News
News
వీడియోలు ఆటలు
X

Chanakya Niti: మీకు సంతోషం కావాలా? చాణక్యుడు చెప్పింది వింటే తప్పకుండా దక్కుతుంది

నిజమైన ఆనందం, శాంతి డబ్బు వెంట పరుగెత్తడంలో ల‌భించ‌ద‌ని చాణ‌క్యుడు పేర్కొన్నాడు. తృప్తితోనే అవి సొంత‌మ‌వుతాయ‌ని తెలిపాడు.

FOLLOW US: 
Share:

Chanakya Niti In telugu: స్వర్ణయుగంలో తత్వవేత్తగా, ఆర్థికవేత్తగా, ఆచార్యునిగా మన్ననలు అందుకున్న వ్యక్తి చాణక్యుడు. ఆయ‌న‌కు కౌటిల్యుడు, విష్ణుగుప్తుడ‌నే పేర్లు కూడా ఉన్నాయి. ఆయ‌న రచించిన రాజనీతి గ్రంథం అర్థశాస్త్రంగా ప్రసిద్ధి చెందింది.  అర్థశాస్త్రం ప్రస్తుత సమకాలీన రాజకీయాలకు అద్దం పడుతోంది. భారతీయ అర్థశాస్త్ర పితామహుడిగా ప్రసిద్ధిగాంచిన చాణక్యుడు రాజనీతి, అర్థశాస్త్రాలను ఆకళింపు చేసుకున్నాడు. చాణక్య నీతిలో ఆయన చెప్పిన ప్రతి నియ‌మం మనిషి జీవితంలో తన లక్ష్యాన్ని సాధించేలా ప్రేరేపిస్తుంది. ఆయ‌న‌ విధానాలు కాస్త కఠినంగా అనిపించినా, ఈ కఠినత్వమే జీవిత సత్యం. చాణక్యుడి విధానాలు, ఆలోచనలను పరిగణనలోకి తీసుకుంటే, ఒక వ్యక్తి తన జీవితంలో ఖచ్చితంగా విజయం సాధించగలడు. ఆనందం, శాంతి గురించి చాణ‌క్యుడు ఏం చెప్పాడో తెలుసుకుందాం. 

మనమందరం సంతోషకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటాం. కానీ ఈ లోకంలో ఆనందాన్ని ఎలా పొందాలో కొద్దిమంది మాత్రమే చెప్పగలరు. ఆనందాన్ని వేర్వేరు వ్యక్తులు వివిధ మార్గాల్లో నిర్వచించారు. మనం సానుకూల భావోద్వేగాలను అనుభవించినప్పుడు మనం సంతోషంగా ఉంటాము. అదే సంతోషం. ఆశావాద పద్ధతిలో ఒక వ్యక్తి  మానసిక స్థితినే ఆనందంగా కూడా పరిగణిస్తారు.

ఆనందం అనుభూతి చెందడం చాలా సులభం, వర్ణించడం కష్టం. అంతేకాక, ఆనందం మ‌న‌సు లోపలి నుంచి వ‌చ్చే భావ‌న‌. మీ ఆనందాన్ని ఎవరూ దొంగిలించలేరు. మనం ఆనందాన్ని డబ్బుతో కొనలేం. సానుకూల దృక్ప‌థం, ప్రతికూల ఆలోచనలను నివారించడం ద్వారా మాత్రమే దీనిని సాధించవచ్చు.  డబ్బుతో ఆహారం, విలాసవంతమైన ఇల్లు, ఆరోగ్యకరమైన జీవనశైలితో పాటు మరెన్నో సౌకర్యాలను కొనుగోలు చేయ‌వ‌చ్చు. డబ్బుతో మీరు ఆనందాన్ని కొనులేరు. నిజంగా డబ్బుతోనే ఆనందాన్ని కొనుగోలు చేయగలిగితే, ధనవంతులే భూమిపై అత్యంత సంతోషకరమైన వ్యక్తులుగా ఉంటారు. నిజమైన ఆనందం, శాంతి డబ్బు వెంట పరుగెత్తడంలో లేద‌ని తృప్తి ద్వారానే అవి సొంత‌మ‌వుతాయ‌ని చాణ‌క్యుడు స్ప‌ష్టం చేశాడు.

సంతోషామృతప్తానాం యత్సుఖ్ శాంతిరేవ్ చ.

న చ తదధనలుభ్యానామితశ్చేతశ్చ ధవాతామ్॥

ఆక‌లితో ఉన్న మనుషులకు తృప్తి అనే మకరందంతోనే సుఖం, శాంతి ల‌భిస్తాయి. డబ్బు కోసం పరిగెత్తే వారికి ఆ సుఖం, శాంతి సొంతం కావు అని ఈ శ్లోకంలో చాణ‌క్యుడు తెలిపాడు.

ప్ర‌స్తుత‌ కాలంలో ప్రజలు డబ్బు సాధించాల‌నే కోరికతో తమ కుటుంబాన్ని కూడా విడిచిపెట్టి సంపాద‌న కోసం పరిగెడుతున్నారు. ఈ అలవాటు వారి వ్యక్తిగత జీవితం నాశనం కావడానికి కారణం అవుతుంది. ఎందుకంటే వారు డబ్బు సంపాదనలో నిమగ్నమై తమ చుట్టూ జ‌రుగుతున్న‌ వాటిని పట్టించుకునే స‌మ‌యం లేకుండా ఉంటారు.

సంతృప్తి ఉన్న వ్యక్తి మాత్రమే జీవితంలో ముందుకు సాగి విజయం సాధిస్తాడు. సంతృప్తి ఉన్న వ్య‌క్తి అన్ని విష‌యాల‌కూ ఆరాట‌ప‌డ‌డు. అన‌వ‌స‌ర చింత‌న‌ల‌పై దృష్టి సారించ‌డు. కానీ అతను తన చుట్టూ ఉన్న విషయాలను అర్థం చేసుకుంటాడు. త‌న వారి అవసరాలను తీరుస్తాడు. అందుకే డబ్బు వెంట పరుగెత్తే వ్యక్తి కంటే జీవితాన్ని గడపడానికి తగినంత వనరులు ఉన్న వ్యక్తి సంతోషంగా ఉంటాడని చాణక్యుడు చెప్పాడు.

Also Read:  ఇలాంటి పనులు చేస్తే నవగ్రహాల ఆగ్రహానికి గురికాతప్పదు!

Published at : 10 Apr 2023 05:36 PM (IST) Tags: Chanakya Niti Happy life chanakya niti in telugu chanakya quotes

సంబంధిత కథనాలు

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

జూన్ 4 రాశిఫలాలు, ఈ రాశివారు ఒకరి మాటల్లో కూరుకుపోవద్దు తెలివిగా ఆలోచించండి

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Weekly Horoscope (05-11 June): ఈ వారం ఈ రాశులవారికి  లైఫ్ కొత్తగా ప్రారంభమైనట్టు ఉంటుంది

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాలివి!

Navagrahas Pooja: నవగ్రహాల దర్శనానికి వెళ్లేవారు తెలుసుకోవాల్సిన  ముఖ్యమైన విషయాలివి!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

Chanakya Neeti In Telugu: క‌ష్ట‌కాలంలోనే వీరి నిజ స్వ‌రూపం తెలుస్తుంది..!

Jyeshta Maas Food: జ్యేష్ఠ మాసంలో ఇలాంటి ఆహారం తీసుకుంటే కష్టాలే!

Jyeshta Maas Food: జ్యేష్ఠ మాసంలో ఇలాంటి ఆహారం తీసుకుంటే కష్టాలే!

టాప్ స్టోరీస్

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Odisha Train Accident: రైల్వే నెట్‌వర్క్‌లో కొన్ని లూప్‌హోల్స్‌ ఉన్నాయ్, అసలు సమస్య అదే - నిపుణులు

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Mahesh Babu - Fidaa : మహేష్ బాబు - దీపికా పదుకోన్ - 'ఫిదా' చేసి ఉంటేనా? ఎందుకు 'నో' చెప్పారంటే?

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Katakam Sudarshan: గుండెపోటుతో మావోయిస్టు అగ్రనేత కటకం సుదర్శన్ మృతి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి

Gudivada Amarnath: ఒడిశా ప్రమాదంలో సురక్షితంగా ఏపీ వాసులు, ఒకరు మృతి - మంత్రి గుడివాడ వెల్లడి