా భావిస్తారు. ఈరోజుకి కూడా ప్రతి కోరికను నిజం చేసే శక్తి ఉంటుందనే నమ్మకం ఉంది.
న్యూమరాలజీ ఎం చెబుతోంది?
కొంతమంది న్యూమరాలజిస్టులు నవంబర్ 11 లేదా 1111 అనేది ఒక దైవిక సంఖ్యగా భావిస్తారు. ఇలా పవిత్రమైన కొన్ని సంఖ్యలు వరుసక్రమంలో ఉంటాయని న్యూమరాలజి చెబుతోంది. ఈ సంఖ్యల్లో మూడు లేదా నాలుగు అంకేలు ఉంటాయి. కొన్ని వరుస క్రమంలో వస్తే మరికొన్ని ఒకే అంకే పునరావృతం అవుతూ ఉంటాయి. అలాంటి సంఖ్యలో 234, 1212, 777, 2222 కొన్ని. ఇవి దైవ సందేశాలను తెలిపేవిగా సంఖ్యాశాస్త్రం భావిస్తుంది. అంతేకాదు ఇవి జ్ఞానానికి, ఆధ్యాత్మిక మార్గదర్శనానికి సంకేతాలు కూడా.
అన్ని నాలుగు ఒకట్లు కలిగిన 1111 ఈ సంఖ్య కొత్త పనులు, ఆలోచనలకు నాంది వంటిది. ఈ సంఖ్య మీకు కనిపించింది అంటే మీరు సరైన మార్గంలోనే ఉన్నారనేందుకు లేదా మీ జీవితం సరైన మార్గంలో ప్రయాణం సాగించేందుకు సన్నద్ధం అవుతోందని అనేందుకు సంకేతంగా భావించవచ్చు. ఈ సంఖ్యను టైమ్ రూపంలో లేదా నంబర్ ప్లేట్ రూపంలో లేదా ఫోన్ నెంబర్ ఇలా ఏరూపంలో మీకు కనిపంచినా మీకు త్వరలో ఏదో గొప్ప మేలు జరగబోతోందని అర్థం. కనుక వెంటనే చెయ్యాలని అనుకుంటున్న పని చేసేందుకు ఇది మంచి తరుణంగా భావించి ముందుక సాగడం అవసరం.
మరి కొంత మంది పండితులు ఈ సంఖ్య మీ ఆత్మబలాన్ని పెంచుకోవాల్సిన సమయం అని మీకు విశ్వం నుంచి అందుతున్న సందేశంగా భావించాలని కూడా చెబుతున్నారు. ఈ సంఖ్య మీ సామర్థ్యాలను మీకు గుర్తు చేస్తున్నట్టు భావించాల్సి ఉంటుంది. మీ అంతరాత్మ, లేదా మీ సిక్త్స్ సెన్స్ మీకు అందిస్తున్న సూచనలను గమనించాల్సి ఉంటుందని అర్థం.
మరి ఈ సంఖ్య మీకు ఎక్కడైనా కనిపిస్తే అసలు నిర్లక్ష్యం చెయ్యకండి. విశ్వం మీకు పంపే సందేశంగా దీన్ని భావించి మీ ఆలోచనలను కార్యచరణలో పెట్టాలనేది న్యూమరాలజి సూచన.