Friday Donts: శుక్రవారం పొరపాటున కూడా ఈ తప్పులు చేయకండి, లక్ష్మీదేవి ఆగ్రహానికి గురికాకండి
Friday Donts: శుక్రవారం రోజు కొన్ని పొరపాట్లు చేస్తే జీవితంలో చాలా సమస్యలు వస్తాయి. శుక్రవారం మనం చేయకూడని తప్పులు ఏంటో తెలుసా? మీరు మాత్రం ఈ పనులు చేయకండి.
Friday Donts: ప్రతిరోజు మనం ఏదో ఒక దేవుడిని పూజిస్తాం. పూజ కైంకర్యాలను నిర్వహిస్తాం. అదే విధంగా, శుక్రవారం లక్ష్మీదేవికి ప్రీతికరమైన రోజు. ఈ రోజు లక్ష్మీ దేవిని పూజించడం వల్ల ఇంట్లో ఎలాంటి లోటు లేకుండా ధన, ధాన్య వృద్ధి చెందుతుందని విశ్వాసం. శుక్రవారం లక్ష్మీ దేవిని పూజించడమే కాకుండా, ఉపవాసం కూడా పాటిస్తారు. లక్ష్మీదేవిని పూజించి, శుక్రవారాల్లో ఉపవాసం ఉండే వ్యక్తికి జీవితంలో ధన, ధాన్యాలకు కొరత ఉండదు. అయితే శుక్రవారాల్లో కొన్ని పనులు చేయకూడదని శాస్త్రం చెబుతోంది. మరి శుక్రవారం ఎలాంటి పనులు చేయకూడదో తెలుసా?
డబ్బుతో వ్యాపారం వద్దు
లక్ష్మీదేవిని సంపదలకు అధి దేవతగా భావిస్తారు. అలాంటప్పుడు, శుక్రవారం లక్ష్మీదేవికి సంబంధించిన కాబట్టి మనం డబ్బు లావాదేవీలు చేస్తే అంటే అప్పులు ఇవ్వడం లేదా తీసుకోవడం వల్ల ఆమెకు మనపై కోపం వస్తుంది. ఆమె కోపం వల్ల మనం జీవితాంతం ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనవలసి వస్తుంది.
తామస ఆహారం వద్దు
శుక్రవారం నాడు మాంసం, మద్యం వంటి ఆహార పదార్థాలు తీసుకోకూడదు. ఎందుకంటే, మాంసాన్ని తామసిక ఆహారంగా పరిగణిస్తే, మద్యాన్ని మత్తుగా పరిగణిస్తారు. ఈ రెండింటిని సేవించడం వల్ల మన మనస్సును పూజలో ఏకాగ్రతగా ఉంచుకోలేము. అందుకే ఈ రోజు మనం సాత్విక ఆహారాలు మాత్రమే తీసుకోవాలి. శుక్రవారం నాడు మాంసం, మద్యం సేవించడం వల్ల కుటుంబ సమస్యలు పెరుగుతాయి.
ఇతరులను అవమానించవద్దు
శుక్రవారం శాంతి దినం. ఈ రోజు మనం ఎంత ప్రశాంతంగా ఉంటామో, ఎంత మంచి ఆలోచనలు చేస్తే లక్ష్మీదేవి మనకు అంత దగ్గరవుతుంది. మీరు లక్ష్మీ దేవి అనుగ్రహం పొందాలంటే శుక్రవారం నాడు ఎవరినీ అవమానించకండి, ఎవరి గురించి చెడు ఆలోచనలు పెట్టుకోకండి.
తెల్లని పదార్థాన్ని ఎవరికీ ఇవ్వకండి
లక్ష్మీ దేవికి తెల్లటి రంగులంటే చాలా ఇష్టం. వాటిలో చక్కెర ఒకటి. ఈ కారణంగా శుక్రవారం ఎవరికీ పంచదార ఇవ్వకూడదు. శుక్రవారము పంచదార ఇవ్వడం వలన జాతకంలో శుక్రుని స్థానం బలహీనపడుతుంది. బలహీనమైన శుక్రుని స్థానం కారణంగా ఒక వ్యక్తి తన జీవితంలో పేదరికాన్ని అనుభవిస్తాడు. అతని ఆనందం, శ్రేయస్సు నాశనం అవుతుంది.
Also Read : శుక్రవారం ఈ 4 లక్ష్మీ మంత్రాలను పఠిస్తే ఐశ్వర్యం మీ సొంతం..!
ఇంటిని అపరిశుభ్రంగా ఉంచవద్దు
లక్ష్మీదేవి పరిశుభ్రతను ఇష్టపడే దేవత. దుమ్ము, ధూళి ఉన్న ప్రదేశంలో ఆమె ఉండదని శాస్త్రాలు చెబుతున్నాయి. శుక్రవారం నాడు తెల్లవారుజామున లేచి కాలకృత్యాలు పూర్తి చేసుకున్న తర్వాత ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడవడానికి ఉపయోగించే నీటిలో చిటికెడు రాళ్ల ఉప్పు వేసి శుభ్రం చేయాలి.