zodiac signs Budh Gochar 2022 : వృషభరాశిలో బుధుడు ఈ 4 రాశులవారికి కొన్ని ఇబ్బందులు తప్పవ్
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, బుధ గ్రహం ఏప్రిల్ 25న మేష రాశి నుంచి వృషభ రాశిలోకి ప్రవేశించింది. ఈ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. బుధుడి సంచారం ఏ రాశులవారిని ఇబ్బంది పెడుతుందో ఇక్కడ తెలుసుకోండి...
జ్యోతిషశాస్త్రం ప్రకారం నవగ్రహాల్లో బుధు గ్రహానికి ప్రత్యేక స్థానముంది. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి అనే మూడు నక్షత్రాలకు అధిపతిగా పరిగణిస్తారు. జాతకంలో బుధుడు మంచిస్థానంలో ఉంటే ఆ సమయం వారికి కలిసొస్తుంది. ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. కానీ బుధుడు బలహీనంగా ఉంటే సమస్యల వలయంలో చిక్కుకుంటారు. ఈ గ్రహం తర్కం, తెలివితేటలు, జ్ఞానం, సంతోషానికి ప్రాతినిధ్యంగా పరిగణిస్తారు.బుధుడు 25 ఏప్రిల్ నుంచి జూలై 2 వరకూ వృషభరాశిలో సంచరిస్తాడు. ఆ తర్వాత మిథునంలో సంచరిస్తాడు. ఈ ప్రభావం 12 రాశులపైనా ఉంటుంది. కొన్ని రాశులవారికి శుభప్రదంగా ఉంటే మరికొన్ని రాశుల వారికి చికాకులు, అనారోగ్యం తప్పదు.
Also Read: హనుమాన్ చాలీసా ఎందుకు చదవాలి, పఠిస్తే కష్టాలెందుకు తీరుతాయి
బుధుడి సంచారం ఈ రాశుల వారికి కొన్ని ఇబ్బందలు తప్పవ్
మేషం
బుధుడు సంచరిస్తున్న అన్ని రోజులూ ఈ రాశివారు డబ్బుని ఆచితూచి ఖర్చు చేయాలి. లేదంటే ఆర్థిక నష్టాలు తప్పవ్. వ్యాపారులు కొత్త పెట్టుబడులు పెట్టే ప్రయత్నం చేయవద్దు. ఏవైనా డాక్యుమెంట్స్ పై సంతకాలు చేసేటప్పుడు పూర్తిగా చదవాలి.
మిథునం
ఈ రాశి వారికి బుధుడి సంచారం వల్ల పని విషయంలో గందరగోళంగా ఉంటుంది. ఆర్థికంగా నష్టపోతారు. ఈ సమయంలో మీకు ఒత్తిడి పెరుగుతుంది. చిన్న చిన్న అనారోగ్య సమస్యలతో బాధపడతారు. ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ అవసరం. వ్యాపారస్తులు ఆలోచనాత్మకంగా పని చేయాలి. ఉద్యోగం మారొద్దు. ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నించండి. ఖర్చులు నియంత్రించండి.
తుల
బుధుడు సంచారం తులారాశివారు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి. ఒత్తిడికి దూరంగా ఉండాలి. ఉద్యోగులు కార్యాలయంలో కష్టపడి పని చేయాలి. వ్యాపారంలో ఒడిదుడుకులు ఉంటాయి.బంధుమిత్రులతో మనస్పర్థలు ఏర్పడవచ్చు. వివాదాలకు దూరంగా ఉండండి.
కుంభం
వివాహం చేసుకోవాలి అనుకునేవారికి ఇదే అనుకూల సమయం. అనారోగ్య సూచనలు మాత్రం ఉన్నాయి. మీ పనిపై దృష్టి పెట్టడం కష్టంగా ఉండవచ్చు. రిస్క్ తీసుకోవద్దు. అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తెలివిగా ఖర్చు పెట్టండి.
నవగ్రహ శ్లోకంలో బుధుడి శ్లోకం
ప్రియంగు కలికాశ్యామం రూపేణా ప్రతిమం బుధమ్ |
సౌమ్యం సత్వ గుణోపేతం తం బుధం ప్రణమామ్యహమ్ ||
తాత్పర్యం:
కదంబ వృక్షపు మొగ్గ వలే ఆకుపచ్చని రంగును కలవాడు. తన ఆకారంతో ఎవరితో సాటిలేనివాడును. దేవతగలవాడు ఐన, సత్వ గుణములతో కూడిన వాడు అయిన బుధుడికి నేను నమస్కరిస్తున్నాను.
నోట్: ఆయా రాశిలో ఫలితాలు మొత్తం ఒకే వ్యక్తికి వర్తిస్తాయని భావించరాదు. మీ జాతకం, గ్రహస్థితి ఆధారంగా మార్పులుంటాయి. వ్యక్తిగత వివరాల కోసం అనుభవజ్ఞులైన జ్యోతిష్యులను సంప్రదించాలి. కొన్ని పుస్తకాలు, పండితుల సూచనల ఆధారంగా రాసిన వివరాలివి...వీటిని ఎంతవరకూ పరిగణలోకి తీసుకోవాలి అనేది పూర్తిగా మీ వ్యక్తిగతం.
Also Read: సంవత్సరంలో మొదటి సూర్యగ్రహణం, ఈ ప్రభావం మీ రాశిపై ఏమేరకు ఉందో తెలుసుకోండి
Also Read: రాహువు రివర్సయ్యాడు, ఈ రాశులవారు కష్టాల నుంచి బయటపడి ఆర్థికంగా బలపడతారు