By: ABP Desam | Updated at : 08 May 2023 08:43 PM (IST)
Representational image/pixabay
వారంలోని ఏడు రోజులకు అధిదేవతలు ఉంటారు. ఆ రోజున ఆ ప్రత్యేక దేవతను ప్రత్యేకంగా పూజిస్తారు. శనివారనికి అధిదేవుడు శని. ఈ రోజున శని దేవుడిని ఆరాధించడం వల్ల భక్తులకు విశేష లాభాలు పొందవచ్చు. శని న్యాయం అందించే దేవుడు. పాప పుణ్యాల ఆధారంగా వారికి తగిన ఫలితాలు అందించే వాడు శని. జ్యోతిషం శనిని పాపగ్రహంగా అభివర్ణిస్తుంది. శని వారం రోజున కొన్ని వస్తువులను ఇంటికి తెచ్చుకోవడం, కొనుగోలు చెయ్యడం చెయ్యకూడదు. తెలిసీ తెలియక ఈ వస్తువులు శని వారం రోజున ఇంటికి తెచ్చుకుంటే దురదృష్టం వెంటాడుతుంది. అలా శనివారం నాడు ఎలాంటి వస్తువులు కొన కూడదో తెలుసుకుందాం.
శాస్త్రాన్ని అనుసరించి ఇనుముతో చేసిన వస్తువులు శనివారం కొనుగోలు చెయ్యకూడదు. ఇది శని కి కోపం కలిగించే విషయం. ఇలా ఇనుముతో చేసిన వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే దురదృష్టం వెంటాడుతుంది. ఒకవేళ తప్పనిసరై కొనుగోలు చేస్తే మాత్రం వాటిని ఇంటికి తీసుకురాకుండా చూసుకోవాలి.
శనివారం రోజున ఉప్పు కొనుగోలు చెయ్యకూడదు. శనివారం ఉప్పు కొంటే అప్పులు పెరుగుతాయని శాస్త్రం చెబుతోంది. క్రమంగా ఆర్థిక స్థితి దిగజారుతుంది. కనుక శనివారం ఎట్టిపరిస్థితుల్లో ఉప్పు కొనకూడదు.
శనివారం నల్ల నువ్వులు కొన కూడదు. ఈరోజున నల్లనువుల కొనడం వల్ల తలపెట్టిన పనులకు ఆటంకం కలుగుతుందని నమ్మకం. శని వారం రోజున నల్లనువ్వులు, ఆవనూనెతో పూజిస్తారు. అందువల్ల శనివారం నాడు నల్లనువ్వులు కొనకూడదు.
నల్ల రంగులో ఉండే చెప్పులు కూడా కొనకూడదు. శనివారం నల్లని చెప్పులు కొని వాటిని ధరిస్తే అది వైఫల్యానికి కారణం కావచ్చు.
శనివారం కత్తెర కొనడం, కత్తెర బహుమతిగా ఇవ్వడం అశుభం. ఇది కుటుంబంలో, బంధుమిత్రులతో తగాదాలకు కారణం కావచ్చు. కనుక శనివారం కత్తెర కొనకూడదు, ఎవరికీ బహూకరించకూడదు కూడా.
శనివారం అగ్గిపెట్టె, బొగ్గు, సూది, నల్లని మినుముల వంటి వస్తువులు కూడా కొనకూడదు. గుమ్మడి కాయ కూడా కొని ఇంటికి తెచ్చుకోకూడదు. తప్పనిసరిగా కోనాల్సి వస్తే శుక్రవారమే కొని తెచ్చుకోవాలి. లేదా ఆదివారం వరకు ఆగాలి.
శనివారం నాడు తల్లిదండ్రులు, వృద్ధులను, పనివారిని అవమాన పరచడం, వారి మనసు కష్ట పెట్టే విధంగా ప్రవర్తించడం చెయ్యకూడదు. జంతువులకు నష్టం కలిగే పనులు చెయ్యకూడదు. శనివారం నాడు చెప్పులు, బూట్లు ఎవరికీ ఇవ్వకూడదు. ఎవరి దగ్గర నుంచి తీసుకోవద్దు.
శని వారం మంచి ఫలితాల కోసం మినపప్పుతో చేసిన కిచిడి ఎవరికైనా దానం చేస్తే మంచిది. శనివారాల్లో రావి చెట్టు కింద దీపం వెలిగించి నాణెం ఆ దీపానికి సమర్పించాలి. శనివారం నాడు సూర్యాస్తమయం తర్వాత మాత్రమే శనికి దీపారాధన చెయ్యలి. సూర్యాస్తమయానికి ముందు శనిపూజ తగదు.
Also Read : ఇవి పర్సులో మీ పర్సులో ఉంటే సంక్షోభం తప్పదు
Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.
Mehandipur Balaji Temple: ఈ ఆలయం నుంచి వెళ్లిపోతూ వెనక్కు తిరిగి చూస్తే దయ్యాలు ఆవహిస్తాయట!
Saptamatrika: సప్త మాతృకలంటే ఎవరు - వాళ్లేం చేస్తారు!
Vidura Niti In Telugu: ఈ 5 గుణాలు మీకుంటే మీ జీవితం ఆనందమయం
Samudrik Shastra about Teeth : మీ దంతాల ఆకృతి మీ భవిష్యత్ చెప్పేస్తుంది!
ఆఫీసు డెస్క్ మీద ఇవి పెట్టుకుంటే మీ కెరీర్ పీక్స్‌లో ఉంటుంది
Sharwanand: సీఎం కేసీఆర్‌ను కలిసిన శర్వానంద్ - వెడ్డింగ్ రిసెప్షన్‌కు ఆహ్వానం
Ambati Rayudu : జగన్ ను కలిసిన అంబటి రాయుడు - వైసీపీలో చేరికకు ముహుర్తం ఖరారైనట్లేనా ?
CM Jagan Review: ప్రతి మండలానికి 2 జూనియర్ కాలేజీలు ఉండాల్సిందే - అధికారులకు సీఎం జగన్ ఆదేశాలు
Durgam Chinnaiah: బీఆర్ఎస్ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు షాక్! మహిళా కమిషన్ కీలక ఆదేశం