అన్వేషించండి

ఏప్రిల్ నెలలో చంద్రుడి ప్రభావం మీ రాశిపై, మీ మనసుపై ఎలా ఉంటందో తెలుసా?

వేద జ్యోతిష్యశాస్త్రంలో, చంద్రుడు మనస్సుకు సంబంధించినవాడు. ఏప్రిల్ నెలలో చంద్రుడు మొత్తం 19 సార్లు తన నక్షత్ర మండలాన్ని మార్చుకుంటాడు, దీని ప్రభావం మేషం నుంచి మీన రాశి వారిపై ఎలా ఉంటుందో తెలుసా?

మనఃకారకుడు అని చెప్పే చంద్రుడి ప్రభావం మనసుపై చాలా ఉంటుంది. అందుకే చంద్రుడి గోచారం చాలా ముఖ్యమైనది. అయితే మిగిలిన గ్రహాల్లా చంద్రుడు నెలకో రాశి మారడు..నిత్యం నక్షత్రాన్ని మార్చుతాడు. ఈ ప్రభావం వ్యక్తి మనస్సు, నిర్ణయాలు, ఆలోచనలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చంద్రుడు శుభ నక్షత్రంలో ఉన్నప్పుడు అది ఆర్థిక లాభం, విజయం కొత్త అవకాశాలను తెస్తుంది. చంద్రుని అశుభ స్థానం ఒత్తిడి, గందరగోళం , ఖర్చులకు సంబంధించిన సమస్యలకు కారణం కావచ్చు. ఏప్రిల్ 2026లో చంద్రుడు మొత్తం 19 సార్లు రాశులను మారుస్తాడు. నెల ప్రారంభంలో అది హస్త నక్షత్రంలో ఉండగా, ఏప్రిల్ 30న చిత్ర నక్షత్రంలో ఉంటుంది. ఈ నెల మేషం నుంచి మీన రాశి వారికి కొత్త అనుభవాలను అందిస్తుంది.

మేష రాశి

ఈ నెల మేష రాశి వారికి మంచిది. ఆర్థిక లాభాలు మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తాయి. ప్రభుత్వ పనులు పూర్తవుతాయి. వృత్తిపరమైన పురోగతికి పుష్కలమైన అవకాశాలు ఉంటాయి. ఈ సమయంలో ఉద్యోగ మార్పు ప్రయోజనకరంగా ఉండవచ్చు.  

వృషభ రాశి 

చంద్రుని సంచారం వృషభ రాశి వారికి సానుకూల ప్రభావాన్ని చూపుతుంది. ఈ సమయం మీకు ఆర్థికంగా బలంగా ఉంటుంది. కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి, ఇవి మీ ఆర్థిక పరిస్థితిని గణనీయంగా బలోపేతం చేస్తాయి. మీరు పనిలో గౌరవాన్ని, సంబంధంలో మీ భాగస్వామి నుంచి మద్దతును పొందుతారు. పెట్టుబడులు లాభాలను సూచిస్తాయి.

మిథున రాశి

ఏప్రిల్ నెల మిథున రాశి వారికి కొత్త అవకాశాలతో నిండి ఉంటుంది. వారి ఉద్యోగ, వ్యాపార రంగాలలో పురోగతి సాధ్యమవుతుంది. సంపద పెరుగుతుంది. ప్రేమ జీవితం సంతోషంగా ఉంటుంది. కష్టానికి మంచి ఫలితాలు లభిస్తాయి.

కర్కాటక రాశి

కర్కాటక రాశిలో జన్మించిన వారికి ఈ సమయం అస్థిరంగా ఉండవచ్చు. ఖర్చులు పెరగడంతో పాటు, పనిలో ఆటంకాలు ఎదురవ్వచ్చు. మానసిక ఒత్తిడికి లోనయ్యే అవకాశం ఉంది, కాబట్టి ఓర్పు చాలా ముఖ్యం.

సింహ రాశి

చంద్రుడి సంచారం సింహరాశి వారికి విజయాలను అందిస్తుంంది.  వృత్తిలో ఎదగడానికి అవకాశాలు లభిస్తాయి. ఆర్థిక లాభాలుంటాయి.  సామాజిక గౌరవం పెరుగుతుంది,  కొత్త బాధ్యతల వల్ల మీ పనిభారం పెరగవచ్చు.

కన్యా రాశి

ఈ రాశివారికి చంద్రుడి సంచారం చాలా శుభప్రదంగా ఉంటుంది . పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి . మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఉద్యోగంలో పదోన్నతికి సంబంధించిన శుభ సూచనలు కనిపించే అవకాశం ఉంది. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది. 

తులా రాశి 

తులారాశి వారికి మిశ్రమ ఫలితాలు ఎదురుకావచ్చు. పనిలో ఉన్న అడ్డంకులు తొలగిపోతాయి. మీ ఖర్చులను నియంత్రించుకోవడం నేర్చుకోండి, లేకపోతే సమస్యలు తలెత్తవచ్చు. ఈ సమయంలో, ఎలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల సలహా తీసుకోండి.

వృశ్చిక రాశి

ఈ సమయం వృశ్చిక రాశి వారికి శుభప్రదంగా పరిగణిస్తారు. డబ్బు, వృత్తి విషయాలలో తొందరపడకుండా ఉండండి. కార్యాలయంలో మీ పై అధికారులతో సంబంధాలను మెరుగుపరుచుకోవడానికి కృషి చేయండి. పూర్వీకుల ఆస్తికి సంబంధించిన ఒక నిర్ణయం మీకు అనుకూలంగా రావచ్చు. 

ధనుస్సు రాశి

చంద్రుని సంచారం సమయంలో ధనుస్సు రాశి వారు సవాళ్లను ఎదుర్కోవచ్చు. పనిలో అంతరాయాలు, ఒత్తిడి సంభవించవచ్చు. ఖర్చులు పెరగవచ్చు, కానీ వ్యాపార ఆర్డర్లు అందుతాయి.

మకర రాశి

ఈ సమయం మకర రాశి వారికి కొత్త అవకాశాలను తీసుకురావచ్చు. ఆదాయం పెరగడం , మీ వృత్తిలో విజయం సాధించడం సాధ్యమవుతుంది. సంతోషకరమైన కుటుంబ వాతావరణం నెలకొంటుంది , మీ కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది.

కుంభ రాశి

కుంభ రాశిలో జన్మించిన వారికి ఈ సమయం మిశ్రమ ఫలితాలను ఇస్తుంది. కొన్ని పనులు విజయవంతమైనట్లు అనిపించినప్పటికీ, ఆర్థిక విషయాలు స్తంభించిపోవచ్చు. ఓపికగా ఉండండి, మీ నిర్ణయాలను తెలివిగా తీసుకోండి. 

మీన రాశి

ఈ నెలలో మీన రాశి వారు కష్టపడి పనిచేయాలి. పెరుగుతున్న ఖర్చులు మిమ్మల్ని కొద్దిగా ఆందోళనకు గురిచేయవచ్చు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మీ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండండి. 

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. పండితులు చెప్పిన వివరాలు, ఆధ్యాత్మిక గ్రంధాల నుంచి సేకరించి అందించిన వివరాలు ఇవి. వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలన్నది పూర్తిగా మీ వ్యక్తిగతం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.

About the author RAMA

జర్నలిజంలో గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నారు.  ప్రముఖ తెలుగు మీడియా సంస్థలు ఈటీవీ, ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతిలో పని చేసిన అనుభవం ఉంది. ఏపీ, తెలంగాణ, రాజకీయ, సినిమా, ఆధ్యాత్మిక వార్తలు సహా వర్తమాన అంశాలపై కథనాలు అందిస్తారు. గ్రాడ్యుయేషన్ పూర్తయ్యాక  MJMC, MSW, PGDPM కోర్సులు పూర్తిచేశారు. జర్నలిజం కోర్సు పూర్తి చేసి పలు తెలుగు మీడియా సంస్థలలో  కంటెంట్ రైటర్‌గా సేవలు అందించారు. జర్నలిజంలో వందేళ్లకుపైగా చరిత్ర ఉన్న ఆనంద్ బజార్ పత్రిక నెట్‌వర్క్ (ABP Network)కు చెందిన తెలుగు డిజిటల్ మీడియా ఏబీపీ దేశంలో నాలుగేళ్లుగా డిప్యూటీ ప్రొడ్యూసర్‌గా విధులు నిర్వర్తిస్తున్నారు. 

Read More

టాప్ హెడ్ లైన్స్

19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! ధనస్సు, మకరం, కుంభం, మీన రాశుల దినఫలాలు!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! సింహం, కన్యా, తులా, వృశ్చిక రాశుల దినఫలం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
19-08-2026 బుధవారం మీ రాశిఫలాలు! మేషం, వృషభం, మిథునం, కర్కాటకం!
India Post Rakhi Offer 2026: రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!
రాఖీ పంపాలా? తపాలా శాఖ కొత్త ఆఫర్లు: వాటర్‌ప్రూఫ్ కవర్లు, స్పీడ్ పోస్ట్ తగ్గింపు!

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
KBR Park Traffic Rules:కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
కేబీఆర్ పార్క్ చుట్టుపక్కల ఉండే వారికి బిగ్ అలర్ట్! బస్టాప్‌ల మార్పుపై పోలీసుల కీలక ప్రకటన!
Konaseema Fishermen Missing:కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
కోనసీమ మత్స్యకారుల గల్లంతుపై సీఎం, డిప్యూటీ సీఎం ఆరా! గాలింపు చర్యలు ముమ్మరం!
Vijay Son Jason Sanjay: గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
గాంధీ జయంతికి విజయ్ తనయుడి సినిమా... సందీప్ కిషన్ 'సిగ్మా' లేటెస్ట్ రిలీజ్ డేట్ ఇదుగో
Embed widget