Tulasi Plant: తులసి మొక్క దగ్గర ఈ వస్తువులు ఉంచుతున్నారా? అయితే, కష్టాలకు వెల్‌కమ్ చెప్పినట్లే!
ప్రతి రోజూ తులసి పూజ జరిగే ఇంటిలో ఆపదకు చోటుండదు, సంపదకు లోటుండదు అని ప్రతీతి. అందుకే తులసి మొక్కను ప్రత్యేక జాగ్రత్తలతో పెంచుకోవాల్సి ఉంటుంది.
హిందువులకు తులసి పవిత్రమైన మొక్క. సాక్షాత్తు లక్ష్మీ స్వరూపంగా కొలుచుకుంటారు. పండగలు, శుభకార్యాలు, ప్రతీ ప్రత్యేక సందర్భంలోనూ తప్పకుండా తులసికి ప్రత్యేకపూజలు నిర్వహిస్తారు. తులసి ధళాల మాలను శ్రీమహావిష్ణువుకు సమర్పిస్తారు. విష్ణుభక్తికి తులసి దళాలు ప్రతీక. ఎన్ని రకాల నైవేద్యాల నివేదించినా రాని ఫలితం విష్ణుమూర్తికి ఒక్క తులసి దళం సమర్పించి పొందవచ్చని శాస్త్రాలు చెబుతున్నాయి. రుక్మిణి శ్రీకృష్ణుని గెలుచుకున్నది కూడా కేవలం ఒక్క తులసీదళంతోనే. తులసి కోట ఉండే ప్రదేశం తీర్థ స్థలమని, గంగాతీరంతో సమానమైన పవిత్రత కలిగి ఉంటుందని పండితులు చెబుతారు. ఉదయం నిద్ర లేవగానే తులసీ దర్శనం చేసుకుంటే సమస్త తీర్థాలను దర్శించిన ఫలితం దక్కుతుందట. తులసిని నాటినా, రోజూ నీరు పోసినా, పోషించినా మోక్ష ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. తులసి మొక్క విషయంలో ఈ నియమాలు పాటించడం తప్పనిసరి.
- ద్వాదశి, అమావాస్య, పున్నమి తిథులలో, ఆది, మంగళ, గురు, శుక్రవారాలలో తులసి ఆకులను కొయ్యకూడదు. ఉత్తర, తూర్పు అభిముఖంగా నిలబడి మాత్రమే మూడు ఆకుల దళాలుగా మాత్రమే సేకరించాలి.
- రాత్రి వేళల్లో, స్నానం చెయ్యకుండా, పాదరక్షలతో ఉన్నపుడు తులసి మొక్కను తాకూడదు. తులసి మొక్కను తూర్పున లేదా ఈశాన్య దిక్కున నాటాలి. సూర్యరశ్మి తగిలే విధంగా ఉండాలి.
- తులసి మొక్క పెట్టుకునే చోట పరిసరాల్లో చెప్పులు ఉంచకూడదు. ఇలా ఉంచితే తులసికి మాత్రమే కాదు.. లక్ష్మీ అమ్మవారిని కూడా అవమానపరిచినట్టవుతుంది. తులసి మొక్క పరిసరాల్లో తప్పనిసరిగా పరిశుభ్రంగా ఉంచుకోవాలి.
- తులసి విష్ణు మూర్తికి అత్యంత ప్రీతికరం. అందుకే తులసి ఆరాధన చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. తులసి దగ్గర ఎప్పుడూ చీపురు పెట్టకూడదు. చీపురు పెడితే అటు విష్ణుమూర్తిని ఇటు లక్ష్మీ దేవిని ఇద్దరినీ అవమాన పరచినట్టవుతుంది. ఇది ఆర్థిక నష్టాలకు కారణం కావచ్చు.
- చాలా మంది తులసి మొక్క దగ్గర శివలింగం ఉంచుతుంటారు. అది చాలా తప్పు. తులసి పూర్వ జన్మలో జలంధరుడనే రాక్షసుడి భార్య వృంద. ఈ రాక్షసుని శివుడే వధించాడు. అందువల్ల ఎప్పుడూ కూడా శివలింగం దగ్గర తులసి దళాన్ని పెట్ట కూడదు.
- తులసి వంటి మహిమాన్విత మొక్కను ముళ్లు కలిగిన మొక్కలతో కలిపి ఉంచకూడదు. ఇది చాలా అశుభం. ఇలా ముళ్ల మొక్కల పరిసరాల్లో తులసి మొక్కను ఉంచితే అది కుటుంబ సభ్యుల మధ్య విబేధాలకు కారణం కావచ్చు.
- తులసి మొక్క పరిసరాల్లో చెత్ బుట్ట కూడా ఉండ కూడదు. ఇలా ఉంచితే ఇంట్లోకి నెగెటివ్ ఎనర్జీ చేరవచ్చు.
తులసి ఆధ్యాత్మిక సాధనకే కాదు, ఆరోగ్య రక్షకు కూడా ఉపయోగపడుతుంది. తులసి జ్వరానికి మంచి మందు. గొంతునొప్పికి తులసి ఆకులు వేసి ఉడికించి ఆ నీటిని పుక్కిట పడితే తగ్గిపోతుంది. పైత్యానికి కూడా తులసి రసం బాగా పనిచేస్తుంది. తులసి రసాన్ని తేనెతో కలిపి ఇస్తే చిటికెలో జ్వరం తగ్గిపోతుంది.
Also Read: మహాభారతం ప్రకారం విజయం, సంతోషం కోసం నిత్యం ఈ నాలుగు పాటించాలి